Bedroom Wardrobe: మీ పడకగది అల్మారా నుంచి ఈ అయిదు వస్తువులు తీసేయండి, అప్పుడే నిజమైన శుభ్రత పాటించినట్టు
Bedroom Wardrobe: పండుగలు వచ్చాయంటే ఇంటిని శుభ్రపరిచే పని మొదలైపోతుంది. ఎప్పుడో ఒకసారి శుభ్రం చేయడం కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు పడకగది అల్మారా నుంచి కూడా కొన్ని వస్తువులను తీసి పడేయాల్సిన అవసరం ఉంది.
పండుగల సీజన్ వచ్చేసింది. దసరా నవరాత్రుల తరువాత దీపావళి వచ్చేస్తోంది. ఈ సమయంలో ప్రజలు ఇళ్లను శుభ్రం చేయడం ప్రారంభిస్తారు. ఇంటిని శుభ్రపరిచే విషయానికి వస్తే, ప్రజల మొదటి దృష్టి తరచుగా ఇంట్లోని ఫర్నీచర్, ఫ్యాన్ లేదా దేవుడి గుఢి శుభ్రపరచడంపైనే పడుతుంది. అయితే వీటన్నింటితో పాటు మీరు మీ పడకగది వార్డ్ రోబ్ ను కూడా శుభ్రపరచాలి. ఇది పండుగలలో మాత్రమే కాదు, రోజువారీ దినచర్యలో కూడా మిమ్మల్ని మీరు క్రమబద్ధంగా ఉంచుకోవడం అవసరం. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు వెంటనే పడకగది అల్మారా నుంచి ఏయే వస్తువులను బయటకు విసిరేయాలో తెలుసుకుందాం.
చాలా మంది తమకు ఇష్టమైన జీన్స్ లేదా టాప్ లను ఏదో ఒక రోజు మళ్లీ వేసుకోవచ్చనే ఉద్దేశంతో గుట్టగుట్టలుగా ఉంచుతారు. దీనివల్ల అల్మారాలో పాతబట్టలు, వాడని బట్టలే పెరిగిపోతాయి. మీరు అలాంటి తప్పు చేయకండి. మీ వార్డ్ రోబ్ నుండి అటువంటి దుస్తులను తీసి వేసేయండి. అవి అవసరమైన వారికి ఇవ్వండి. ఇది దానం చేయడమే. ఇది మీకు ఎంతో పుణ్యాన్ని అందిస్తుంది.
మీరు మీ ఆభరణాల పెట్టెలో ఏళ్ల తరబడి విరిగిన, వాడేసినా పాత ఆర్టిషిషియల్ ఆభరణాలను దాచుకుంటారు. వాటిని అలా ఏళ్లకు ఏళ్లు ఉంచడం వల్ల స్పేస్ వేస్ట్. వాటిని అల్మారా నుండి కూడా తొలగించండి. అందులో పాత బంగారం లేదా వెండి విలువైన నెక్లెస్ లేదా చెవిపోగులు ఉంటే, వాటిని మార్చి కొత్తవి తీసుకునేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ జ్యువెలరీ బాక్స్ లో కొత్త ఆభరణాలకు చోటు లభిస్తుంది.
కొంతమంది తమ పాత సాక్సులను కూడా అల్మారాలో ఉంచుతారు. ఇవి నెగిటివ్ ఎనర్జీని తెస్తాయి. అలాంటి సాక్సులను అల్మారా నుంచి తీసి పడేయండి. వాటిని వేరే చోట పెట్టండి. ఇలాంటి పాత సాక్సులు ఎక్కడ ఉన్నా ఏరి వాటిని బయటపడేయండి. పనికొస్తాయనుకుంటే ఒక డబ్బాలో వేసి భద్రపరచుకోండి. అంతేకానీ అల్మారాలో మాత్రం పెట్టకండి. వాటి వాసన మొత్తం దుస్తులకు సోకుతుంది.
కాలం చెల్లిన కాస్మెటిక్స్
ప్రతి వ్యక్తి ఇప్పుడు మేకప్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాస్మెటిక్స్ ను కూడా జాగ్రత్తగా అల్మారాలో దాచుకుంటారు. వాడి పెట్టిన కాస్మోటిక్స్ అనేక బ్యాక్టీరియా, ఈస్ట్ వంటి వాటిని కలిగి ఉంటాయి. మూడు నెలల తర్వాత మస్కారా, ఆరు నెలల తర్వాత లిక్విడ్ ఫౌండేషన్, రెండేళ్ల తర్వాత లిప్ స్టిక్ వాడుతుంటే వెంటనే మార్చుకోవాలి. పాత కాస్మోటెక్స్ ను అల్మారా నుంచి తీసి పడేయాలి.
మీకు పాత బూట్లు ఉంటే అవి కూడా అల్మారాలోని కింద భాగంలో దాస్తున్నారా. వెంటనే వాటిని తీసి బయటపడేయండి. బీరువాలో అస్తవ్యస్తంగా పడి ఉన్న వస్తువులను సరిగా సర్దండి. వాటిలో అనవసరమైన వస్తువులను బయటపడేయండి.
టాపిక్