తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bsnl Free Intranet Tv: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. ఓటీటీప్లేతో కలిసి ఫ్రీగా 300కుపైగా లైవ్ టీవీ ఛానెల్స్.. వాళ్లకు మాత్రమే

BSNL free intranet tv: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. ఓటీటీప్లేతో కలిసి ఫ్రీగా 300కుపైగా లైవ్ టీవీ ఛానెల్స్.. వాళ్లకు మాత్రమే

Hari Prasad S HT Telugu

23 December 2024, 19:44 IST

google News
  • BSNL free intranet tv: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఓటీటీప్లేతో కలిసి తన ఇంట్రానెట్ టీవీలో భాగంగా 300కుపైగా లైవ్ ఛానెల్స్ ను ఫ్రీగా అందిస్తోంది. అయితే ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టులో భాగంగా పుదుచ్చెరిలోని బీఎస్ఎన్ఎల్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. ఓటీటీప్లేతో కలిసి ఫ్రీగా 300కుపైగా లైవ్ టీవీ ఛానెల్స్.. వాళ్లకు మాత్రమే
బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. ఓటీటీప్లేతో కలిసి ఫ్రీగా 300కుపైగా లైవ్ టీవీ ఛానెల్స్.. వాళ్లకు మాత్రమే

బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. ఓటీటీప్లేతో కలిసి ఫ్రీగా 300కుపైగా లైవ్ టీవీ ఛానెల్స్.. వాళ్లకు మాత్రమే

BSNL free intranet tv: బీఎస్ఎన్ఎల్ తన యూజర్ బేస్ పెంచుకోవడానికి రకరకాల ఆఫర్లతో యూజర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఓటీటీప్లే (OTTPlay)తో చేతులు కలిపింది. పుదుచ్చెరిలోని తమ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ ఇంట్రానెట్ టీవీ (BiTV) ద్వారా 300కుపైగా లైవ్ టీవీ ఛానెల్స్ ఫ్రీగా అందిస్తోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతానికి అక్కడి యూజర్లకు ఈ సేవలను అందిస్తోంది.

మొబైల్లో ఇంట్రానెట్ టీవీ.. ఫుల్ ఎంటర్టైన్మెంట్

బీఎస్ఎన్ఎల్ (BSNL) కస్టమర్లకు తమ ఇంట్రానెట్ టీవీ ద్వారా కలిగే ప్రయోజనాల గురించి కూడా ఆ సంస్థ ఓ ప్రకటనలో వివరించింది.

- లైవ్ టీవీతోపాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలను ఫ్రీగా చూడొచ్చు.

- బీఎస్ఎన్ఎల్ సెక్యూర్ మొబైల్ ఇంట్రానెట్ ద్వారా అత్యుత్తమ వీడియో క్వాలిటీతో నిరంతరాయంగా స్ట్రీమింగ్ అవుతుంది

- ప్రస్తుతానికి పుదుచ్చెరిలో ఈ ప్లాన్ తీసుకొచ్చినా జనవరిలో ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారు.

బీఎస్ఎన్ఎల్ తో కలిసి ఈ ఆఫర్ తీసుకురావడంపై ఓటీటీప్లే సీఈవో అవినాష్ ముదలియార్ స్పందించారు. "ఈ కొత్త BiTV ఇన్నోవేషన్ ద్వారా వరల్డ్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ ను ఇండియా వ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అందించబోతున్నందుకు గర్వంగా ఉంది.

ఇండియాలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ను బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు చూసే విధానాన్ని సంపూర్ణంగా మార్చేయబోతున్నాం" అని అన్నారు. ఓటీటీప్లే ఓ ఓటీటీ అగ్రిగేటర్. దీని ద్వారా 37 ప్రీమియర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, 500కుపైగా లైవ్ టీవీ ఛానెల్స్ అందిస్తున్నారు.

బీఎస్ఎన్ఎల్ నేషనల్ వై-ఫై రోమింగ్ ఫెసిలిటీ

ఈ ఏడాది అక్టోబర్ లో దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ వై-ఫై రోమింగ్ ఫెసిలిటీని తీసుకొచ్చింది. తాజాగా మనదిపట్టు అనే గ్రామం పూర్తి వై-ఫై ఎనేబుల్ చేసిన రెండో గ్రామంగా నిలిచింది. వై-ఫై హాట్‌స్పాట్స్ ద్వారా బీఎస్ఎన్ఎల్, నాన్ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు కూడా యాక్సెస్ పొందవచ్చు.

ఈ సర్వీస్ పొందడానికి ఆయా కస్టమర్లు తమ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక పుదుచ్చెరిలోనే బీఎస్ఎన్ఎల్ ఫైబర్ ఆధారిత టీవీ (ఐఎఫ్‌టీవీ) ఇప్పుడు అందరు ఎఫ్‌టీటీహెచ్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా పూర్తి ఉచితంగా 500కుపైగా లైవ్ టీవీ ఛానెల్స్ చూడొచ్చు.

తదుపరి వ్యాసం