తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi May 20th Episode: బ్రహ్మముడి- దుగ్గిరాల ఇంట్లో బిడ్డ తల్లిని నిలబెట్టిన కావ్య- రుద్రాణికి పెళ్లి సంబంధాలు!

Brahmamudi May 20th Episode: బ్రహ్మముడి- దుగ్గిరాల ఇంట్లో బిడ్డ తల్లిని నిలబెట్టిన కావ్య- రుద్రాణికి పెళ్లి సంబంధాలు!

Sanjiv Kumar HT Telugu

20 May 2024, 7:10 IST

google News
  • Brahmamudi Serial May 20th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 20వ తేది ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో అందరిముందు బిడ్డ తల్లి మాయను తీసుకొచ్చి నిలెబడుతుంది కావ్య. అలాగే ఇంట్లోకి పూజారి వస్తే రుద్రాణి కౌంటర్స్ వేస్తుంది. దానికి స్వప్న రివర్స్ కౌంటర్ వేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మే 20వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మే 20వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ మే 20వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో ఇంటికి వచ్చిన కావ్యను రాజ్ తిడుతుంటాడు. బుద్ధుందా, కొంచెం జ్ఞానమైనా ఉందా. నీకు బ్రెయిన్ మోకాళ్లలో ఉంది అని రాజ్ అంటే మోకాలిని నిమిరుకుంటుంది కావ్య. నేను రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే ఏం జరిగేదే తెలుసా. వాళ్లు ఎలాంటి వాళ్లో తెలుసా. తింగరి మొహందానా.. బిత్తిరి దానా అని కావ్య తలపై మొట్టి కాయ వేస్తాడు రాజ్.

డిటెక్టివ్ లాగా

ఏం మాట్లాడవేంటే.. ఎప్పుడు లొడలొడ వాగుతుంటావ్ కదా అని రాజ్ అంటే.. కావ్య నవ్వుకుంటూ ఉంటుంది. నేను తిడుతుంటే నవ్వుతావాంటే. వాళ్లు డిప్పమీద కొట్టారా. బ్రెయిన్ పనిచేయట్లేదా అని రాజ్ అంటాడు. మీరు తిడుతుంటే ముచ్చటగా ఉంది. తిట్టండి. మీ కోపం తాపంగా ఉంది అని కావ్య అంటుంది. నేను ఏం మాట్లాడుతున్నాను. నువ్ ఏం అంటున్నావ్. పెద్ద డిటెక్టివ్ లాగా బయలుదేరింది. చూడు నీకు బాబు వెనుకున్న కథ తెలిసిపోయిందని నాకు తెలిసిపోయిందని రాజ్ అంటాడు.

దాంతో కావ్య షాక్ అవుతుంది. ఇప్పుడు నిజాలు అన్ని ఇంట్లో ముందు వాళ్ల బయటపెట్టాలనుకున్నావా. నేను ఊరికే కామ్‌గా ఎందుకు ఉన్నాను. నిజాలు తెలిస్తే ఏమవుతుందో అనే కదా. నిజం చెప్పు ఆ మాయను ఇంటికి తీసుకురావడానేకి కదా నువ్ వెళ్లింది అని రాజ్ అడుగుతాడు. లేదండి.. అలా ఎందుకు అనుకుంటారు. నేను మాయను తీసుకురావడానికి వెళ్లలేదు. నిజాలు బయటకు తీసుకురావడానికి వెళ్లాను అని కావ్య బదులిస్తుంది.

నాకే డౌట్ వచ్చింది

ఇంకా ఏం నిజాలు ఉన్నాయి తెలుసుకోడానికి అని రాజ్ అంటాడు. ఏ తల్లి ఒకరికి ఇచ్చి చేతులు దులిపేసుకోదు. నిజంగా తనకు అన్యాయం జరిగితే న్యాయం కోసం నేరుగా ఇంటికే వస్తుంది. బిడ్డ భవిష్యత్ గురించి తల్లడిల్లిపోతు న్యాయం చేయమంటూ అర్జిస్తుంది. కానీ, ఈ మాయ ఏదో మాయ చేస్తోంది. ప్రతి నెల పది లక్షలు తీసుకుంటూ ఎక్కడో అజ్ఞాతంగా ఉంటే నాకే డౌట్ వచ్చింది. మీకెందుకు రావట్లేదు అని కావ్య అంటుంది.

