Brahmamudi February 1st Episode: ధాన్యంపై తొలిసారి అరిచేసిన కావ్య.. భార్యగా పనికిరావని కారణాలు చెప్పిన రాజ్
01 February 2024, 7:47 IST
Brahmamudi Serial February 1st Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 1వ తేది ఎపిసోడ్ చాలా ఉత్కంఠంగా సాగింది. ధాన్యలక్ష్మీపై మొదటిసారి కావ్య కోప్పడి గట్టిగా అరిచింది. అది చూసిన అపర్ణ కావ్యకే సపోర్ట్‌గా నిలిచింది. ఇక శ్వేత గురించి రాజ్‌ను కావ్య నిలదీసింది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 1వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో రాజ్ శ్వేతలను చూసి గుండె పగిలేలా కుమిలిపోతుంది కావ్య. అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోతుంది. బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే పాట కావ్యకు బాధకు అద్దం పడుతుంది. నీ లైఫ్ నాది. నేను ఉన్నాను అని శ్వేతకు రాజ్ చెప్పిన మాటలను తలుచుకుంటూ మరింతగా కుమిలిపోతుంది కావ్య. కారులో ఇంటికి వెళ్లిన కావ్యను చూసిన అనామిక.. నువ్ పులావ్ బాగా చేస్తావని కల్యాణ్ చెప్పాడు. అది ఎలా చేస్తారో నాకు కూడా నేర్పించు అని అడుగుతుంది.
కల్యాణ్ అడిగాడనే కదా
కానీ, బాధలో ఉన్న కావ్య సైలెంట్‌గా పైకి వెళ్లబోతుంది. దాంతో కావ్య చేయి పట్టుకున్న అనామిక ఏంటీ కావ్య కిచెన్ ఇటువైపు కదా. పైకి వెళ్తున్నావ్ అని అనామిక అంటుంది. నేను చాలా అలసిపోయాను అనామిక. వంట చేసే ఓపిక కూడా లేదు. ఇవాళ్టికి ఏదో ఒకటి నువ్వే చేసేయవా అని కావ్య అంటుంది. ఇప్పుడు కల్యాణ్ అడిగాడనే కదా అడిగాను. ఒక అరగంట అయితే అయిపోతుంది. నేర్పించొచ్చు కదా అని అనామిక అంటుంది. అదంతా ధాన్యలక్ష్మీ వింటుంది.
నాకు ఓపిక లేదని చెప్పాను కదా. మీకు వండి వార్చడానికే నేను ఉన్నానా అని అనామికపై కావ్య అరుస్తుంది. తర్వాత వెళ్లిపోతుంది. అప్పుడు హేయ్.. ఆగు.. ఇప్పుడు నా కోడలిపై ఎందుకు అంతలా అరుస్తున్నావ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇది కదా మనకు కావాల్సింది అని అనామిక మనసులో అనుకుంటుంది. కల్యాణ్ కోరిందే కదా అనామిక అడిగింది. నా కొడుకును బానిసలా చూస్తారు. వాడికి కావాల్సింది అడిగితే మాత్రం చేయరా అని ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది.
ధాన్యలక్ష్మీపై కావ్య ఫైర్
ధాన్యలక్ష్మీ అనే మాటలు అపర్ణ వింటూ ఉంటుంది. అయ్యో నేను అరిచానా. నా ఉద్దేశం అది కాదు అని కావ్య అంటుంది. మాట్లాడకు. అంతా నేను నా కళ్లారా చూశాను. ఒక్కసారి ఆఫీస్‌కు వెళ్లి రాగానే అహంకారం వచ్చిందా. నిన్ను నా కోడలు నీ ఆస్తి అడిగిందా.. నీ పుట్టింటి ఏడు వారాల నగలు అడిగిందా. నువ్వు ఎంత నీ లెక్క ఎంతా అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో హేయ్.. ఆపు.. అని ధాన్యలక్ష్మీపై మొదటిసారి అరుస్తుంది. దాంతో ధాన్యలక్ష్మీ, అనామిక షాక్ అవుతారు. అపర్ణ చూస్తూ ఉంటుంది.
ఏంటీ.. ఆ ఏంటీ.. నాకు మూడ్ లేదు. ఓపిక లేదు. అవసరం అంతకన్నా లేదు. ఏ.. నేను మీకు వండి వార్చడానికే పుట్టానా. పుట్టింటి గురించి మాట్లాడతావేంటీ. నువ్వెంత నీ లెక్కంత అంటావేంటీ. నా బతుక్కి అహంకారం ఒక్కటే తక్కువ. నేను పనిమనిషిలా కనిపిస్తున్నానా. అలా అరుస్తారేంటీ అని కావ్య బాధగా, కోపంగా అంటుంది. ఏంటీ.. ఎంత ధైర్యం నీకు అని ధాన్యలక్ష్మీ అంటే.. నీకు ఎంత ధైర్యం అని అపర్ణ ఎంట్రీ ఇస్తుంది. నా కోడలు మీద అరవడానికి నీకు ఏం హక్కు ఉంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ అని అపర్ణ అంటుంది.
