Chiranjeevi Guinness Record: చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డు.. వాళ్లకు అంకితమిచ్చిన మెగాస్టార్
23 September 2024, 16:06 IST
- Chiranjeevi Guinness Record: చిరంజీవి తన గిన్నిస్ వరల్డ్ రికార్డు ను తనతో పని చేసిన నిర్మాతలు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లకు అంకితమిచ్చాడు. ఆదివారం (సెప్టెంబర్ 22) అతడు ఈ అవార్డును ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్న విషయం తెలిసిందే.
చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డు.. వాళ్లకు అంకితమిచ్చిన మెగాస్టార్
Chiranjeevi Guinness Record: మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలుసు కదా. తన నాలుగు దశాబ్దాలకుపైగా కెరీర్లో 156 సినిమాల్లో 537 సాంగ్స్, 24 వేలకుపైగా డ్యాన్స్ మూవ్స్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆదివారం (సెప్టెంబర్ 22) తాను ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్న ఈ అవార్డును చిరు.. తనతో పనిచేసిన వాళ్లందరికీ అంకితమిచ్చాడు.
వాళ్లందరికీ ఈ అవార్డు అంకితం: చిరంజీవి
సోమవారం (సెప్టెంబర్ 23) చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాసేపటి కిందట అతడు తెలుగు, ఇంగ్లిష్ లలో ఈ ట్వీట్ చేశాడు. అందులో తనతో పనిచేసిన వాళ్లందరికీ ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు ఘనత సొంతమని అనడం గమనార్హం.
"ఈ Guinnes world record ఘనత, నాతో చిత్రాలు నిర్మించిన నిర్మాతలకి, నన్ను నడిపించిన దర్శకులకి, అద్భుతమైన పాటలు ఇచ్చిన సంగీత దర్శకులకి, ఇన్ని విభిన్నమైన స్టెప్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్లకు దక్కుతుంది. నన్ను అమితంగా ప్రేమించి, నా డ్యాన్సెస్ ఇష్టపడిన ప్రతి ఒక్కరికి ఇది అంకితం" అని చిరు అన్నాడు.
"నా స్నేహితులు, కొలీగ్స్, ప్రియమైన అభిమానులు, ఫ్యామిలీ, ఇండస్ట్రీ సహచరులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, నాపై బేషరతు ప్రేమను చూపిస్తున్న ప్రతి ఒక్క శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు. నేను ఎంతగా రుణపడి ఉన్నానో చెప్పడానికి మాటలు చాలవు" అని చిరంజీవి చెప్పాడు.
చిరు రికార్డు ఇలా..
156 సినిమాల్లో 537 పాటల్లో చిరంజీవి 24,000 డ్యాన్స్ మూవ్స్ చేసినట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. భారత సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రొలిఫిక్ నటుడిగా, డ్యాన్సర్‌గా అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీకే ఇది గర్వకారణంగా నిలిచింది.
మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రకటించే ఈవెంట్ హైదరాబాద్‍లో నేడు (సెప్టెంబర్ 22) జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ హాజరయ్యారు. చిరంజీవి ప్రపంచ రికార్డుపై గిన్నిస్ ప్రతినిధి మాట్లాడారు. భారత సినీ చరిత్రలో అత్యంత ప్రముఖమైన (ప్రొలిఫిక్) నటుడిగా, డ్యాన్సర్‌గా చిరంజీవిని గుర్తిస్తున్నట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి చెప్పారు.