తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi March 2nd Episode: బ్రహ్మముడి సీరియల్.. అత్తింట్లో రాజ్‌కు అవమానం.. ఇందిరాదేవి సపోర్ట్.. కావ్యతో విలన్‌లా!

Brahmamudi March 2nd Episode: బ్రహ్మముడి సీరియల్.. అత్తింట్లో రాజ్‌కు అవమానం.. ఇందిరాదేవి సపోర్ట్.. కావ్యతో విలన్‌లా!

Sanjiv Kumar HT Telugu

02 March 2024, 10:13 IST

google News
  • Brahmamudi Serial March 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 2వ తేది ఎపిసోడ్‌లో కావ్య, బావ కావాలనే రాజ్‌ తమతోపాటు వచ్చేలా ప్లాన్ చేస్తారు. వాళ్లను పిలిచి రాజ్‌ను పిలవలేదని కనకంపై కోప్పడుతుంది ఇందిరాదేవి. ఈ క్రమంలో కావ్యపై ఫైర్ అవుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మార్చి 2వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మార్చి 2వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ మార్చి 2వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో బావ, తను పుట్టింటికి వెళ్తున్నట్లు కావ్య చెబుతుంది. దాంతో నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని రాజ్ ఫైర్ అవుతాడు. నేనంటే మీ భార్యను కాబట్టి మీ పర్మిషన్ అడగాలి.. నా బావకు ఎందుకు పర్మిషన్ అందుకే చెప్పలేదు అని కావ్య అంటుంది. నన్ను ఇంతలా ఇరికిస్తావా అని రాజ్ అనుకుంటాడు. పద బుజ్జి మనం బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని వెళ్దాం. చిన్నప్పటి జ్ఞాపకాలు, సంగతులు, ఇష్టమైన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేద్దామని బావ అంటాడు.

డౌట్‌గా ఉంది

దాంతో కావ్య, బావ వెళ్లిపోతారు. మనం వెళ్తున్నామని తెలిసి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కచ్చితంగా మనతోపాటే వస్తాడు అని బావ అంటాడు. మరోవైపు తన కూతురు, మేనల్లుడిని పిలిచి అల్లుడైన తనను పిలవనందుకు కోపంగా ఉంటాడు రాజ్. తర్వాత అసలు విషయం మీటారా అని ఇందిరాదేవి అడుగుతుంది. మీటాం కానీ, ఆయన ఎలా వస్తారు. వస్తారా లేదా అని డౌట్‌‌గా ఉందని కావ్య అంటుంది. మీరెళ్లి బ్యాగ్స్ సర్దుకోండి. రాజ్ రావడం నేను చూసుకుంటాను అని ఇందిరాదేవి అంటుంది.

వెళ్లేసరికి వాళ్లు నన్నెందుకు పిలవలేదు అని రాజ్ అనుకోవడం చూసి ఇందిరాదేవి నవ్వుకుంటుంది. తర్వాత వచ్చిన ఇందిరాదేవితో అమ్మమ్మ నీకు ఈ విషయం తెలుసా అని రాజ్ అంటే.. తెలుసు. మంచి ఈడుజోడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని ఇందిరాదేవి అంటుంది. నా ముందు వాళ్ల గురించి అలా ఎలా మాట్లాడుతున్నావ్ నానమ్మ అని రాజ్ అంటాడు. శ్రీనివాస్ తనకు కాబోయే భార్యాను తీసుకెళ్తే అందులో తప్పేముందిరా అని ఇందిరాదేవి అంటుంది.

దేనికి పిలవలేదు

అది కాదు కావ్య గురించి. కావ్య తన పుట్టింటికి వెళ్తుంది. తన కూతురుని, మేనల్లుడిని పిలిచారు కానీ, నన్ను పిలవలేదు అని రాజ్ అంటాడు. దాంతో నిన్ను ఎలా పిలవరు. అస్సలు లెక్కలేదా అని కావాలనే కోపం నటిస్తూ కనకంకు ఫోన్ చేస్తుంది ఇందిరాదేవి. నా మనవడిని ఎందుకు పిలవలేదని నిలదీస్తుంది. ఇప్పుడు పిలవండి అని రాజ్‌కు ఫోన్ ఇస్తుంది. అల్లుడు గారు మీరు ఎలాగు రారు కదా. మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం దేనికని పిలవలేదు అని కనకం అంటుంది.

ఇలా అడిగి పిలిపించుకోవడం నాకు నచ్చలేదు. నేను రాను అని రాజ్ అంటే.. సరే మీకు నచ్చకుంటే రాకండి అని కనకం కాల్ కట్ చేస్తుంది. అదే విషయం ఇందిరాదేవికి చెబుతాడు రాజ్. అదంతా విన్న కావ్య రావడం ఇష్టంలేదని చెబితే ఎవరైనా రాకండే అంటారు అని అంటుంది. నేను రాను అంటాను. అది నా పొగరు. కానీ, మీరు రమ్మని బతిమిలాడాలి. అది మీ బాధ్యత అని రాజ్ అంటాడు. వాళ్లకు అంత ఓపిక లేదండి అని కావ్య అంటుంది. దాంతో కావ్య అని గట్టిగా అరుస్తుంది ఇందిరాదేవి.

