Biggest Flop Movie: గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన ఈ బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ గురించి మీకు తెలుసా?-biggest flop movie akshay kumar bollywood movie boss created guinness book of world records with its large poster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Biggest Flop Movie: గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన ఈ బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ గురించి మీకు తెలుసా?

Biggest Flop Movie: గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన ఈ బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ గురించి మీకు తెలుసా?

Hari Prasad S HT Telugu
Sep 20, 2024 07:02 PM IST

Biggest Flop Movie: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాల్లో ఇదీ ఒకటి. కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. మైఖేల్ జాక్సన్ మూవీని వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించిన ఈ మూవీ గురించి మీకు తెలుసా?

గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన ఈ బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ గురించి మీకు తెలుసా?
గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన ఈ బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ గురించి మీకు తెలుసా?

Biggest Flop Movie: బాలీవుడ్ చరిత్రలో ఎన్నో ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి. స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అలాంటిదే యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన బాస్ మూవీ కూడా. 2013లో రిలీజైన ఈ మూవీ.. అతని కెరీర్లోని అతిపెద్ద ఫ్లాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేసిన సినిమాగా ప్రత్యేకత సాధించింది.

అక్షయ్ కుమార్ బాస్ మూవీ..

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ వసూలు చేసే హీరోల్లో ఒకడిగా అక్షయ్ కుమార్ కు పేరుంది. అయితే అతని కెరీర్లో ఎన్ని హిట్స్ ఉన్నాయో.. అన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి. అందులో ఒక మూవీయే ఈ బాస్. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 16, 2013న రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది.

రూ.70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.84 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. అందులోనూ షేర్ వసూళ్లు కేవలం రూ.49 కోట్లు మాత్రమే. దీంతో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. అక్షయ్ కెరీర్లో ఇదొక బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మిగిలింది.

మలయాళ మూవీకి రీమేక్..

అక్షయ్ కుమార్ నటించిన ఈ బాస్ మూవీ.. మలయాళంలో వచ్చిన పోక్కిరి రాజా మూవీకి రీమేక్. ఆ మూవీలో మెగాస్టార్ మమ్ముట్టి నటించాడు. అంతేకాదు పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియ శరణ్, సిద్ధిఖీ, నెడుమూడి వేణు, విజయరాఘవన్, సలీం కుమార్ లాంటి వాళ్లు కూడా నటించారు.

ఈ మూవీ మలయాళంలో బ్లాక్‌బస్టర్ అయింది. కానీ హిందీ రీమేక్ మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. అక్షయ్ కుమార్ కు ఇదొక చేదు అనుభవంగా మిగిలిపోయింది. నిజానికి అదే ఏడాది అక్షయ్ నటించిన మరో మూవీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా కూడా ఫ్లాపయింది.

బాస్ గిన్నిస్ రికార్డు

అక్షయ్ కెరీర్లో అతిపెద్ద ఫ్లాప్ మూవీస్ లో ఒకటిగా బాస్ నిలిచినా.. ఈ సినిమా పేరిట ఓ గిన్నిస్ రికార్డు ఉందన్న విషయం మీకు తెలుసా? అందులోనూ మైఖేల్ జాక్సన్ మూవీ దిజ్ ఈజ్ ఇట్ పేరిట ఉన్న రికార్డును ఈ బాస్ బ్రేక్ చేసింది. బాస్ మూవీ పోస్టర్ ఆ రికార్డును సాధించింది.

అప్పట్లో మేకర్స్ ఈ పోస్టర్ ను యూకేలోని లిటిల్ గ్రాన్స్‌డెన్ ఎయిర్‌ఫీల్డ్ లో లాంచ్ చేశారు. ఇది అతిపెద్ద సినిమా పోస్టర్ గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. అంత వరకు దిజ్ ఈజ్ ఇట్ పేరుతో ఉన్న ఆ రికార్డును ఈ బాస్ తిరగరాసింది.