Brahmamudi January 26th Episode: ఇక నుంచి ఆఫీస్‌కు కావ్య.. అనామిక షాక్, కల్యాణ్ హ్యపీ.. ధాన్యలక్ష్మీకి చురకలు
26 January 2024, 9:06 IST
Brahmamudi Serial January 25th Episode: బ్రహ్మముడి సీరియల్ జనవరి 26వ తేది ఎపిసోడ్‌లో అపర్ణ, ధాన్యలక్ష్మీపై ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. చెప్పుడు మాటలు వినొద్దని సలహా ఇస్తుంది. మరోవైపు రాజ్, శ్వేతలను పట్టుకోడానికి కావ్య ఆఫీస్‌కు వెళ్లాలనుకుంటుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
బ్రహ్మముడి సీరియల్ జనవరి 26వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో రాజ్ ఫోన్‌ను దొంగతనంగా కల్యాణ్, కావ్య చూస్తారు. శ్వేతతోనే మాట్లాడుతున్నాడు చూడండి వదినా అని కల్యాణ్ అంటే కావ్య చూడదు. దాంతో కల్యాణ్ చూస్తాడు. చూసి షాక్ అవుతాడు. కల్యాణ్‌ను చూసి కావ్య కంగారు పడుతుంది. ఇది చూస్తుంటే వీరి మధ్య స్నేహం కంటే మించి రిలేషన్ ఉందని అనిపిస్తోంది అని కల్యాణ్ అంటాడు. అంటే ఇష్టపడుతున్నారా అని కావ్య అంటే.. అయ్యో.. అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దు అని కల్యాణ్ అంటాడు.
అన్నయ్యతోపాటే
ఫోన్ అక్కడ పెట్టి వస్తానని బెడ్‌పై రాజ్ ఫోన్ పెట్టి వస్తాడు కల్యాణ్. ఇప్పుడు మీరు నిబ్బరంగా ఉండాల్సిన సమయం ఇది అని కల్యాణ్ అంటే.. ఏం చేయమంటారు కవిగారు అని కావ్య అడుగుతుంది. అన్నయ్యతో మీరు ఎప్పుడూ ఉండాలి అని కల్యాణ్ అంటే.. మనసులో నేను లేనప్పుడు పక్కన ఉంటే ఏం లాభం అని కావ్య అంటుంది. అన్నయ్యతోపాటే మీరు కూడా ఆఫీస్‌కు వెళ్లాలని కల్యాణ్ చెబుతాడు. ఏ ఇంట్లో ఉండి ఏం మాట్లాడుతున్నారు. అందరికీ టీ, టిఫిన్స్ ఇచ్చే సమయం అయింది అని వెళ్లిపోతుంది కావ్య.
కల్యాణ్ ఆలోచనలో పడిపోతాడు. మరోవైపు అప్పు బయటకు వెళ్లడం చూసి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది కనకం. పని చేసుకోవద్దా. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అని అప్పు అంటుంది. దానికి పిజ్జా డెలీవరీగానే ఎందుకు డిగ్రీ అయిపోయిందిగా. మంచి ఉద్యోగం చూసుకోవచ్చుగా అని కృష్ణమూర్తి అంటాడు. ఇప్పుడు నీ వ్యాపారం కూడా సరిగా కావట్లేదు కద నాన్న. నేను కూడా జాబ్ చేస్తే సహాయంగా ఉంటుందని అప్పు అంటుంది. చదువుకోవాలనుకుంటే చదువుకో. అదంతా నాన్న చూసుకుంటారు అని కనకం అంటుంది.
నా బాధ చెమటలా
ఇలా చెప్పే స్వప్న అక్కను చెడగొట్టావ్. కావ్య అక్కను మోసం చేశావ్. నేను ఇదే జాబ్ చేయను. ఇప్పుడు చేస్తాను. తర్వాత నాకు తగిన జాబ్ చూసుకుంటాను అని అప్పు వెళ్లిపోతుంది. ప్రేమ నుంచి బయట పడిందని సంతోషపడాలా ఇంటికోసం కష్టపడుతుందని బాధ పడాలో అర్థం కావట్లేదు అని కనకం అంటుంది. బయట ఉన్న ఫ్రెండ్‌తో నా అలసిపోయేంతవరకు కాదు నా బాధ చెమటలా కరిగిపోయేంత వరకు నువ్ చెప్పినట్లు పని చేస్తా అని అప్పు అంటుంది.
మరోవైపు రాజ్ ఫోన్ మోగుతుంది. కావ్య అది చూడబోతుంటే ఇంతలో వచ్చిన రాజ్ వచ్చి లాగేసుకుంటాడు. దాంతో మనం బయటపడకూడదు. కూల్‌గా ఉండాలని కల్యాణ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్న కావ్య.. ఏమైంది. ఫోన్ లాగేసుకుని పారిపోతానని అనుకున్నారా అని కావ్య అంటుంది. కొత్త క్లైంట్ అని రాజ్ అంటాడు. కొత్త క్లైంటా.. పాత క్లైంటా.. పాత క్లైంట్ అయితే అర్థం చేసుకుంటారు. కట్ చేస్తే బిజీగా ఉన్నారని అనుకుంటారు. చేసే వరకు ఎదురచూస్తుంటారు. కానీ, కొత్త క్లైంట్ అయితే ఫీల్ అవుతారు కదా అని కావ్య అంటుంది.
ముక్కల గోల ఏంటీ
కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నారుగా. కొత్త కొత్త టేస్ట్‌లు వస్తున్నాయి. ఎవరు కొత్త ఎవరు పాత అనేది నాకు తెలియదు కదా. ఏది ఏమైనా కాపురం రెండు ముక్కలు చేయకూడదు. జీవితం రెండు ముక్కలు చేయకూడదు. కుటుంబాన్ని ముక్కలు చేయకూడదు. ఒక ముక్కగా జీవిచండం చాలా కష్టం అని కావ్య అంటుంది. ఏంటే ఈ ముక్కల గోల ఏంటే అని రాజ్ అంటే.. గోల కాదు జీవిత సత్యాలు. మీరు మీ కొత్త క్లైంట్‌తో మాట్లాడుకోండి. లేకుంటే ఫీల్ అవుతారు. నేను మధ్యలో వచ్చాను. మధ్యలోనే వెళ్తాను. అదే బయటకు అని వెళ్లిపోతుంది కావ్య.
దీనికి తెలిసి వాగిందా. తెలియగా అందా. ఒక్క చిన్న విషయానికి ఇంతా మాట్లాడుతుందా అని రాజ్ అనుకుంటాడు. మళ్లీ శ్వేత కాల్ చేస్తే.. లిఫ్ట్ చేస్తే.. ఇవాళ వస్తాను. నీతోనే ఉంటాను అని చెబుతాడు. తర్వాత పెద్దమ్మ గీజర్ రిపేర్ చేసే టెక్నిషీయన్ కావాలన్నారు కదా. ఎన్నింటికి రమ్మంటారు అని కల్యాణ్ అడుగుతాడు. వద్దు కల్యాణ్. నేను రాజ్‌ను అడిగి చేయించుకుంటాను అని అపర్ణ అంటుంది. అదేంటి పెద్దమ్మ నన్ను వేరేలా చూస్తున్నారా అని కల్యాణ్ అంటాడు. ఇన్నాళ్లు నేను నా బిడ్డలాగే చూశాను. కానీ, కాదని నిన్నే అర్థమైందని అపర్ణ అంటుంది.
అధికారం నీ కొడుకుకే
డొంక తిరుగుడు ఎందుకు అక్క నిన్న నేను అన్నదానికే అని చెప్పొచ్చు కదా. నేను అన్నదాన్నే చూస్తున్నావ్. కానీ, ఎందుకు అన్నానో ఆలోచించావా. వాడికి భార్య వచ్చింది. తన ముందే ఇలా చెబితే విలువ ఎక్కడ ఉంటుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. అది నీ కొడుకుకు చెప్పు అని అపర్ణ అంటుంది. అధికారం అంతా నీ కొడుకు దగ్గరే ఉంటే నా కొడుకుకు ఏం చెప్పను అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏంటీ ధాన్యలక్ష్మీ అలా అంటావ్ అని సుభాష్ అంటాడు. ఉన్నదే కదా బావగారు అన్నాను అని ధాన్యలక్ష్మీ అంటుంది.
దాంతో ఇద్దరిపై ఇందిరాదేవి కోప్పడుతుంది. ఇటు రండి అని బయటకు తీసుకెళ్తుంది. అసలు మీకు ఏమైంది. ఎందుకు ఇలా వాగుతున్నారు అని ఇందిరాదేవి అంటుంది. అక్కడ కూడా మళ్లీ అలాగే గొడవపడతారు ధాన్యలక్ష్మీ, అపర్ణ. మీరు ఇద్దరు చెప్పుడు మాటలు బాగా వింటున్నట్లు ఉన్నారు. చెప్పుడు మాటలు వింటే సయోధ్య పోయి అయోధ్యలో పుట్టకొకరు అయినట్లుగా ఉంటుంది. నేను ఉన్నప్పుడే ఇలా వాదించుకుంటున్నారు. నేను లేకపోతే మిమ్మల్ని ఎవరు అదుపు చేస్తారు అని ఇందిరాదేవి అంటుంది.
తప్పంతా నాదే అంటారా
అయ్యో ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నామని కానీ, మీరంటే లెక్కలేనట్లు కాదని ఇద్దరూ అంటారు. ఇన్నాళ్లు జరిగేదే కదా అని కల్యాణ్‌కు చెప్పాను కానీ, ధాన్యం మెదడులో ఇంత యుధ్దం జరుగుతుందని నాకేం తెలుసు. అందుకే కల్యాణ్‌కు పని చెప్పను అన్నాను. దీంట్లో తప్పేముంది అత్తయ్య అని అపర్ణ అంటే.. నీ తప్పు ఉందని కాదు అని ఇందిరాదేవి అంటుంది. అంటే తప్పంతా నాదే అంటారా అని మధ్యలో అంటుంది ధాన్యలక్ష్మీ. ఎహే ఆపు.. మధ్యలో దూరుతావ్ పూర్తిగా వినకుండా. మొట్టికాయలు వేస్తాను ఏమనుకున్నావో అని ఇందిరాదేవి అంటుంది.
అత్తలా కాదు ఒక తల్లిగా చెబుతున్నాను. బంధువలం కాదు. ఒకరోజు వెళ్లిపోడానికి. ఈ ఇంట్లోనే ఉండాలి. తెల్లారితే మొహం చూసుకోవాలి. ఎడమొహం పెడ మొహం లేకుండా ఉండొద్దు. ఇద్దరు ఒకే మాట మీద ఉంటే చెప్పుడు మాటలకు దూరం కాము. అర్థమైందా అని ఇందిరాదేవి అంటుంది. దాంతో ఇద్దరూ సరే అంటారు. తర్వాతి ఎపిసోడ్‌లో అపర్ణతో అత్తయ్య మన ఆఫీస్‌లో డిజైనర్‌గా జాయిన్ అవుదామనుకుంటున్నాను అని కావ్య చెబుతుంది. దాంతో అపర్ణ ఆలోచిస్తుంటే.. అనామిక, రుద్రాణి షాక్ అవుతుంది.
ఆఫీస్‌కు వెళ్లు
దాంతో మా అక్క కావ్యను ఆఫీస్‌కు వెళ్లొద్దని ఇల్లు చూసుకోమ్మని ఎప్పుడో చెప్పింది కదా. నీకు వంటిల్లే కరెక్ట్ స్థానం అని ధాన్యలక్ష్మీ అంటుంది. నా కోడలు ఎక్కడ ఉండాలో చెప్పడానికి నువ్వు ఎవరు. కావ్య నువ్ ఆఫీస్‌కు వెళ్లు అని అపర్ణ అంటుంది. దాంతో ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. కల్యాణ్ చాలా సంతోషిస్తాడు.