Brahmamudi Promo: అత్తగారింట్లో రాజ్ హడావిడి - కనకం నాటకానికి కావ్య పుల్‌స్టాప్ - రుద్రాణికి పనిష్‌మెంట్
13 October 2024, 10:07 IST
Brahmamudi Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో క్యాన్సర్ పేరుతో కనకం ఆడుతోన్న నాటకాన్ని బయటపెట్టాలని రాజ్ ప్లాన్ వేస్తాడు. మెడికల్ రిపోర్ట్స్‌ను తనకు ఇస్తే స్నేహితుడైన ఓ డాక్టర్‌కు చూపిస్తానని అంటాడు. లేని రిపోర్ట్స్ ఎక్కడి నుంచి తేవాలో అర్థంకాక కనకం కంగారుపడుతుంది.
బ్రహ్మముడి ప్రోమో
Brahmamudi Promo: రాజ్, కావ్యలను కలపడం కోసం తనకు క్యాన్సర్ ఉన్నట్లుగా నాటకం ఆడుతుంది కనకం. ఆమె చేత ఈ నాటకాన్ని అపర్ణ, ఇందిరాదేవి ఆడిస్తారు. కనకం నిజంగానే క్యాన్సర్ బారిన పడిందని రాజ్ భ్రమపడతాడు.
తన ఫ్రెండ్స్‌లో క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడని, మీ రిపోర్ట్స్ ఇస్తే అతడికి ఒకసారి పంపిస్తానని కనకంతో అంటాడు రాజ్. అల్లుడి మాటలతో కనకం కంగారుపడుతుంది. లేని రిపోర్ట్స్ ఎక్కడి నుంచి తేవాలా అని ఆలోచిస్తుంది. రిపోర్ట్స్ లేవంటే తన నాటకం మొత్తం బయటపడుతుంది హైరానా పడిపోతుంది.
బయటపడ్డ కనకం నాటకం...
రాజ్ బారి నుంచి తప్పించుకునేందుకు ఏదో సర్ధిచెప్పాలని చూస్తుంది. కానీ రాజ్ మాత్రం పట్టువీడడు. రిపోర్ట్స్ కావాల్సిందేనని అంటాడు. అతడికి రిపోర్ట్స్ తెచ్చిస్తానని రూమ్ నుంచి బయటకు వస్తుంది కనకం. తల్లి కోసం రూమ్ బయట కావ్య ఎదురుచూస్తుంది. కావ్యను చూసి కనకం కంగారు మరింత పెరుగుతుంది.
తన ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు కనకం ఆడిన డ్రామాను బయటపెట్టడానికే రాజ్ ఈ పెళ్లిరోజు డ్రామా ఆడినట్లుగా బ్రహ్మముడి ప్రోమోలో చూపించారు. కనకం ఆడిన అబద్ధం బయటపడుతుందా? కావ్య కాపురం మరింత కష్టాల్లోపడనుందా? పెళ్లిరోజు వేడుకలకు అప్పు, కళ్యాణ్ వస్తారా? లేదా? అన్నది సోమవారం నాటి బ్రహ్మముడి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.
స్పృహ తప్పిన రుద్రాణి...
అంతకుముందు కావ్య తల్లిదండ్రుల పెళ్లిరోజును జరిపించాలని రాజ్ నిర్ణయించుకుంటాడు. రాజ్ ఆ మాట చెప్పగానే రుద్రాణి కంగారుతో స్పృహ తప్పిపడిపోతుంది. రుద్రాణి ముఖంపై నీళ్లుచల్లి రాహుల్ ఆమెను లేపుతాడు. కనకం, కృష్ణమూర్తిల పెళ్లిరోజును రాజ్ జరిపించాలనే నిర్ణయాన్ని రుద్రాణి, ధాన్యలక్ష్మి వ్యతిరేకిస్తారు. కావ్య మన కుటుంబానికి చేసిన ద్రోహం మర్చిపోయావా అంటూ రాజ్ మనసు మార్చే ప్రయత్నం చేశారు.
ఈ విషయంలో తాను ఎవరి మాట విననని, ఇతరుల అభిప్రాయం తనకు అక్కరలేదని సమాధానమిచ్చి ఇద్దరికి షాకిస్తాడు రాజ్. అయినా రుద్రాణి పట్టువీడదు. పెళ్లిరోజు జరిపించడానికి వీలులేదని అంటుంది. ఎక్స్‌పో అవార్డు మనకు రాకుండా చేసింది కావ్యనే అంటూ మళ్లీ ఫిట్టింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తుంది. రాజ్ ఆమె మాటలను పట్టించుకోడు.
రుద్రాణి ఫిట్టింగ్...
కనకం, కృష్ణమూర్తిల పెళ్లిరోజును జరిపించడానికి దుగ్గిరాల కుటుంబం అందరం కలిసి వెళదామని రాజ్ ప్రకటిస్తాడు. ఆ మాట వినగానే ధాన్యలక్ష్మి కంగారుపడుతుంది. కావ్యను తిట్టి అవమానించి ఇంట్లో నుంచి పంపిచేది నువ్వే...తీసుకొచ్చేది నువ్వే అంటూ ఫైర్ అవుతుంది.
కనకం ఇంటికి తాను రానని తెగేసి చెబుతుంది. ఇందిరాదేవి, సీతారామయ్య మాత్రం తామువస్తామని చెబుతారు. పెళ్లిరోజు పేరుతో రాజ్, కావ్య మళ్లీ కలిసిపోయే ప్రమాదం ఉందని రుద్రాణి అనుకుంటుంది. వారిని విడగొట్టడానికైనా కనకం ఇంటికి వెళ్లాలని ఫిక్సవుతుంది. అత్తయ్య పన్నాగాన్ని స్వప్న కనిపెడుతుంది. ఆమె ఎత్తులను చిత్తుచేయాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది.
ప్లేట్ ఫిరాయించిన రాహుల్...
కనకం ఇంటికొచ్చిన రాహుల్ ఇబ్బందిగా ఫీలవుతాడు. అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ కావాలా అని ఆలోచిస్తుంటాడు. అతడు తప్పించుకోకుండా రాజ్ ఇరికించేస్తాడు. పెళ్లి రోజు వేడుకల తాలూకు డేకరేషన్‌తో మొత్తం చూసుకోవాలని రాహుల్‌కు ఆర్డర్‌వేస్తాడు. రుద్రాణికి వంట పనుల తాలూకు బాధ్యతల్ని అప్పగిస్తాడు.రాహుల్ ప్లేట్ ఫిరాయించేస్తాడు. కనకం, కృష్ణమూర్తిలతో ప్రేమగా మాట్లాడుతాడు.
కావ్యకు సినిమా చూపించిన దుగ్గిరాల ఫ్యామిలీ...
హఠాత్తుగా తన ఇంటికి దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం రావడంతో కావ్య షాకవుతుంది. అందరిలో ఒక్కసారిగా మార్పు రావడం చూసి ఏం జరుగుతుందో కావ్యకు అంతుపట్టదు. అందరూ కలిసి కావ్యకు సినిమా చూపిస్తారు.