వాడు మారితే చాలు

సినిమాలో విలన్‌లా అంత గట్టిగా అరిచారు ఏంటీ అమ్మమ్మ గారు. నాకు ఎంత భయం వేసిందో తెలుసా అని కావ్య అంటుంది. నా మనవడు అంటే లెక్కలేదా. వాడు లేకుండా నువ్ పుట్టింటికి వెళ్లడానికి వీళ్లేదు అని ఇందిరాదేవి కావాలనే అంటుంది. దాంతో సరేనన్న కావ్య మీరు ఫ్రెష్ అయి రండి. మీ బట్టలు కూడా ప్యాక్ చేసి పెడతాను అంటుంది. అలా రా దారికి అని వెళ్లిపోతాడు రాజ్. మీరు నాకోసం చాలా చేస్తున్నారు అన ఇందిరాదేవితో అంటుంది కావ్య. వాడు మారితే అదే పదివేలు అని ఇందిరాదేవి అంటుంది.

ముగ్గురు కారులో వెళ్తారు. మీరు ఏం చేసి అయినా సరే వాడిలో ప్రేమను బయటకు తీసుకురావాలి. అందుకు మీకు నా ఫుల్ సపోర్ట్ అని చెప్పి పంపిస్తుంది ఇందిరాదేవి. ముందు రాజ్ డ్రైవ్ చేస్తుంటే.. నేను మీకు డ్రైవర్‌నా అని అంటాడు. దాంతో బావ డ్రైవింగ్‌కు వస్తాడు. తర్వాత ఇప్పుడు ఈ కళావతి పక్కన కూర్చోవాలా అని బావ పక్కకు కూర్చుందామని వెళ్తుంటే అప్పటికే అక్కడ కావ్య కూర్చుంటుంది. దాంతో షాక్ అయిన రాజ్ ఇక్కడ కూర్చున్నావేంటీ అని అడుగుతాడు.

చిన్ననాటి జ్ఞాపకాలు

మా బుజ్జి బావను డ్రైవర్ అనుకోవడం నాకు ఇష్టంలేదు. మీరు ఓనర్‌లో వెనుక దర్జాగా కూర్చోండి అని కావ్య అంటుంది. దాంతో చేసేది లేక వెనక్కి వెళ్లి కూర్చుంటాడు రాజ్. తిక్క బాగా కుదిరింది వెధవకి అని ఇందిరాదేవి అనుకుంటుంది. కారులో వెళ్తూ చిన్నప్పటి విషయాలు కావాలనే ఓవర్‌గా మాట్లాడుకుంటారు కావ్య, బావ. దానికి ఆపండి అని రాజ్ చిరాకు పడతాడు. తర్వాత పాటలు పెడతారు. అవి కూడా చిన్ననాటి జ్ఞాపకాలతో ఉండేసరికి మార్చమని రాజ్ అంటాడు. తర్వాత రాజ్ కూడా పాటలు పెడతాడు.

అప్పుడు చేతిలో చేయి వేసి చెప్పు బావ అనే పాట వచ్చేసరికి రాజ్ చేసేదిలేక సైలెంట్‌గా ఫీల్ అవుతుంటాడు. మరోవైపు రాజ్ వస్తున్నాడని, అతని ముందు మేనల్లుడిని బాగా చూసుకోవాలని టెన్షన్ పడుతుంది కనకం. ఇంతలో ఇందిరాదేవి కాల్ చేసి అలా చేయమని నేను చెబుతున్నానుగా. నీ నటన చాతుర్యం గురించి మాకు బాగా తెలుసు అని ఇందిరాదేవి అంటుంది. ఇంతలో కారు వచ్చిందని కనకం కాల్ కట్ చేసి వెళ్లిపోతుంది. ఇప్పటివరకు నటించడం రాదని చెప్పి కారు వచ్చేసరికి ఎలా వెళ్లిందో చూడు అని కృష్ణమూర్తి అనుకుంటాడు.

మా బావకే ఇద్దామనుకున్నాం

కావ్య, బావకు కనకం హారతి ఇవ్వబోతుంది. దాంతో హారతి వాళ్లిద్దరికి ఎలా ఇస్తారు అని రాజ్ ఫైర్ అవుతాడు. వాడు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పెరిగాడు. అందుకే ఇస్తోంది అని కృష్ణమూర్తి అంటాడు. మీరు కలిసి వచ్చిన అల్లుడికే ఇచ్చేవాన్ని అని కనకం అంటుంది. అల్లుడు కాదు మేనల్లుడు అని రాజ్ అంటాడు. దాంతో నిజానికి చిన్నప్పటి నుంచి మా బావకే కావ్యను ఇద్దామనుకున్నారు. కానీ, మా స్వప్న అక్క చేసిన పనికి కావ్య అక్క ముసుగు వేసుకోవాల్సి వచ్చిందని అప్పు అంటుంది.

ఇక్కడ అంతా కలిసి రాజ్‌ను విసిగిస్తారు. కొద్దిగా కావాలనే అవమానిస్తారు. అనంతరం రాజ్, కావ్యకు హారతి ఇస్తుంది కనకం. ఇక మా అల్లుడు అదే మేనల్లుడికి హారతి ఇవ్వనా అని కనకం అంటుంది. దాంతో రాజ్ ఒప్పుకుంటాడు. అయితే నాకు కాకుండా వాడికి హారతి ఇస్తారా అంటూ హారతిని ఊదేస్తాడు రాజ్. అది ఆరిపోతుంది. అది కనకం, బావ చూసి నవ్వుకుంటారు. తర్వాత నువ్ రా లగేజ్‌ తీసుకొద్దామని రాజ్ అంటాడు. అది చూసి అదేంటీ బాబు మీరు మా.. అదే అదే మా మేనల్లుడి బ్యాగ్ మీరేందుకు తీసుకొస్తున్నారు అని కనకం అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం