తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Oppenheimer Ott: 13 ఆస్కార్ నామినేష‌న్స్ ద‌క్కించుకున్న హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది!

Oppenheimer OTT: 13 ఆస్కార్ నామినేష‌న్స్ ద‌క్కించుకున్న హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది!

21 February 2024, 11:10 IST

google News
  • Oppenheimer OTT: హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఓపెన్‌హైమ‌ర్ ఓటీటీలోకి రాబోతోంది. ప‌ద‌మూడు ఆస్కార్ నామినేష‌న్స్ ద‌క్కించుకున్న జియో సినిమా ఓటీటీలో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఓపెన్‌హైమ‌ర్ ఓటీటీ రిలీజ్ డేట్‌
ఓపెన్‌హైమ‌ర్ ఓటీటీ రిలీజ్ డేట్‌

ఓపెన్‌హైమ‌ర్ ఓటీటీ రిలీజ్ డేట్‌

Oppenheimer OTT: హాలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఓపెన్‌హైమ‌ర్ ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఎనిమిది నెల‌ల త‌ర్వాత ఓటీటీ ఆడియెన్స్ ముందుకు ఈ హాలీవుడ్ మూవీ రాబోతోంది. మార్చి 21 నుంచి జియో సినిమా ఓటీటీలో ఓపెన్‌హైమ‌ర్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ హాలీవుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను జియో సినిమా అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. అయితే ప్రీమియ‌ర్ క‌స్ట‌మ‌ర్స్ మాత్ర‌మే ఓపెన్‌హైమ‌ర్ మూవీని జియో సినిమా ఓటీటీలో వీక్షించ‌వ‌చ్చు. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, ద‌క్షిణాది భాష‌ల్లో ఓపెన్‌హైమ‌ర్ స్ట్రీమింగ్ ఉండ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ప‌ద‌మూడు ఆస్కార్ నామినేష‌న్స్‌

ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ఆస్కార్ నామినేష‌న్స్‌లో ఓపెన్ హైమ‌ర్ అద‌ర‌గొట్టింది. ఏకంగా ప‌ద‌మూడు విభాగాల్లో నామినేష‌న్స్‌ను ద‌క్కించుకున్న‌ది. బెస్ట్ పిక్చ‌ర్‌, బెస్ట్ యాక్ట‌ర్‌, బెస్ట్ డైరెక్ట‌ర్‌. బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌తో పాటు ప‌లు విభాగాల్లో నామినేష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో అత్య‌ధిక నామినేష‌న్స్ ద‌క్కించుకున్న మూవీగా ఓపెన్ హైమ‌ర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు క‌నీసం ప‌ది వ‌ర‌కు ఆస్కార్ అవార్డులు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని హాలీవుడ్ సినీ వ‌ర్గాలు చెబుతోన్నాయి. మార్చి 11న ఆస్కార్ అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

బాఫ్టాలో రికార్డ్‌...

రెండు రోజుల క్రితం ప్ర‌క‌టించిన 77వ బ్రిటీష్ అకామెడీ ఫిల్మ్ అవార్డ్స్‌లో (బాఫ్టా) ఓపెన్‌హైమ‌ర్ ఏకంగా ఏడు అవార్డుల‌ను గెలుచుకున్న‌ది ఓపెన్‌హైమ‌ర్‌. బాఫ్టా చ‌రిత్ర‌లో అత్య‌ధిక అవార్డులు గెలుచుకున్న సినిమాల్లో ఒక‌టిగా ఓపెన్‌హైమ‌ర్‌ నిలిచింది. బెస్ట్ డైరెక్ట‌ర్‌గా క్రిస్టోఫ‌ర్ నోల‌న్‌, బెస్ట్ యాక్ట‌ర్‌గా సిలియాన్ మ‌ర్ఫీ, బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్ బాఫ్టా అవార్డుల‌ను ద‌క్కించుకున్న‌ది. క్రిస్టోఫ‌ర్ నోల‌న్‌కు ఇదే ఫ‌స్ట్ బాఫ్టా అవార్డ్ కావ‌డం గ‌మ‌నార్హం. బాఫ్టా అవార్డుల్లో ప‌ద‌మూడు విభాగాల్లో పోటీప‌డిన ఈ మూవీ ఏడు అవార్డుల‌ను సొంతం చేసుకున్న‌ది.

తొమ్మిదింత‌ల వ‌సూళ్లు...

దాదాపు వంద మిలియ‌న్ డాల‌ర్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఓపెన్‌హైమ‌ర్ మూవీ 900 మిలియ‌న్ల డాల‌ర్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. నిర్మాత‌ల‌కు తొమ్మిదింత‌ల‌ లాభాల‌ను మిగిల్చింది. 2023లో హాలీవుడ్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూడో మూవీగా రికార్డ్ నెల‌కొల్పింది. వ‌ర‌ల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా రికార్డ్ నెల‌కొల్పింది.

అణుబాంబు సృష్టిక‌ర్త బ‌యోపిక్‌...

అణుబాంబు సృష్టిక‌ర్త ఓపెన్‌హైమ‌ర్ జీవితం ఆధారంగా ద‌ర్శ‌కుడు క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ఓపెన్‌హైమ‌ర్ మూవీని తెర‌కెక్కించాడు. రెండో ప్ర‌పంచ‌యుద్ద స‌మ‌యంలో అణుబాంబును త‌యారు చేయ‌డానికి ఓపెన్ హైమ‌ర్ ఎలాంటి ప్ర‌యోగాలు చేశాడు? త‌న‌ను తాను ప్ర‌పంచ‌వినాశ‌కారిగా ఓపెన్ హైమ‌ర్ ఎందుకు ప్ర‌క‌టించుకోవాల్సివ‌చ్చింది. ఈ క్ర‌మంలో అత‌డు ఎదుర్కొన్న సంఘ‌ర్ష‌ణ‌ను ఓపెన్‌హైమ‌ర్ సినిమాలో డైరెక్ట‌ర్ క్రిస్టోఫ‌ర్ నోల‌న్ రియ‌లిస్టిక్‌గా చూపించాడు. ఈ సినిమాలో ఓపెన్‌హైమ‌ర్‌గా సిలియ‌న్ మార్ఫీ, అమెరికా అధ్య‌క్షుడు లూయిస్ స్ట్రాస్‌గా రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం