Brahmamudi October 10th Episode: బ్రహ్మముడి.. అత్తా కోడళ్ల నాటకం ఫెయిల్.. కావ్య గర్భవతి అన్న ప్రకాశం.. రాజ్‌కు డౌట్
10 October 2024, 8:07 IST
Brahmamudi Serial October 10th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 10వ తేది ఎపిసోడ్‌లో తనకు క్యాన్సర్ అని చెప్పి ఇందిరాదేవి, అపర్ణను నమ్మిస్తుంది కనకం. తర్వాత నిజం చెప్పడంతో ఫూల్ అవుతారు ఇద్దరు. తర్వాత రాజ్ దగ్గర అత్తాకోడళ్లు నాటకం ఆడుతారు. ఇలా బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో..
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 10వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్‌లో అపర్ణ, ఇందిరాదేవి, కనకం ముగ్గురు కలిసి రాజ్, కావ్య కాపురం నిలబెట్టేందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు. వాళ్లు కలవాలంటే ఒక్కచోట ఉండాలని అపర్ణ అంటుంది. ఏం చేసిన అల్లుడు గారు కావ్య కోసం మా ఇంటికి రారు వదినా. నేను పోయినా రారు అని కనకం బాధగా అంటుంది.
ఏం మాటలు కనకం ఆపు అని ఇందిరాదేవి అంటుంది. లేదమ్మా. నిజంగానే చెబుతున్నాను. కూతురు అల్లుడు మళ్లీ కలిసి చూసే అవకాశం లేకుండా దేవుడు చేశాడు అని కనకం అంటే.. నువ్ బతికి ఉండగా నీ కూతురు అల్లుడు కలవరని అనుకుంటున్నావా. ఎందుకు అలా అనుకుంటున్నావ్ అని ఇందిరాదేవి అంటుంది. ఎందుకంటే నేను బతికేది మహా అయితే మూడు నెలలు, నాలుగు నెలలు కావచ్చు అని కనకం అంటుంది.
అవాక్కయిన అత్తాకోడళ్లు
దాంతో షాక్ అయి ఇందిరాదేవి, అపర్ణ పైకి లేస్తారు. కనకం అని ఇందిరాదేవి అంటే.. అవునమ్మా.. నాకు నెల రోజుల క్రితమే ఈ విషయం తెలిసింది. తరచుగా ముక్కులో నుంచి రక్తం వస్తే టెస్ట్‌లు చేయించాను. అన్ని రిపోర్ట్స్ చూసి చివరికి నాకు క్యాన్సర్ అని తేల్చారు. అది కూడా చివరి దశలోనే బయటపడింది అని ఇందిరాదేవి అంటుంది. ఇందిరాదేవి, అపర్ణ అవాక్కవుతుంది. ఎప్పుడు అబద్ధాలు చెప్పే నేను ఇప్పుడు నిజం చెబితే నమ్మరని ఇంతవరకు ఎవరికి చెప్పలేదు అని కనకం అంటుంది.
నీకేం కాదు కనకం. నిన్ను పెద్ద హాస్పిటల్‌లో చూపిస్తాం అని అపర్ణ అంటుంది. లాభం లేదు వదినా. ఏం చేసిన లాభం లేదని పెద్ద డాక్టర్లే తేల్చేశారు. కూతురు అల్లుడు సంతోషంగా ఉంటారనుకున్నా. కానీ, దేవుడు ఆ సంతోషం లేకుండా చేశాడు. లేకపోతే కావ్య కాపురం ఇలా అయిపోతే నేనేనా చూస్తూ ఊరుకునేది. ఏదో ఒక మాయ చేసేదాన్ని అని కనకం కన్నీళ్లు పెట్టుకుంటుంది. కనకం ఎంత కష్టమొచ్చింది నీకు అని ఇందిరాదేవి అంటుంది.
