Brahmamudi October 25th Episode: బ్రహ్మముడి- అటెండర్‌గా రాజ్- రుద్రాణికి డౌట్- కంపెనీపై అనామిక దెబ్బ- కావ్యకు వార్నింగ్
25 October 2024, 8:11 IST
Brahmamudi Serial October 25th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 25 ఎపిసోడ్‌లో రాజ్‌పై ఆపరేషన్ ఇగో స్టార్ట్ చేస్తున్నామని కనకంకు అపర్ణ, ఇందిరాదేవి చెబుతారు. ఆ మాటలు విన్న రుద్రాణి అనుమాన పడుతుంది. కానీ, చెప్పరు. దాంతో స్వప్న వచ్చి మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేయాలని చూస్తున్నారు అని చెబుతుంది.
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 25 ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మొదటి రోజు ఆఫీస్ ఎలా ఉందే. అల్లుడు గారు ఏమైనా అన్నారా అని కనకం అడుగుతుంది. ఎలా జరగకూడదో అలాగే జరిగింది. పీక పిసికి చంపడం ఒక్కటే తక్కువ అని కావ్య అంటుంది. ఆయన స్థానంలో నువ్వు వెళ్లావ్‌గా ఆ మాత్రం కోపం ఉంటుంది. మరి నువ్వు తగ్గి మాట్లాడావా అని కనకం అంటుంది.
కోప్పడిన కావ్య
నేను తగ్గే మాట్లాడాను. ఆయనే నన్ను తొక్కాలని చూస్తున్నారు. నేనుండగా ఆఫీస్‌లో అడుగుపెట్టను అని తాతయ్యమీద దండయాత్రకు వెళ్లారు అని కావ్య చెబుతుంది. అయ్యయ్యో అల్లుడు గారు ఆఫీస్‌కు రారా అని కనకం అంటే.. అది నాకెలా తెలుస్తుంది. అది ఇవాళ అక్కడ జరిగే కురుక్షేత్రాన్ని బట్టి తెలుస్తుంది. కావాలంటే నువ్వే ఫోన్ చేసి తెలుసుకో అని కోప్పడి వెళ్లిపోతుంది కావ్య.
నేను కాల్ చేస్తే మాటలతోనే చంపేస్తారు. ఎవరికీ చేయాలో వారికే చేస్తాను అని ఇందిరాదేవికి కాల్ చేస్తుంది కనకం. రాజ్ ఆఫీస్ నుంచి రావడం గురించి, మళ్లీ ఆఫీస్‌కు వెళ్తారా అని అడుగుతుంది. మేముండగా నీకెందుకు కంగారు అని అపర్ణ అంటుంది. అంటే ఇప్పుడు మీరు వెళ్లి బతిమిలాడి పంపిస్తారా అని కనకం అంటుంది. బతిమిలాడటానికి వాడేం చిన్నపిల్లాడు. ఆరడుగులు పెరిగిన అడ్డగాడిద అని ఇందిరాదేవి అంటుంది.
గాడిద ఆరు అడుగులు ఉండదు కదండి అని కనకం అంటే.. అవసరమైన విషయాలు మానేసి గాడిద గురించి పట్టించుకుంటావేంటే గాడిద అని ఇందిరాదేవి తిడుతుంది. గాడిద కాదు అడ్డ గాడిద అని తిట్టండి. ముందు మా అల్లుడి గారిని ఎలా ఒప్పిస్తున్నారో చెప్పండి అని కనకం అడుగుతుంది. వాడు ఇగోతో వచ్చాడు. అదే ఇగోను రెచ్చగొట్టి ఆఫీస్‌కు పంపిస్తున్నాం. ఈరోజు నుంచే ఆపరేషన్ ఇగో మొదలుపెడుతున్నాం అని ఇద్దరు ఒకేసారి అంటారు.
ఆపరేషన్ ఇగో
అప్పుడే రుద్రాణి వచ్చి అనుమానంగా చూస్తుంది. హమ్మయ్యా అది చేయండి అని కనకం అంటే.. ఈ ఆపరేషన్‌లో నీ సహాయం కూడా కావాలి అని అపర్ణ, ఇందిరాదేవి అంటారు. తప్పకుండా మీరు రింగ్ ఇస్తే ఇలా వస్తాను. మీరు ఆపరేషన్ ఇగో మొదలుపెట్టండి అని కనకం కాల్ కట్ చేస్తుంది. ఆపరేషన్ ఇగో అనగానే కనకానికి పూనకం వచ్చినట్లు ఉందని ఇందిరాదేవి అంటే.. వాడి ఇగోను రెచ్చగొట్టడం అంత ఈజీనా అని అపర్ణ అంటుంది.
రుద్రాణి వచ్చి ఇగోని రెచ్చగొట్టాలని అంటున్నారు. ఎవరికి అని అంటుంది. వచ్చిందమ్మా. విలక్షణ నటి. పాము చెవులు పెట్టుకుని వినేస్తుంది. ఇంకా ఎన్ని అవార్డ్‌లు కావాలి అని ఇందిరాదేవి అంటుంది. క్యాన్సర్ అని నాటకం ఆడింది కనకం. నేను నిజాలే మాట్లాడాను అని రుద్రాణి అంటుంది. కనకం పిచ్చిదిలే. నీ అంత నటించలేదు అని ఇందిరాదేవి అంటే.. మాట మార్చింది చాలు ఎవరి ఇగో గురించి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది రుద్రాణి.
చెబితే ఆ పని కూడా చెడగొట్టాలని చూస్తున్నావా. అది నీ వల్ల కాదు అని వెళ్లిపోతారు అపర్ణ, ఇందిరాదేవి. వీళ్లిద్దరు కలిసి ఏదో గూడు పుఠానీ చేస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి అని రుద్రాణి అనుకుంటే.. నాకు తెలుసు. నేను చెప్పనా అని స్వప్న ఎంట్రీ ఇస్తుంది. నువ్వు నాకు నిజాలు చెబుతావా. నాకు నష్టమేదైనా జరుగుతుందంటే అది నీవల్లే అని రుద్రాణి అంటుంది. అలా అనుకునే మీ వెనుక జరిగేది గ్రహించట్లేదు. మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేయాలని చూస్తున్నారు అని స్వప్న చెబుతుంది.
బయటకు గెంటేయాలని
ఏంటీ నన్ను గెంటేయాలని చూస్తున్నారా అని రుద్రాణి షాక్ అవుతుంది. నిన్నే కాదు. మీ అబ్బాయిని కూడా గెంటేయాలని అనుకుంటున్నారు అని స్వప్న చెబుతుంది. మేము వెళ్తే నువ్వు కూడా బయటకు రావాలి అని రుద్రాణి అంటుంది. నేను మీలా బేవర్స్ బ్యాచ్ కాదు. తాతయ్య గారు నాకు ఆస్తి రాసిచ్చారు. దాంతో బతికేస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి అని వెళ్లిపోతుంది స్వప్న. ఇది కావాలనే డైవర్ట్ చేస్తుంది. మా అమ్మ వదినా ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవాలి అని రుద్రాణి అనుకుంటుంది.
మరోవైపు కల్యాణ్ ఆటో డ్రైవర్ డ్రెస్‌వైపు చూస్తుంటాడు. అప్పు వచ్చి ఎందుకలా చూస్తున్నావ్ అని అంటుంది. ఆటో డ్రైవర్‌గా పని చేయడం తప్పా. నా పని నేను చేసుకుంటున్నాను. వాళ్లకు టాలెంట్ ఉండదా అని కల్యాణ్ బాధగా అంటాడు. రైటర్‌ను కలిశావా. నీ దగ్గర టాలెంట్ లేనిదే నీ పాట తీసుకున్నాడా అని అప్పు అంటుంది. నేను రాశానని చెబితే నవ్వుతారంటా అని కల్యాణ్ అంటాడు. పాట నచ్చితే అది రాసింది ఎవర్రా అని చూస్తాం. రాసింది ఎవరో తెలుసుకుని వినం కదా అని అప్పు అంటుంది.
ముందు నువ్ రాసిన పాట నచ్చాలి. దాంతో అటోమేటిక్‌గా నువ్వు నచ్చుతావ్. దానికి వాడికి నచ్చడమేంటీ. జనాలకే నచ్చుతావ్ అని మోటివేట్ చేస్తుంది అప్పు. మరోవైపు ఆఫీస్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ల్యాప్‌ట్యాప్ ఓపెన్ చేస్తాడు రాజ్. పాస్ వర్డ్ రాంగ్ అని రావడంతో ఒసేయ్ శంకిని పాస్ వర్డ్ మార్చేస్తావా. ఎంత ధైర్యమే నీకు అని రాజ్ అనుకుంటాడు. కాసేపు ఆలోచించి ఇగోకు పోయి కంపెనీకి నష్టం తేవద్దు అని కావ్యకు కాల్ చేసి అడగాలని అనుకుంటాడు రాజ్.
మీరే కనుక్కోండి
కానీ, దీనికి ఎవడు కాల్ చేస్తాడు అని హలో పాస్ వర్డ్ పంపించు అని మెసేజ్ చేస్తాడు. ఎవరీ హల్లో అని కావ్య అంటుంది. నా నెంబర్ కూడా డిలీట్ చేశావా అని రాజ్ అడుగుతాడు. ఎదుటివారు డిలీట్ చేసినప్పుడు మాకైనా రానిది డిలీట్ చేయడం అని రాజ్ అంటాడు. నోరు మూసుకుని పాస్ వర్డ్ చెప్పమంటే కంపెనీకి మీకేంటీ సంబంధం. కంపెనీ నుంచి బయటకు వెళ్లినవాళ్లకు పాస్ వర్డ్ చెప్పకూడదు అని కావ్య అంటుంది.
బీపీ తెప్పించకు అని రాజ్ అంటే.. నేను అడిగితే చెప్పారా. నన్నే కనుక్కోమన్నారుగా. మీరే కనుక్కోండి. గుడ్ నైట్ అని పడుకుంటుంది కావ్య. ఆ కోడి బ్రెయిన్‌దే కనుక్కున్నప్పుడు నాలాంటి తెలివైనవాడు కనుక్కోలేడా అని రాజ్ ట్రై చేస్తాడు. ఎంత ట్రై చేసిన ఓపెన్ కాదు. ఇంతలో రాజ్ అంతరాత్మ వస్తాడు. నువ్ ఆత్మవికాదు ఎప్పుడు పడితే అప్పుడు రాడానికి అని రాజ్ అంటాడు. మొగుడు పోస్ట్ పాయే, ఎండీ పోస్ట్ పాయే.. యువరాజు పోస్ట్ పాయే ఆఖరికి పాస్ వర్డ్ పాయే అని అంతరాత్మ అంటుంది.
అన్ని మూసుకుంటే పాయే అని రాజ్ అంటాడు. నాకు తప్పదుగా నీ అంతరాత్మగా అని అంటాడు. నా మొండితనం ఇంట్లో అందరికి తెలుస్తుంది. వాళ్లే వచ్చి బతిమిలాడుకుంటారు అని రాజ్ అంటాడు. ఓరీనా ఒరిజనల్ బాడీ. నువ్ వెళ్లకుంటే నీ మేనేజర్ పోస్ట్‌లోకి ఇంకొకరు వస్తారు. అటెండర్ పోస్ట్ ఖాళీగా ఉందని అది నీకు ఇస్తారు అని అంతరాత్మ అంటుంది. రేయ్ రేయ్ నోరు మూయ్ అని రాజ్ అంటే.. నా నోరు మూయించడం కాదురా. దమ్ముంటే నీ సొంత ల్యాప్‌ట్యాప్‌లో పాస్ వర్డ్ కనుక్కో అని అంతరాత్మ మాయం అవుతుంది.