ఆవిడ ఏంటనేది నాకు అనవసరం. ఇప్పుడు ఆమె జోలికెళ్తే ఆమె బిడ్డను తీసుకుని ఇంటికి వస్తుంది. అప్పుడు మా నాన్న, అమ్మ పరిస్థితి ఏంటీ. కాస్తా అటు ఇటు అయినా మొత్తం గందరగోళం అవుతుంది. చేసిన ఘనకార్యం చాలు. ఇకనుంచి అయినా మీ ప్రయత్నాలు మానుకో అని రాజ్ అంటాడు. మానుకోను. తప్పుజరుగుతుంటే నేను ఊరుకోలేను. తెలిసినా నాకెందుకని ఊరుకోలేను. ఆ మాయ వెనుకున్న నిజాన్ని బయటకు తీస్తాను అని కావ్య అంటుంది.

తప్పించుకు తిరిగిన రుద్రాణి

నాకిష్టం లేదని రాజ్ అంటాడు. క్షమించండి. నన్ను ఆపలేరు. నన్ను నేనే ఆపుకోలేను అని కావ్య వెళ్లిపోతుంది. చెప్పింది వినవే అని రాజ్ అంటాడు. మరోవైపు అనామిక దగ్గరికి రుద్రాణి వస్తుంది. ఇదేంటి నాకోసం ఎదురుచూస్తున్నట్లు ఉంది. లాస్ట్ టైమ్ ఇచ్చిన ఐడియాకు తిట్టింది. ఇప్పుడు ఇచ్చిన ఐడియాకు కల్యాణ్ విడాకులు అన్నాడని ఏమంటుందో అని వెళ్లిపోతుంటుంది. కానీ, అనామిక చూసి పిలుస్తుంది. అయ్యో చూసేసింది అని రుద్రాణి అనుకుంటుంది.

నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. కల్యాణ్ ఇలా అంటాడని అనుకోలేదు అని అనామిక అంటుంది. హమ్మయ్యా.. నన్ను తిట్టడం కోసం కాదు. మొగుడు గురించి బాధపడుతుంది అనుకున్న రుద్రాణి.. కాపురం నిలబడుతుందని ఐడియా ఇస్తే కల్యాణ్ ఇలా ట్విస్ట్ ఇస్తాడని అనుకోలేదని రుద్రాణి అంటుంది. మీకు గొడవ ఎక్కడ వస్తుందో ఆలోచించు. చూశావుగా కరెక్ట్ టైమ్‌కు అప్పు ఎలా వచ్చింది. వాళ్లు అనుకునే ఇది ప్లాన్ చేశారని రుద్రాణి అంటుంది.

కోపంగా రాజ్

కానీ, మా అమ్మ నాన్న వస్తున్నట్లు కల్యాణ్‌కు తెలియదు కదా అని అనామిక అంటే.. నీకు విడాకులు ఇవ్వడానికి వాళ్లెందుకు. ముందు కల్యాణ్‌ను ఒంటరివాడిని చేయు తర్వాత నీ మీద ఎలా ప్రేమ రావాలో నేను చెబుతాను అని రుద్రాణి అంటుంది. అప్పును దూరం చేయాలి. పూర్తిగా అర్థమైంది అని వెళ్లిపోతుంది అనామిక. కట్ చేస్తే రాజ్ నిద్ర లేచి బాబును చూస్తాడు. కావ్య వచ్చి శుభోదయం అంటూ టీ ఇస్తుంది. కానీ, రాజ్ పలకడు.

కావ్య ఎన్ని రకాలుగా మాట్లాడించినా రాజ్ మాట్లాడడు. చివరికి థ్యాంక్స్ అని చెప్పి టీ తనే తాగుతుంది కావ్య. దాంతో రాజ్ కోపంగా చూస్తాడు. బతిమిలాడుకుంటాననుకున్నారా అంత లేదు అని కావ్య అంటే.. రాజ్ బాత్రూమ్‌కు వెళ్లిపోతాడు. తర్వాత టవల్ ఇస్తే రాజ్ తీసుకోడు. దాంతో ఈ టవల్‌ను ఇక వీడి ముడ్డి కింద వాడతాను. మెత్తగా ఉంటుందని కావ్య అంటే.. ఆపు అని రాజ్ తీసుకుంటాడు. నాతో మాట్లాడరా అని కావ్య అంటే నువ్ వెతకడం మానుకోవా అని రాజ్ అంటాడు.

బాడీగార్డ్‌లా కాపాడారు

కోను అని కావ్య అంటుంది. కొంచెం ఉంటే బార్డర్ దాటేసేదానివని రాజ్ అంటే.. అది దాటేలోపు బాడీగార్డ్‌లా మీరు వచ్చి నన్ను కాపాడారు కదా అని కావ్య చెబుతుంది. అన్నిసార్లు నేను కాపాడలేను అని రాజ్ అంటాడు. మీ బాధ నేను ప్రమాదంలో పడతాననా.. లేకుంటే ఆ మాయను తీసుకొస్తే మీరు, మీ అమ్మ, మీ నాన్న ప్రమాదంలో పడతారనా అని కావ్య అడుగుతుంది. దాంతో రాజ్ సైలెంట్‌గా అటు ఇటు చూస్తాడు. ఏయ్.. దొంగ.. నాకు తెలుసు మీ ముగ్గురు ప్రమాదంలో పడతారనే కదా అని కావ్య అంటుంది.

నీ అన్వేషణ ఆపు అని రాజ్ అంటే.. ఏదో పద్యం చెప్పి.. ప్రారంభించిన పనిని మధ్యలో ఆపరు అని కావ్య చెబుతుంది. మా అమ్మపై పగ సాధిస్తున్నావా అని రాజ్ అడిగితే.. ఇంటి రుణం తీర్చుకుంటున్నాను. ఆ మాయ వెనుకున్న నిజాలు వెలికితీసి మీకు మావయ్యకు, అత్తయ్యకు ఎలాంటి సమస్య రాకుండా చూస్తాను అని కావ్య అంటుంది. తర్వాత మీ తమ్ముడుని చూస్తూ ఉండండి అని కావ్య అంటే.. ఏంటీ అని రాజ్ అడుగుతాడు.

మీకు సంబంధాలేమో

ఏంతైనా మీ రక్తం పంచుకున్న తమ్ముడే కదా. లేకుంటే మా ముద్దుల మరిదిని చూసుకుంటూ ఉండండి. ఉగ్గు తెస్తాను అని కావ్య వెళ్లిపోతుంది. హాల్లో అంతా ఉంటారు. అప్పుడే పంతులు వస్తాడు. మొన్న సీతారాముల కల్యాణం జరిపించాం. ఇప్పుడు ఎవరి కల్యాణం జరిపించాలి అని రుద్రాణి అంటుంది. మీరు ఒక్కరే ఖాలీగా ఉన్నారు. మీకే సంబంధాలు తెచ్చారేమో అని స్వప్న కౌంటర్ ఇస్తుంది. షటప్ అని రాహుల్ అరుస్తాడు.

