Brahmamudi October 22nd Episode: బ్రహ్మముడి- కల్యాణ్‌కు కొత్త జాబ్- కనకంను అమ్మేస్తానన్న భర్త- రాజ్‌ను అవమానించిన తాతయ్య
Brahmamudi Serial October 22nd Episode: బ్రహ్మముడి అక్టోబర్ 22 ఎపిసోడ్‌లో తన దగ్గర అసిస్టెంట్‌గా పెట్టుకునేందుకు ముందుగా టెస్ట్ చేస్తానని లిరిక్ రైటర్ లక్ష్మీకాంత్ చెబుతాడు. మరోవైపు ఆఫీస్‌కు వెళ్లిన రాజ్‌కు షాక్ మీద షాక్ తగులుతుంది. కావ్య సీఈఓ అని, తాను మేనేజర్ అని తెలుసుకుని ఖంగుతింటాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కల్యాణ్ పాడిన పాటకు నిర్మాత డబ్బులిస్తాడు. గురువు గారు ఈ అబ్బాయిని మీరు వాడుకుంటారో పెట్టుకుంటారో నాకు తెలియదు. కానీ, లిరిక్స్‌ను వీటినే వాడుకుంటున్నాను. ఇక మీరు మీరు మాట్లాడుకోండి అని నిర్మాత వెళ్లిపోతాడు.
చాలా మంది క్యూలో ఉన్నారు
తర్వాత కల్యాణ్ దగ్గరున్న డబ్బు తీసుకున్న రైటర్ లక్ష్మీ నా గాలి తగలగానే నీకు లిరిక్స్ వచ్చాయి. డబ్బు వెంట పరిగెత్తితే పని రాదు. పని వెంట పరిగెత్తితే డబ్బు దానంతట అదే వస్తుంది అని డబ్బులో కొంత మాత్రమే ఇస్తాడు. కరెక్ట్‌గా చెప్పారు. నాకు ఒక అవకాశం ఇవ్వాలి. మీ దగ్గర అసిస్టెంట్‌గా అని కల్యాణ్ అంటే.. రెండు పదాలకే అసిస్టెంట్‌గా ఇవ్వాల. చాలా మంది క్యూలో ఉన్నారు. సరస్వతి పుత్రుడిని అని లక్ష్మీ అంటాడు.
ప్లీజ్ అని కల్యాణ్ అడుగుతాడు. వీడిలో చాలా విషయం ఉంది. అనవసరంగా వదులుకోవడం ఎందుకు. ముందు వాడేసుకుందాం తర్వాత ఆలోచిద్దాం అని అనుకుంటాడు లక్ష్మీ. ముందు నా ఫోన్ నెంబర్ తీసుకో.. కొన్ని సన్నివేశాలు చెప్పి నీకు పరీక్ష పెడతాను. అందులో పాస్ అయితే నిన్ను అసిస్టెంట్‌గా పెట్టుకుంటాను అని రైటర్ లక్ష్మీ వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్ సీఈఓ సీట్‌లో కూర్చుని ఫోన్ క్లీన్ చేస్తుంటాడు ప్యూన్.
అది చూసి తెగ ఫైర్ అవుతాడు రాజ్. ఇది వట్టి లెదర్ కుర్చీ కాదు. నాకు వారసత్వంగా రాలేదు. దానికి ఓ హక్కు ఉంటుంది అంటూ క్లాస్ పీకుతాడు. ఇందాక క్లీన్ చేస్తుంటే చైర్ కిందపడింది సార్. ఏదైనా విరిగిపోయిందేమో అని చెక్ చేస్తున్నాను సర్. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను సార్ అని ప్యూన్ అంటాడు. కుర్చీపై దుమ్ము ఉండటంతో ఏం తుడిచావ్. రేపు ఆఫీస్‌కు వచ్చేసరికి క్లీన్ నీట్‌గా ఉండాలని వార్నింగ్ ఇస్తాడు రాజ్.
అసిస్టెంట్ రైటర్‌గా
ఎవరు పడితే వారు కూర్చోడానికి ఇది బస్టాప్‌లో వేసిన కుర్చీనా. ఎండీ చైర్. ఇందులో కూర్చోవాలంటే ఓ అర్హత ఉండాలి అని అనుకుంటాడు రాజ్. మరోవైపు అప్పుకు కల్యాణ్ రూ. 5 వేలు ఇస్తాడు. దాంతో నువ్వేం చేస్తున్నావ్. ఆటో నడుపుతున్నావా. స్మగ్లింగ్ చేస్తున్నావా అని అనుమానిస్తుంది. ఏం లేదు. రైటర్ లక్ష్మీకాంత్, నిర్మాత నా ఆటో ఎక్కారు అని జరిగింది చెబుతాడు కల్యాణ్. అసిస్టెంట్ రైటర్‌గా కూడా పెట్టుకుంటారని చెప్పాడని చెబుతాడు కల్యాణ్.
