Paatal lok 2: సూపర్‌హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ వస్తోంది- ఏ ఓటీటీలో...ఎప్పటి నుంచి చూడాలంటే?
23 December 2024, 13:56 IST
Paatal lok 2: హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన పాతాళ్ లోక్ వెబ్‌సిరీస్‌కు సీజన్ 2 రాబోతుంది. పాతాళ్ లోక్ 2 అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వె బ్‌సిరీస్‌లో జై దీప్ అహ్లవత్ లీడ్ రోల్‌లో కనిపించబోతున్నాడు.
.పాతాళ్ లోక్ 2
పాతాళ్ లోక్ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్ రాబోతోంది. సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి. పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ ఇండియాలోనే టాప్ టెన్ బెస్ట్ వెబ్‌సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్‌లో ఏకంగా ఐదు పురస్కారాలను సొంతం చేసుకున్నది. ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన వెబ్‌సిరీస్‌లలో ఒకటిగా పాతాళ్ లోక్ రికార్డ్ క్రియేట్ చేసింది.
2020లో...
పాతాళ్ లోక్ ఫస్ట్ సీజన్....2020లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ వెబ్‌సిరీస్‌లో జై దీప్ అహ్లవత్, గుల్ పనగ్, స్వస్థిక ముఖర్జీ, నీరజ్ కబీ కీలక పాత్రల్లో నటించారు. సుదీప్ శర్మ క్రియేటర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్‌కు అవినాష్ అరుణ్, ప్రాసిత్ రాయ్ దర్శకత్వం వహించారు.
అమెజాన్ ప్రైమ్‌లో...
ఈ సూపర్ హిట్ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్ రాబోతోంది. పాతాల్ లోక్ 2 స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ సోమవారం రివీల్ చేశారు. జనవరి 17 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో పాతాళ్ లోక్ సీజన్ 2 స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సగం మనిషి ముఖం, మరో సగం జంతువు కళేబరంతో జైదీప్ అహ్లువాలియా కనిపిస్తోన్నాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సామాజిక అంతరాలతో...
ఛానెల్ హెడ్ మీద జరిగిన హత్య ప్రయత్నాన్ని ఓ పోలీస్ ఆఫీసర్ అడ్డుకుంటాడు. అనుమానితులను అరెస్ట్ చేస్తాడు. వారి నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా నిజాలు రాబట్టాడు. అతడి ఇన్వేస్టిగేషన్‌లో బయటపడిన నిజాలేమిటనే పాయింట్‌తో పాతాళ్ లోక్ వెబ్‌సిరీస్ తెరకెక్కింది.
సమాజంలో ధనిక, పేద మంధ్య ఉండే అంతరాలను, మీడియా వ్యవస్థలోని లోతుపాతుల్ని అంతర్లీనంగా ఈ వెబ్‌సిరీస్‌లో మేకర్స్ చూపించారు. సొసైటీలో పలుకుబడి కలిగిన కొందరు వ్యక్తుల పేరుప్రఖ్యాతులు, ఉనికి కోసం వేసే ఎత్తుల్లో సామాన్యులు ఎలా బలిపశువులుగా మారుతారన్నది ఆలోచనాత్మకంగా పాతాళ్‌లోక్ వెబ్‌సిరీస్‌లో ప్రజెంట్ చేశారు.
ఐదు భాషల్లో...
సీజన్ 2లో మరో సామాజిక సమస్యను ఆవిష్కరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. పాతాల్‌లోక్ 2లో తిలోత్తమ షోమే, నగేష్ కుకునూర్‌తోపాటు మరికొందరు కొత్త నటీనటులు కనిపిస్తారని సమాచారం. సీజన్ మొత్తం జై దీప్ పాత్ర చుట్టే సాగుతుందని సమాచారం. అమెజాన్ ప్రైమ్‌లో హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మేకర్స్ ఈ సిరీస్‌ను రిలీజ్ చేయబోతున్నారు.