నమ్మలేకుండా ఉన్నా కనకం. కానీ, చావు విషయంలో నువ్ అబద్ధం చెప్పవు కదా అని అపర్ణ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. కదా.. అని ఒక్కసారిగా నవ్వుతుంది కనకం. మీరు ఇద్దరు నమ్మేశారు కదా. నాకు క్యాన్సర్ లేదు.. అల్సరు లేదు. కానీ, మిమ్మల్ని మాత్రం బాగా నమ్మించేను కదా. చావు విషయంలో ఎవరు అబద్ధం చెప్పరు కదా. అల్లుడు గారు అనుకోరు అని కనకం అంటుంది. దాంతో అపర్ణ, ఇందిరాదేవి షాక్ అయి చూస్తారు. అంటే ఇది అబద్ధమా అని అపర్ణ అంటుంది.
రాకుండా ఉంటారా
అవును. లోక కల్యాణం కోసం తప్పు లేదని సింపుల్‌గా అబద్ధం చెప్పాను అని కనకం అంటుంది. ఓసి నీ దుంపతెగ. ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినంత పని అయింది. మనతో మాట్లాడే మనిషి ఒక్కసారిగా చనిపోతుందంటే ఎలా ఉంటుంది అని ఇందిరాదేవి అంటుంది. అదే కదా మనకు కావాల్సింది అని కనకం అంటుంది. అత్తగారు బతకదని తెలిస్తే.. అల్లుడు గారు రాకుండా ఉంటారా. అత్త గారి చివరి కోరికను తీర్చేందుకు నా కూతురుని కాపురానికి తీసుకెళ్లకుండా ఉంటారా అని కనకం అంటుంది.
ఇలాంటి సలహా ఇచ్చినందుకు నాకిప్పుడు కనకాన్ని ఈడ్చి కొట్టాలనిపిస్తుంది. కొట్టనా అని ఇందిరాదేవి అంటుంది. చచ్చు సలహా, చచ్చే సలహా ఇచ్చిన ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉంది అత్తయ్య. ఒకటి ఇవ్వాలా వద్దా అనేది వాయిదా వేసుకుందాం అని అపర్ణ అంటుంది. వర్కౌట్ అవుతుంది. మీరే నమ్మారు కదా. అలాంటిది అత్తింటికి ఆపద వస్తే వచ్చే అల్లుడు గారు కచ్చితంగా వస్తారు అని కనకం అంటుంది. మరి తర్వాత నువ్ బతికే ఉంటే విషయం తెలిసి మరింత కోప్పడుతాడు కదా వాడు అని అపర్ణ అంటుంది.
ఓ అడవిలో క్యాన్సర్‌కు పసరు పోసి బతికించారు అని ఇంకో అబద్ధం చెబుదాం అని కనకం అంటుంది. ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ఎలా వస్తాయి. ఎంతలా అంటే నీ క్యాన్సర్‌కు నువ్వే మందు కనుక్కున్నావ్ అని అపర్ణ అంటుంది. అంత దిక్కుమాలిన ఐడియానా అని అదోలా అంటుంది కనకం. ఎలాంటిది అయినా పనికివచ్చేదే. ఎలా అమలులో పెడదామని ఆలోచిద్దాం అని ఇందిరాదేవి అంటుంది. క్యాన్సర్ అంటే వచ్చి చూస్తాడు కానీ ఇంట్లో ఎందుకు ఉంటాడు అని అపర్ణ అంటుంది.
శోభనం అన్నట్లు
ఎందుకంటే ఎల్లుండి మా పెళ్లి రోజు అని మెలికలు తిరుగుతుంది కనకం. అదేదే ఎల్లుండి మా శోభనం అన్నట్లు చెబుతున్నావ్ అని ఇందిరాదేవి అంటుంది. ఛీ ఛీ కాదు. ఈసారి వచ్చేది మా 25వ పెళ్లి రోజు. నా చివరి పెళ్లి రోజు. కాబట్టి అల్లుడు గారు వస్తారు అని కనకం అంటుంది. ఈ విషయం ఒక్క రాజ్‌కు మాత్రమే తెలిసేలా చేయాలి. రుద్రాణికి తెలిస్తే బెడిసి కొడుతుంది అని అపర్ణ అంటుంది. అబద్ధాలతో పెళ్లి చేశావ్. అబద్ధాలతోనే కాపురం నిలబెడుతున్నావ్. కానీ, ఈసారి మా నెత్తిమీద రుద్దుతున్నావ్ అని అపర్ణ అంటుంది.