భద్రాచలం నుంచి సీతారాముల కల్యాణం నుంచి అక్షంతలు వచ్చాయి. అవి తీసుకొచ్చాను. ఈ అక్షింతలు ఈ ఇంట్లోని భార్యపై భర్త వేస్తే ఆదర్శం దంపతులుగా ఉంటారు అని పంతులు అంటారు. భార్యాభర్తలు వరుసగా నిలుచుంటే నేను సంకల్పం చెబుతాను. మీరు ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయమంటాడు పంతులు. సుభాష్‌కు అక్షింతలు ఇస్తే తటపటాయిస్తాడు సుభాష్. దాంతో రాజ్‌తోపాటు అపర్ణ చూస్తారు. అక్షింతలు తీసుకోండని అపర్ణ అంటే.. తీసుకుంటాడు సుభాష్.

మా అత్తలా నిల్చున్నావ్

అందరికీ అక్షింతలు ఇస్తాడు పంతులు. సీతారామయ్య కాళ్లకు మొక్కి ఇందిరాదేవి ఆశీర్వాదం తీసుకుంటుంది. సుభాష్ కాళ్లను అపర్ణ మొక్కితే.. సుభాష్ ఆలోచిస్తుంటాడు. ఆశీర్వదించండి అని అపర్ణ అంటే.. పవిత్రమైన అక్షింతలు తాకే అర్హత నాకు లేదు. నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపపడుతుంటాడు సుభాష్. అపర్ణ గట్టిగా అడగడంతో శ్రీరామచంద్ర అనుకుని అక్షింతలు వేస్తాడు సుభాష్. అనామిక నువ్వేంటీ మా అత్తల నిల్చున్నావ్. కల్యాణ్ ఎక్కడ అని అడుగుతుంది స్వప్న.

ధాన్యలక్ష్మీ కూడా అడిగేసరికి.. ఊహలోకంలో విహరిస్తున్నాడు. ఇప్పుడెళ్లి డిస్టర్బ్ చేస్తే ఏం అంటాడో మీకు తెలుసు. తర్వాత వెళ్లి ఇస్తానులెండి అక్షింతలు అని అనామిక అంటుంది. దాంతో స్వప్న నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావని రుద్రాణి అడిగితే.. మావయ్య లేడు కదా మీకు మీరే వేసుకోండి అక్షింతలు అని స్వప్న అంటుంది. ఏయ్.. నోరు తిన్నగా ఉండదా అని రాహుల్ కోప్పడతాడు. తర్వాత బుద్ధి, జ్ఞానం రావాలని ధాన్యలక్ష్మీని ఆశీర్వదిస్తాడు ప్రకాశం.

సింగిల్‌గా ఉంది

కావ్య ఆశీర్వాదం తీసుకుంటుంటే ఆపుతుంది రుద్రాణి. పూజారి గారు నాది ధర్మ సందేహం. శ్రీరామచంద్రుడి అక్షింతలు వేసే అర్హత ఏక పత్నీవ్రతుడికే ఉంటుంది కదా అని రుద్రాణి అంటుంది. దాంతో అంతా రుద్రాణిపై సీరియస్‌గా చూస్తారు. మీ బుద్ధి చూపించుకున్నారు కదా. సీతారాముల కల్యాణం అప్పుడు అడ్డుపడిన అనామిక ఇప్పుడు సింగిల్‌గా నిలుచుంది. ఇప్పుడు మీరు మొదలుపెట్టారా అని స్వప్న అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇంట్లోకి మాయ

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో బిడ్డ తల్లిని తీసుకొస్తానని కావ్య చెప్పింది కదా. ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. ఈరోజు కూడా ఓడిపోయానని చెబుతుంది. లేదంటే ఓడిపోయానని చెప్పడానికి ఇగో అడ్డొచ్చి మొహం చూపించలేక ఇంట్లోంచి వెళ్లిపోయిందేమో అని రుద్రాణి అంటుంది. ఆ అవసరం నాకు లేదు అని కావ్య ఎంట్రీ ఇస్తుంది. అనుకున్నది ఆలస్యం కావొచ్చు కానీ, సాధించే తీరుతాను అని చెప్పిన కావ్య మాయ అని పిలుస్తుంది. దాంతో సుభాష్, రాజ్‌తోపాటు అంతా షాక్ అవుతారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం