Naga Chaitanya Custody First Look Out: భయపెడుతున్న నాగచైతన్య.. కస్టడీ మూవీ ఫస్ట్‌ లుక్‌-naga chaitanya custody first look out on his birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Naga Chaitanya Custody First Look Out On His Birthday

Naga Chaitanya Custody First Look Out: భయపెడుతున్న నాగచైతన్య.. కస్టడీ మూవీ ఫస్ట్‌ లుక్‌

HT Telugu Desk HT Telugu
Nov 23, 2022 11:05 AM IST

Naga Chaitanya Custody First Look Out: నాగచైతన్య తన ఫియరీ లుక్‌తో భయపెడుతున్నాడు. బుధవారం (నవంబర్‌ 23) తన బర్త్‌ డే సందర్భంగా రిలీజైన కస్టడీ మూవీ ఫస్ట్‌ లుక్‌లో చైతూ చాలా ఇంటెన్సిటీతో కనిపిస్తున్నాడు.

కస్టడీ మూవీలో నాగ చైతన్య
కస్టడీ మూవీలో నాగ చైతన్య

Naga Chaitanya Custody First Look Out: నాగచైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ఎన్సీ22. ఈ సినిమాకు కస్టడీ అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెట్టారు. అంతేకాదు బుధవారం (నవంబర్ 23) మూవీ ఫస్ట్‌ లుక్ కూడా రిలీజ్ చేశారు. నిజానికి ఒక రోజు ముందే అంటే మంగళవారమే ప్రీ లుక్‌ పేరుతో ఈ ఫస్ట్‌ లుక్‌పై ఆసక్తి పెంచారు.

ఇక అసలు పోస్టర్‌తో మూవీపై అంచనాలు పెంచేశారు. నాగచైతన్య బర్త్‌ డే సంద్భంగా ఈ ఫస్ట్‌ లుక్‌ రిలీజైంది. ఇందులో చైతూ తన ఇంటెన్సిటీ లుక్‌తో భయపెడుతున్నాడు. ఈ మూవీలో చై శివ అనే ఓ పవర్‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ ఫస్ట్‌ లుక్‌లో చుట్టూ పోలీసులు అతన్ని గట్టిగా పట్టుకోవడం, గన్స్‌ అన్నీ అతని వైపే గురిపెట్టి ఉండటం ఆసక్తి రేపుతోంది. అలాంటి పరిస్థితుల్లోనూ చైతూ చాలా కూల్‌గా కనిపిస్తున్నాడు.

కస్టడీ మూవీకి "ఎ వెంకట్‌ ప్రభు హంట్‌" అనే ట్యాగ్‌లైన్‌ పెట్టడం విశేషం. ఈ తమిళ డైరెక్టర్‌ చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఈ యాక్షన్‌ డ్రామా మూవీపై ఫస్ట్‌ లుక్‌ అంచనాలు పెంచేసేలా ఉంది. ఈ మూవీలో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తుండగా.. అరవింద్‌ స్వామి, ప్రియమణి, సంపత్‌, శరత్‌కుమార్‌, వెన్నెల కిశోర్‌ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్‌ను ఇళయరాజ, అతని తనయుడు యువన్‌ శంకర్ రాజా కలిసి ఇస్తుండటం విశేషం. దీంతో మ్యూజిక్‌ సూపర్‌ హిట్‌ కావడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. శ్రీనివాస చిత్తూరి ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి చైతన్యను ఓ కొత్త లుక్‌లో చూపించబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఎలాంటి మ్యాజిక్‌ చేస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.

ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచేసిన కస్టడీ మూవీ మేకర్స్
ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచేసిన కస్టడీ మూవీ మేకర్స్
IPL_Entry_Point