రెస్ట్ తీసుకోమన్న అపర్ణ
ఆఫీస్‌కు వెళ్లి వచ్చింది కాబట్టి ఓపిక లేకపోయి ఉండొచ్చు. పని చేసింది కాబట్టి అలసిపోయి ఉండొచ్చు. అంత మాత్రన మీద పడిపోతావేంటీ. నా కోడలే దొరికిందా వంట చేయడానికి. వంట రాని కోడలిని చేసుకున్నందుకు నువ్ అనుభవించు. లేనిపోని పెత్తనం మీద వేసుకుని అందరిపై చూపిస్తే బాగుండదు. అదంతా నీ భర్త, కోడలిపై చూపించు. నీ కొడుక్కి అవసరం ఉంటే నన్ను అడగమను. లేదా నీ కోడలిని అడగమను. స్టౌవ్ ముట్టించరాని నీ కోడలికి నువ్ వంట నేర్పు.. ఇంకోసారి నా కోడలిని అంటే బాగుండదు అని ఫైర్ అయిన అపర్ణ కావ్యను రెస్ట్ తీసుకోమ్మని చెబుతుంది.
దాంతో అంతా వెళ్లిపోతారు. పైకి గదిలోకి వెళ్లిన కావ్య.. చీకట్లో కూర్చుని ఏడుస్తుంది. రాజ్ శ్వేతలను తలుచుకుంటూ కుమిలిపోతుంది. ఇంతలో అక్కడికి కల్యాణ్ వచ్చి చీకట్లో ఉన్నారేంటి. ఏమైందని అడుగుతాడు. కావ్య మౌనంగా ఉండి ఏడుస్తూ కనిపించడంతో.. అర్థమైంది. ఏదో జరగరాంది జరిగింది. శ్వేత విషయంలో మన అనుమానమే నిజమైందా అని అడుగుతాడు. దాంతో జరిగింది చెబుతుంది కావ్య. నిజమా.. అన్నయ్య ఇంతలా మారిపోయాడా. పదిమందికి న్యాయం చెప్పే అన్నయ్యే ఇలా చేస్తాడా. మీరు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాను. లేకుంటే నమ్మకపోయేవాన్ని అని కల్యాణ్ అంటాడు.
అన్నయ్య దూరం అయిపోతాడు
వాళ్లిద్దరిని అక్కడ చూసి మౌనంగా వస్తావా. చీకట్లో ఏడుస్తూ కూర్చుంటావా. అక్కడే కడిగేయాలి. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీయాలి. అప్పుడే వాళ్లకు చేసిన తప్పేంటో తెలుస్తుంది. భార్యలు ఏం అనకుండా. సంస్కారం వదులుకుని రావడం ఏంటీ. భర్త తప్పు చేస్తే అడిగే హక్కు భార్యలకు ఉంది. ఇప్పుటికైనా అన్నయ్య వచ్చాకా అడుగు. ఎందుకు ఇలా చేశావ్ అని నిలదీయి. ఇవాళ ధైర్యం చేయకపోతే అన్నయ్య దూరం అయిపోతాడు. పరిస్థితిని అదుపులోకి తీసుకురాకపోతే కోల్పోతాం అని కల్యాణ్ అంటాడు.
బాగా ఆలోచించి.. అన్నయ్యను ఎలా అడగాలో.. అన్నయ్య నోటి నుంచే నిజం రప్పించు అని కల్యాణ్ బాగా సపోర్ట్ చేస్తాడు. తర్వాత హాల్లో కల్యాణ్ అటు ఇటు తిరుగుతుంటాడు. ఇంతలో రాజ్ వచ్చి ఇక్కడ తిరుగుతున్నావేంట్రా అని రాజ్ అడిగితే.. నువ్ బయట తిరుగుతున్నావ్. నేను ఇక్కడ తిరుగుతున్నాను అని కోపంగా అనేసి వెళ్లిపోతాడు కల్యాణ్. ఏమైంది వీడికి అనుకుంటూ లోపలికి వెళ్లిపోతాడు రాజ్. గదిలోకి వెళ్లిన రాజ్‌ను చూసిన కావ్య వెళ్లి డోర్ వేస్తుంది.
మధ్యలో వెళ్లిపోయిన పనేంటీ
డోర్‌ను వేస్తారే.. తన్నరు. అయినా నేను కదా మొదలుపెట్టాలి. అందరిని ఒప్పించి ఆఫీస్‌కు వచ్చావ్. మధ్యలోనే వెళ్లిపోయావ్. ఇదేనా ప్యాషన్, నీ డెడికేషన్ అని రాజ్ అంటాడు. నేను నేరుగా ఇంటికే వచ్చాను. మీరు మధ్యలో ఎక్కడికి వెళ్లిపోయారు అని కావ్య అంటుంది. దాంతో కాస్తా ఆగినా మగాడు అన్నాకా సవా లక్ష పనులు ఉంటాయి అని రాజ్ అంటాడు. ఆ పనుల్లో ఇవాళ మధ్యలో వెళ్లిపోయిన పనేంటి, మీటింగ్ అని చెప్పి ఎక్కడెక్కడో తిరిగే అవసరం ఏంటీ అని కావ్య నిలదీస్తుంది.
అవన్ని నా పర్సనల్. నీకు చెప్పాల్సిన పనిలేదు అని రాజ్ వెళ్లిపోతుంటే.. నేను మీ భార్యను, మీరు రహస్యంగా కలిసే శ్వేతను కాదు అని కావ్య అంటుంది. దాంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు. మీటింగ్ అని చెప్పి ఎందుకు కలుస్తున్నారు. నాకు బిజీ అని చెప్పి ఎందుకు తిరుగుతున్నారు అని కావ్య అంటే.. నా మీద అనుమానపడుతున్నావా. నా మీద నిఘా పెట్టావా. నన్ను ఫాలో అవుతున్నావా అని రాజ్ అంటాడు. మీరు ఎవతితోనే తిరిగితే తప్పు లేదు కానీ, నేను నా భర్తను ఫాలో అయితే తప్పా అని కావ్య అంటుంది.
మనిషిలాగే చూశాను
నేను నిన్ను భార్యగా ఎప్పుడూ చూడలేదు అని రాజ్ అంటే.. నేను మాత్రం భర్తలాగే చూశాను అని కావ్య అంటుంది. మనది భార్యాభర్తల బంధం కాదు అని రాజ్ అంటే.. అది మీరు కాదు చెప్పాల్సింది. ఈ తాళిబొట్టు చెప్పాలి. పెళ్లి హోమం చెప్పాలి. ఈ బ్రహ్మముడి చెప్పాలి. మీరు నన్ను మనిషిలా ఎప్పుడూ చూడలేదు. కానీ, నేను మనిషిలాగే చూశాను అని కావ్య అంటుంది. మనది ఎప్పటికైనా విడిపోయే బంధమే అని రాజ్ అంటాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది.
ఎందుకు విడిపోవాలి. అంత పెద్ద తప్పు నేను ఏం చేశాను. భర్తగా గుర్తించట్లేదా. భార్యగా సేవలు చేయట్లేదా. ఏం తక్కువ చేశాను మీ జీవితంలో నుంచి వెళ్లిపోడానికి. ఇవాళ నాకు స్పష్టంగా చెప్పాలి అని కావ్య అంటుంది. నువ్ ఏ తప్పు చేయలేదు. కోడలిగా అన్ని బాగా చేశావ్. బాధ్యతలు నిర్వర్తించావ్. అయినా నాకు వద్దు. ఇష్టపడటానికి కారణాలు ఉంటాయోమో గానీ, వద్దనుకోడానికి కారణాలు లేవు అని రాజ్ అంటాడు. తొక్కలో ఫిలాసఫీ. వద్దనడానికి కారణం లేకుంటే ఏ కారణంతో కాదనుకుంటున్నారు. నాకన్న అందగత్తె దొరికిందా. నా మీద ఇంట్రెస్ట్ పోయిందా అని కావ్య అంటుంది.
మీరే కావాలనుకుంటున్నాను
మీ బలహీనతను దాచిపెట్టుకుని నన్ను దోషిని చేద్దామనుకుంటున్నారా. నన్ను బలి చేయాలనుకుంటున్నారా. ఇష్టం లేదని చెప్పడానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు నాకు కావాలి. నేను మీకు ఏం అడ్డుగా ఉన్నాను. ఏనాడు నన్ను భార్యగా చెప్పుకోలేదు. నన్ను ఏనాడు తాకలేదు. ఒక ముద్దుముచ్చట లేకుండా నిస్సహాయంగా బతుకుతున్నాను. నేను మీరే కావాలని కోరుకుంటున్నాను. నేను మీతో సద్దుకుపోతున్నాను. ఇంత సద్దుకుపోతున్న భార్యను కాదనుకోడానికి కారణం ఏంటని కావ్య బాధగా అడుగుతుంది.
బ్రహ్మముడి సీరియల్ తర్వాతి ఎపిసోడ్‌లో ఒక్క కారణం చెప్పమని కావ్య నిలదీస్తుంది. దాంతో చెబుతానే. నీకు ఇప్పుడే రాసి చూపిస్తాను. నా పెళ్లాం నాకు పెళ్లాంగా పనికిరాదనడానికి కారణాలు అన్ని రాసి ఇస్తాను అని రాజ్ అంటాడు. తర్వాత బోర్డ్‌పై 1 అని రాసి చూస్తాడు. దాంతో కావ్య అలానే చూస్తూ ఉండిపోతుంది.