మరోవైపు కృష్ణమూర్తి దగ్గరకు వెళ్లిన కావ్య మీ పెళ్లిరోజును సెలబ్రేట్ చేయాలని ఉంది. మా ముగ్గురుని పెంచి పెళ్లి చేసి పంపారు. మీకోసం చేయాలని ఉంది అని కావ్య అంటుంది. మీ కాపురం సరిగా లేనప్పుడు మేము ఎలా చేసుకోవడం బాగుండదు అని కృష్ణమూర్తి అంటాడు. 25వ పెళ్లి రోజు కదా చేయాలని అంటుంది. స్వప్నను పంపిస్తారా. అప్పు కూడా దూరంగా ఉంది అని కృష్ణమూర్తి అంటే.. కనకం వచ్చి స్వప్న వస్తుంది. తనే దగ్గరుండి చేయిస్తుందట అని కనకం అంటుంది.
ఆ ఇంటి నుంచి ఒక్క రూపాయి వద్దని కావ్య అంటుంది. వాళ్లు చేయిస్తానంటే వద్దనడం కరెక్ట్ కాదు. తప్పు పడతారని కనకం అంటుంది. మీ ఇష్టం అని వెళ్లిపోతుంది కావ్య. స్వప్న అంటే నువ్వెలా ఒప్పుకున్నావని కృష్ణమూర్తి అంటాడు. స్వప్నకు అన్ని తెలివితేటలు ఎక్కడివి. అన్నది కావ్య వాళ్ల అత్తగారు. ఇలా అయినా అల్లుడు గారు కావ్య ఒక్కటి అవుతారని ఆశ అని కనకం అంటుంది. కలిసి ఉంటారో బెడిసి కొట్టి మరింత దూరం అవుతారో అని కృష్ణమూర్తి అంటాడు.
అత్తా కోడళ్ల నాటకం
అంతా ఆవిడ చూసుకుంటుంది. నువ్ ఎక్కువ ఆలోచించకు అని కనకం వెళ్లిపోతుంది. మరోవైపు ల్యాప్‌ట్యాప్‌లో రాజ్ వర్క్ చేసుకుంటాడు. అత్తయ్య జీవితంలో మొదటిసారి కనకంలా నాటకం ఆడబోతున్నాను అని అపర్ణ అంటే.. నేను కబడ్డి ఆడబోతున్నానా. పదా వెళ్దాం అని అనుకుంటారు. రాజ్‌ను పలకరించి ఓ విషయం చెప్పాలని బాధగా ఉందని, గుండె బరువెక్కిందని భారీ డైలాగ్స్ కొడతారు అత్తా కోడళ్లు. ఏమైంది అని రాజ్ అడుగుతాడు.
అది కావ్య అని అపర్ణ అంటే.. తన గురించి ఏం చెప్పొద్దు అని రాజ్ అంటాడు. చాలా ముఖ్యమైన విషయం అని ఇందిరాదేవి అంటుంది. కావ్య వాళ్ల అమ్మా అని అపర్ణ అంటుంది. అమ్మా పిల్లా.. పిల్ల తల్లి గురించి చెప్పకండి అని బయటకు వెళ్లిపోతాడు రాజ్. వీడు మారుతాడని నాకు అనిపించడంలేదని ఇందిరాదేవి అంటుంది. ఇంతలో కనకం ఫోన్ చేసి కావ్యను ఒప్పించానని, ప్లాన్ సూపర్ హిట్ అని కనకం అంటుంది. ఇక్కడ అట్టర్ ప్లాప్, డిజాస్టర్. దీన్ని సవాలుగా తీసుకుని ఎలాగైనా సక్సెస్ చేస్తాం అని అపర్ణ అంటుంది.