ఇక నువ్ అసిస్టెంట్ లిరిక్ రైటర్ అయిపోతావ్. నిర్మాతలు అంతా నిన్నే పెట్టుకుని చాలా ఫేమస్ అయిపోతావ్ అని అప్పు అంటుంది. అప్పుడే అంత ఊహించుకోకు అని కల్యాణ్ ఆపుతాడు. తర్వాత కోచింగ్ సెంటర్‌లో డబ్బులు కట్టి డ్రీమ్ మీద ఫోకస్ పెట్టమని కల్యాణ్ అంటాడు. మరోవైపు దేవుడికి మొక్కుకుంటుంది కావ్య. సర్కస్ కంపెనీలో ఫీట్స్ చేసేందుకు వెళ్తున్నట్లు ఉంది. ఇది నాకు ఒక అగ్నిపరీక్ష. ఈ పరీక్షలో నేనే గెలవాలి. ఆ రింగ్ మాస్టర్‌కు నన్ను అనే అవకాశం రాకూడదు అని వేడుకుంటుంది కావ్య.
అందరు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు ఆత్మ విశ్వాసాన్ని ఏ పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు అని మొక్కుకుంటుంది కావ్య. కృష్ణమూర్తి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది కావ్య. దాంతో నాకు పాదాలున్నాయి అని కనకం అంటుంది. నువ్ ఏం దీవిస్తావో తెలుసు మిసెస్ క్యాన్సర్ కనకం అని కావ్య అంటుంది. నేను వెళ్లేది ఆయనకు దగ్గరవడానికి కాదు. నా వల్ల కంపెనీకి నష్టం వచ్చింది. నా మీద నింద పడింది. అవన్ని భర్తీ చేయడానికి అని కావ్య అంటుంది.
జుట్టుకు రంగులు
కావ్య వెళ్లిపోతుంది. ఏంటే నీ హస్తం ఉంటుందంటుంది. మళ్లీ ఏ రోగం తెచ్చుకోబోతున్నావ్. నీది భస్మాసుర హస్తం. ఇందులో నీ హస్తం ఉందని తెలిస్తే.. నీకు రంగులు వేసి నడిచే బొమ్మ అని చెప్పి అమ్మి పారేస్తా అని కృష్ణమూర్తి ఫైర్ అవుతాడు. ఇదేంటీ కొత్త రకం తిట్టులా ఉంది. భలే బెదిరించావయ్యా. అల్లుడికి నచ్చజెప్పకపోవడం మానేసి జుట్టుకు రంగులు వేసుకుంటున్నారు అని కనకం అంటుంది. ఇద్దరు వాదించుకుంటారు.
ఇద్దరు ఎదురెదురుగా ఉంటేనే కలసిపోతారు. అందుకే కలిసేలా చేశాం అని కనకం అంటుంది. ఉప్పును నిప్పును ఒకచోట ఉంచితే ఎమవుతుందో ఆ భగవంతుడికే తెలియాలి అని కృష్ణమూర్తి అంటాడు. మరోవైపు రాజ్ ఆఫీస్‌కు వెళ్తాడు. ఇంత పొద్దున వెళ్తున్నావేంట్రా అని అపర్ణ అంటుంది. చిత్త శుద్ధిగా నిబద్ధతగా పని చేసుకుంటాను అని రాజ్ అంటే.. చేయి చేయి చెప్పిందే చేయి అని ఇందిరాదేవి అంటుంది. ఆఫీస్‌లో నాకెవరు చెబుతారు అని రాజ్ అంటాడు.
తర్వాత అపర్ణ పంచ్ వేస్తుంది. రాజ్ నడుస్తూ డోర్‌కు తగులుతాడు రాజ్. అలా తగిలితే కూర్చోని వెళ్లాలిరా. లేకుంటే ఎదురుదెబ్బ తగులుతుందటరా అని ఇందిరాదేవి అంటుంది. నా ఆఫీస్‌లో నాకు ఎదురుదెబ్బ ఎలా తగులుతుంది. యమగండం వచ్చిన సరే ఎదురించి వెళ్తాను అని రాజ్ వెళ్లిపోతాడు. అక్కడ ఉండేది యమగండం కాదు. నీ పెళ్లాం అని అపర్ణ అంటుంది. రాజు వెడలే రభసకు అని ఇందిరాదేవి అంటుంది.
షాక్ అయిన రాజ్
ఆఫీస్‌లో అంతా బుద్ధిగా వర్క్ చేసుకోవడంతో షాక్ అవుతాడు రాజ్. రాజ్ వచ్చింది ఎవరు పట్టించుకోరు. దాంతో పట్టించుకునేందుకు ట్రై చేస్తాడు. శభాష్ శభాష్.. నేను క్లాస్ పీకినందుకు దారిలోకి వచ్చినందుకు సంతోషం. కానీ, బాస్ వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పకపోవడం కరెక్ట్ కాదనుకుంటాను అని రాజ్ అంటే.. అంతా చూసి మళ్లీ తమ పని తాము చేసుకుంటారు. మీ సిన్సియారిటీ తగిలెయ్య అని వెళ్లిపోతాడు రాజ్.
ఎండీ క్యాబిన్‌లోకి వెళ్తున్న రాజ్‌ను ఆపిన శ్రుతి మీ గది ఇది కాదు సర్. అది అని చూపిస్తుంది. అది మేనేజర్ రూమ్. అది నాది అంటావేంటీ. ఇది ఎవరిదీ అని రాజ్ అడిగితే.. కొత్త బాస్ వచ్చారు సార్. లేడీ బాస్ అని శ్రుతి అంటుంది. ఎవరా బాసిని అని కావ్యను చూసి ఖంగుతింటాడు రాజ్. కావ్య హుందాగా తన ఫైల్ చూసుకుంటుంది. నువ్వేంటీ ఇక్కడ . ఎంత ధైర్యముంటే నా చైర్‌లో కూర్చుంటావ్ అని రాజ్ ఫైర్ అవుతాడు.
బాస్ క్యాబిన్‌లోకి రావడానికి మీరే పర్మిషన్ అడగాలి అని కావ్య అంటుంది. నీకు ఉత్తుత్తి రోగం పట్టుకుందా. వెళ్లు అని రాజ్ అంటే.. మిస్టర్ మేనేజర్.. ఎస్ మిస్టర్ మేనేజర్. నీ లిమిట్స్‌లో ఉండు. చూసి మాట్లాడు అని కావ్య అంటుంది. దాంతో మరింత షాక్ అవుతాడు రాజ్. సెక్యూరిటీని పిలుస్తాడు. తర్వాత కావ్య వస్తే.. ఏంటీ మేడమ్ పిలిచారు అని సెక్యూరిటీ అతను అంటాడు. అరిచింది నేను. అసలు మీకు బుద్దుందా. ఎవరు పడితే వాళ్లు వచ్చి నా క్యాబిన్‌లో కూర్చుంటే ఏం చేస్తున్నారు. మిమ్మల్ని తీసేస్తాను అని రాజ్ అంటాడు.
తాతయ్య గారే
మేడమ్ సైన్ చేయాలి కదా సర్. ఇవాళ్టీ నుంచి మేడమే బాస్ అని చెప్పారు కదా సార్. అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లో సీఈఓ అని రాసి ఉందని సెక్యురిటీ అతను అంటాడు. దాంతో సీఈఓనా అని రాజ్ నవ్వుతాడు. సీఈఓ అంటే అబ్రివేషన్ అయినా తెలుసా అని రాజ్ అంటాడు. దాంతో చెప్పి డిఫరెంట్ యాసెంట్‌లో కావ్య మాట్లాడి అపాయింట్‌మెంట్ లెటర్ చూపిస్తుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. తాతయ్యగారే నన్ను సీఈఓగా అపాయింట్ చేశారు అని కావ్య చెబుతుంది. దాంతో తాతయ్య అని రాజ్ అరుస్తాడు.
ఇక నుంచి మీరు నాతో మాట్లాడాలంటే నా అపాయింట్‌మెంట్ తీసుకుని రావాలి అని కావ్య అంటుంది. ఇది ఇంతటితో అయిపోలేదన్న రాజ్ ఇంటికి వెళ్లి తాతయ్య అంటూ అరుస్తాడు. మీరు నన్ను అవమానించారు. ఆ కళావతిని సీఈఓ చేసి అని రాజ్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు.
ఇది నేను ఇంటి పెద్దగా తీసుకున్న నిర్ణయం ఎవరు మార్చలేరు అని సీతారామయ్య అంటాడు. మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు అని రాజ్ ఎదురిస్తాడు. అక్కడితే నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
టాపిక్