ఒక్కోలా తిట్టుకుంటారు
మరోవైపు కల్యాణ్‌కు రైటర్ లక్ష్మీకాంత్ కాల్ చేస్తాడు. ఇటువ్వు వాడికేనా అవమానించడం తెలుసు. నేను చేస్తాను అని అప్పు అంటే.. వద్దని కల్యాణ్ మాట్లాడుతాడు. ఏం చేస్తున్నావ్ తమ్ముడు. టీ తాగుతున్నావా. నేను ఇందాక అన్న మాటలకు కోపం వచ్చిందా. ఇంత చిన్నవాటికే కోపం తెచ్చుకుంటే గొప్పవాడివి ఎలా అవుతావయ్యా. రేపు నిజంగా నువ్ రైటర్ అయితే నిర్మాత, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కోలా మాట్లాడుతారు. పాట నచ్చకుంటే జనాలు బండబూతులు తిట్టుకుంటారు అని లక్ష్మీ అంటాడు.
అవమానాలు అనేవి మన జీన్స్‌లో కలిసిపోవాలి. అప్పుడే మనలో కసి పెరుగుతుంది. నీలో ఎక్కడో విషయం ఉందయ్యా. కాకపోతే నీకు పదును పెట్టాలి. ఇందాక నువ్ బతిమిలాడితే మనసు కరిగిందయ్యా. అందుకే అవకాశం ఇస్తున్నాను. అసిస్టెంట్‌గా పెట్టుకునేందుకు కొన్ని టెస్టులు పెడతాను అని సీన్ వివరిస్తాడు రైటర్. దాంతో ఓకే అని కల్యాణ్ అంటాడు. చూశావా అవమానించినవాడే అవకాశం ఇచ్చారు అని అప్పు అంటే.. అవకాశం ఇవ్వలేదు. నా టాలెంట్‌ను చెక్ చేస్తాను అన్నారు అని కల్యాణ్ అంటాడు.
మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ ఉంటే.. రాజ్ వచ్చి అంతా నన్ను బతిమిలాడుకునేందుకు రెడీగా ఉన్నట్టున్నారు అని రాజ్ అనుకుంటాడు. ఎవరు పట్టించుకోకపోయేసరికి గుడ్ మార్నింగ్ అంటూ అందరికీ చెబుతాడు. కానీ, ఎవరు పట్టించుకోరు. ఇదేంటీ తాతయ్య బతిమిలాడట్లేదు అని రాజ్ అనుకుంటాడు. ఇందిరాదేవిని విశేషాలు అని అడిగితే.. పనిపాట లేదుగా ఖాళీగా కూర్చున్నాను అని పంచ్ ఇస్తుంది.
అనామిక వార్నింగ్
కట్ చేస్తే కంపెనీ క్లైంట్స్ మీతో మాట్లాడేందుకు రామని అంటున్నారు అని కావ్యకు శ్రుతి చెబుతుంది. తర్వాత కావ్యకు అనామిక కాల్ చేసి నేనే నీ కంపెనీ క్లైంట్స్‌ను లాక్కున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేసిన వాళ్లు నీ ఆఫీస్ గడపలోకి అడుగుపెట్టరు. వెళ్లినవాళ్లే కాదు. నీ ఆఫీస్‌లో ఉన్న వాళ్లను కూడా ఒక్కొక్కరిని లాగేసుకుంటాను. పునాదులు లేకుండా పేకముక్కల్లా నీ కంపెనీ కూలిపోయేలా చేస్తాను అని అనామిక వార్నింగ్ ఇస్తుంది. అక్కడితే నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్