తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi With Oscar: ఆస్కార్ పట్టుకొని తెగ మురిసిపోయిన చిరంజీవి.. చంద్రబోస్‌పై ప్రశంసల వర్షం

Chiranjeevi with Oscar: ఆస్కార్ పట్టుకొని తెగ మురిసిపోయిన చిరంజీవి.. చంద్రబోస్‌పై ప్రశంసల వర్షం

Hari Prasad S HT Telugu

30 March 2023, 20:02 IST

  • Chiranjeevi with Oscar: ఆస్కార్ పట్టుకొని తెగ మురిసిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. నాటు నాటు పాట రచయిత చంద్రబోస్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతనికి సన్మానం చేశాడు.

ఆస్కార్ ను చూస్తూ మురిసిపోతున్న చిరంజీవి
ఆస్కార్ ను చూస్తూ మురిసిపోతున్న చిరంజీవి

ఆస్కార్ ను చూస్తూ మురిసిపోతున్న చిరంజీవి

Chiranjeevi with Oscar: ఆస్కార్ అందుకోవాలన్నది ఎలాంటి ఆర్టిస్ట్ కైనా ఓ కల. ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ఇది. అలాంటి అవార్డు మొదలైన 95 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ వేదికపై తెలుగు మాట, పాట వినిపించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు వాళ్లు గర్వించే విషయం.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ అవార్డు అందుకొని తిరిగి సొంతగడ్డపై అడుగుపెట్టిన మూవీ టీమ్ ను చిరంజీవి ఘనంగా సత్కరించాడు. ఈ మధ్య రామ్ చరణ్ బర్త్ డే వేడుకకు హాజరైన టీమ్ అందరికీ శాలువాలు కప్పి సన్మానించాడు. అయితే అప్పుడు ఈ నాటు నాటు పాట రచయిత చంద్రబోస్ రాలేకపోయాడు.

తాజాగా గురువారం (మార్చి 30) భోళా శంకర్ మూవీ సెట్ లో చిరు అతన్ని కలిశాడు. ఈ సందర్భంగా చంద్రబోస్ దగ్గర ఉన్న ఆస్కార్ చేతుల్లోకి తీసుకొని చిరు తెగ మురిసిపోయాడు. ఆ అవార్డును సగర్వంగా పైకి ఎత్తుతూ ఆనందించాడు. చంద్రబోస్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకొని అభినందించాడు. ఈ మూవీ టీమ్ చాలా రోజుల కిందటే వచ్చినా ఇప్పటి వరకూ ఒక్క చిరంజీవి తప్ప ప్రభుత్వం కానీ, సినీ పెద్దలు కానీ సన్మానించలేదు.

తాజా తాను ఆస్కార్ పట్టుకున్న ఫొటోలను కూడా చిరంజీవి ట్విటర్ లో షేర్ చేశాడు. "చంద్రబోస్.. 95 ఏళ్లలో ఆస్కార్ వేదికపై వినిపించిన తెలుగు మాటలు నువ్వు అందించడం అద్భుతమైన అనుభూతి కలిగిస్తోంది. ఆస్కార్ గెలిచి సగర్వంగా తిరిగి వచ్చిన నీకు స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది" అంటూ చిరు ఆ ఫొటోలను ట్వీట్ చేశాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.