నీవల్ల కాకపోతే చెబితే.. నేను రంగంలోకి దిగుతాను అని కనకం అంటే.. గొయ్యి తీసి కప్పెడతా. మమ్మల్ని చీప్‌గా తీసిపడేయకు అని అపర్ణ కాల్ కట్ చేస్తుంది. మనం డైరెక్ట్‌గా చెబితే వినడు. మీడియేటర్ కావాలి. దానికి ప్రకాశమే కరెక్ట్ అని ఓ ప్లాన్ వేస్తుంది ఇందిరాదేవి. ప్రకాశంను పిలిచి కావ్య రాజ్ కలిసి ఉండాలని ఉందా అంటే కావ్య లేకుంటే తలకాయ లేని బాడీలా ఉందని ప్రకాశం అంటాడు. అయితే, ఎందుకు ఏంటీ అని అడగకుండా కావ్యకు ఇలా అయిందేంటీ.. పాపం కావ్య అని రాజ్‌తో అను, ఏంటని అడిగితే మర్చిపోయాను అని చెప్పి అని చెబుతారు.
జీవించేసిన ప్రకాశం
దొరికిపోయి మా పేర్లు చెబితే నీ పేరు మర్చిపోయేలా కొడతాన్రోయ్ అని ఇందిరాదేవి అంటుంది. దాంతో రాజ్ దగ్గరికి వెళ్లిన ప్రకాశం అలాగే చేస్తాడు. అసలు ఇలా జరిగిందేంట్రా.. నీకు తెలియదా. పాపం కావ్యకు ఇలా జరుగుతుందని నేను ఇలా అనుకోలేదురా. ఎంత మతిమరుపు ఉన్నా మర్చిపోలేకపోతున్నా అని ప్రకాశం అంటాడు. ఏమైంది అని డల్‌గా అడుగుతాడు రాజ్. అది.. అది.. మర్చిపోయానురా.. మా అమ్మకు గుర్తుంటుంది వెళ్లి అడుగురా అని రాజ్ నటనలో జీవించేస్తాడు.
అది అపర్ణ, ఇందిరాదేవి చూస్తారు. వాళ్లు చెప్పింది రాజ్ గుర్తుకు చేసుకుని వాళ్లదగ్గరికి వెళ్తాడు. వెంటనే వాళ్లు సోఫాలో కూర్చుంటారు. రాజ్ వచ్చి చూస్తుంటే.. బాధపడకండి అత్తయ్య. కష్టాలు కావ్యలాంటి మంచివాళ్లకే వస్తాయి కానీ రుద్రాణి లాంటి వాళ్లకు వస్తాయా అని నాటకం ఆడుతుంటారు. అదంతా వింటూ కంగారుపడుతుంటాడు రాజ్. దేవుడు కూడా రాజ్‌లా ఉంటే ఏం చేస్తాం. కనీసం చెప్పనివ్వట్లేదు కదా రాక్షసుడు అని ఇందిరాదేవి వెళ్లిపోతుంది. అపర్ణ కూడా వెళ్లిపోతుంది.
ఏంటీ నన్ను అలా అంటున్నారు. ఏమైంది అని మళ్లీ ప్రకాశం దగ్గరకు వెళ్లిన రాజ్ బాబాయ్ ఏమైంది అని అంటాడు. అప్పుడు పేపర్ చదువుతున్న ప్రకాశం గర్భవతి అయిందని చెబుతాడు. ఏంటీ కావ్య గర్భవతి అయిందా అని రాజ్ అడుగుతాడు. కోర్టుకు వెళ్లింది. లీలావతిని గర్భవతిని చేసి ఆమె భర్త ఇంట్లోంచి వెళ్లగొట్టినందుకు తన తల్లి ప్రేమావతి కోర్టులో కేసు వేసింది. ఆమె తరఫున హేమావతి కేసు వాదిస్తుంది. అది పేపర్‌లో రాసింది సత్యవతి అని ప్రకాశం వెళ్లిపోతాడు.
నిజంగా కావ్య గర్భవతా
చెప్పకుండా వెళ్లిపోయాడు. కొంపదీసి నిజంగానే కళావతి గర్భవతా. అందుకే కనకం గారు నా మీద కేసు పెట్టారా.. ఏయ్.. ఛీ ఛీ.. అయిండదు. మరి మమ్మీ నానమ్మ అంతలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏదో బలమైన కష్టమే వచ్చి ఉంటుంది అని రాజ్ అనుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్