Brahmamudi October 14th Episode: ఒక్కటైన రాజ్, కావ్య - కొడుకు అనుమానాల్ని తొలగించిన అపర్ణ - కనకం హ్యాపీ
14 October 2024, 7:44 IST
Brahmamudi October 14th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 14 ఎపిసోడ్‌లో తన తల్లిదండ్రుల పెళ్లిరోజును రాజ్ గ్రాండ్‌గా జరిపించాలని అనుకోవడం వెనుక ఎదో మతలబు ఉందని కావ్య అనుమానపడుతుంది. కనకం ప్లాన్ వేసి దుగ్గిరాల ఫ్యామిలీని ఇంటికి రప్పించి ఉంటుందని అనుమానపడుతుంది.
బ్రహ్మముడి అక్టోబర్ 14 ఎపిసోడ్
Brahmamudi October 14th Episode: కావ్య తల్లిదండ్రులైన కనకం, కృష్ణమూర్తిల పెళ్లిరోజును గ్రాండ్‌గా జరపాలని రాజ్ ఫిక్సవుతాడు.తనతో పాటు తన ఫ్యామిలీ మొత్తాన్ని కావ్య ఇంటికి తీసుకొస్తాడు రాజ్. దుగ్గిరాల కుటుంబం అంతా కలిసిపోయి తన ఇంటికి రావడం చూసి కావ్య సర్‌ప్రైజ్‌తో పాటు షాకవుతుంది.
కనకం నాటకం...
కనకం ఇంట్లో కిచెన్‌లో అపర్ణ, ఇందిరాదేవి వంట చేస్తుంటారు. అది చూసి కనకం కంగారుగా కిచెన్‌లోకి వస్తుంది. మీకెందుకు శ్రమ ఏం కావాలో చెబితే నేను చేస్తానని అపర్ణతో అంటుంది. నీకు క్యాన్సర్ అని చెప్పి రాజ్‌ను ఇక్కడికి పిలిపించిన సంగతి గుర్తులేదా అంటూ కనకానికి అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరు కలిసి క్లాస్ ఇస్తారు.
ఏం చేయకుండా సెలైంట్‌గా కూర్చొమని హెచ్చరిస్తారు. క్యారెక్టర్ కొత్తగా వేసింది కావడంతో క్యాన్సర్ నాటకం మర్చిపోయానని కనకం అంటుంది. ఇప్పుడు చూడండి అదరగొడుతానని శాలువా కప్పుకొని దగ్గుతున్నట్లుగా నటిస్తుంది. నీ పర్ఫార్మెన్స్ మా ముందు కాదు...వెళ్లి నీ అల్లుడు ముందు చేయమని కనకంతో అంటుంది అపర్ణ.
రాజ్ ముందు బిల్డప్‌లు...
తన నోటి నుంచి రక్తం వచ్చినట్లుగా రాజ్ ముందు బిల్డప్ ఇవ్వాలని కలర్ వాటర్ కలుపుకొని పెట్టుకుంటుంది కనకం. ఆ బాటిల్ కోసం వెతుకుతుండగా అప్పుడే రాజ్...కనకం దగ్గరకు వస్తాడు. తన ఫ్రెండ్స్‌లో ఓ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడని, మీ రిపోర్ట్స్ నాకు ఇస్తే అతడికి చూపిస్తానని కనకంతో రాజ్ అంటాడు.
ఆ మాట వినగానే లేని రిపోర్ట్స్ ఎక్కడి నుంచి తేవాలి అని కనకం కంగారుపడుతుంది. లేవంటే రాజ్‌కు అనుమానం వస్తుందని ఆలోచిస్తుంది. మీకు క్యాన్సర్ అని తెలిసినప్పటి ఇంత డబ్బు ఉండి మిమ్మల్ని కాపాడలేకపోతున్నాననే బాధ తనను వెంటాడుతుందని రాజ్ అంటాడు. రిపోర్ట్స్ కావాల్సిందేనని రాజ్ పట్టుపడతాడు.
టాపిక్ డైవర్ట్...
మీరంతా నా కళ్ల ముందు సంతోషంగా వేడుకను జరపడం ఆనందంగా ఉందని, ఈ ఒక్కరోజు రిపోర్ట్స్ సంగతి మర్చిపోయి ప్రశాంతంగా వేడుకను ఎంజాయ్ చేద్దామని అల్లుడితో కనకం అంటుంది. రేపు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని, ఏ టెస్ట్‌లు అయినా చేసుకుంటానని చెబుతుంది. సెంటిమెంట్ డైలాగ్స్‌తో రాజ్‌ను బోల్తా కొట్టిస్తుంది. అత్త మాటలకు కరిగిపోయి రాజ్ వెళ్లిపోతాడు. ఈ ఫంక్షన్ అయిపోయేలోపు రాజ్, కావ్యను ఎలాగైనా కలపాలని కనకం అనుకుంటుంది.
కావ్య అనుమానం...
దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం తమ ఇంటికి రావడం వెనుక తల్లి పాత్ర ఉందని కావ్య అనుమానపడుతుంది. వాళ్లు రావడానికి నువ్వే ఏదో చేశావని తల్లిని నిలదీస్తుంది. మా అత్తగారు వచ్చి పనులు చేస్తున్నారంటే సరే...కానీ మీ అల్లుడు కూడా వచ్చి దగ్గరుండి ఇవన్నీ చేస్తున్నాడంటే నమ్మబుద్ది కావడం లేదని తల్లితో అంటుంది కావ్య. అది నన్ను కాదు...వాళ్లను అడుగు అంటూ కనకం తప్పించుకోబోతుంది. నువ్వు చెప్పకపోతే రాజ్‌ను అడిగేస్తానని కావ్య వార్నింగ్ ఇస్తుంది.
రాజ్ మనసులో నువ్వే ఉన్నావు...
అప్పుడే అక్కడికి అపర్ణ, ఇందిరాదేవి వస్తారు. అమ్మతో ఇలాగేనా మాట్లాడిదే..తను ఏదో తప్పు చేసినట్లుగా ఎందుకు నిలదీస్తున్నావని కోడలిపై అపర్ణ ఫైర్ అవుతుంది. ఈ పెళ్లిరోజును వాడుకొని రాజ్‌ను తానే ఇక్కడికి రప్పించినట్లు కావ్యతో అసలు నిజం చెబుతుంది అపర్ణ.
ఇక్కడికి వచ్చినంత మాత్రానా...రాజ్ మనసులో నా పట్ల ప్రేమ పుడుతుందని అనుకుంటున్నారా అని అపర్ణకు బదులిస్తుంది కావ్య. రాజ్ మనసులో నువ్వే ఉన్నావని, ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడని, కానీ తన అహంకారం వల్ల ప్రేమను మనసులో దాచుకున్నాడని కావ్యతో చెబుతుంది అపర్ణ. కావాలనే నీ మీద కోపాన్ని చూపిస్తున్నాడని అంటుంది.
ప్రేమ..అపోహ మాత్రమే...
లేని ప్రేమ ఉందని మీరు అపోహపడుతున్నారని అపర్ణ మాటలను కొట్టిపడేస్తుంది కావ్య. అసలు ఏమనుకుంటున్నారు మీరు...గొడవపడి దూరంగా ఉంటే సమస్యలు తీరిపోవని కావ్యకు క్లాస్ ఇస్తుంది.
ఆవేశంలో అన్న మాటను పట్టుకుంటే నష్టపోయేది నువ్వే...రాజ్‌పై నీకు నమ్మకం లేకపోవచ్చు నాకు ఉంది...వాడి కళ్ల ముందు నువ్వు ఏంటే రాజ్ మనసులో ఉన్న ప్రేమ బయటపడే అవకాశం ఉందని కావ్యతో అంటుంది కావ్య.
అత్తయ్యకు మాటిచ్చిన కావ్య...
నేను నీ కోసం ఇంత చేస్తున్నప్పుడు...నా కోసం నువ్వు నీ కోపాన్ని పక్కనపెట్టి మౌనంగా ఉండలేవా అని కావ్యను అడుగుతుంది అపర్ణ. ఈ ఫంక్షన్ పూర్తయ్యే నేను చెప్పినట్లు నడచుకోమని అంటుంది. సరేనని అత్తయ్యకు మాటిస్తుంది కావ్య.
ఫేక్ కాల్...
అపర్ణ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమెను వదిలి కావ్య ఆఫీస్‌కు వెళ్లినందుకే రాజ్ భార్యను అపార్థం చేసుకున్నాడు కాబట్టి అదే రూట్‌లో అతడి అనుమానాల్ని పోగొట్టాలని అపర్ణ, ఇందిరాదేవి, కనకం స్కెచ్ వేస్తారు. మేనేజర్ చేత రాజ్‌కు ఫేక్ కాల్ చేయిస్తుంది అపర్ణ. అప్పుడే రాజ్ కళ్ల ముందు ఉన్న ముసుగులు తొలగిపోయి అసలు నిజాలు తెలుసుకుంటాడని అపర్ణ అనుకుంటుంది.
మనం అఫీషియల్‌గా కొన్నదానికంటే ఎక్కువగా గోల్డ్ ఆఫీస్‌లో ఉన్నట్లు రికార్డుల్లో తేలినట్లు రాజ్‌తో ఫోన్‌లో మేనేజర్ చెబుతాడు. మేనేజర్ మాటలతో కంగారుగా రాజ్ ఆఫీస్ బయలుదేరబోతాడు. కనకం, కృష్ణమూర్తి పెళ్లిరోజును గ్రాండ్‌చేస్తానని ఇప్పుడు మధ్యలో వెళ్లిపోతేఎలా అని ఇందిరాదేవి, అపర్ణ రాజ్‌ను ఆపేందుకు ప్రయత్నిస్తారు. . చాలా అర్జెంట్ అంటూ రాజ్ వెళ్లిపోతాడు.
రుద్రాణి మనసులో ఆలోచనలు...
రుద్రాణికి కారాలు, మిరియాలు నూరే పని అప్పగిస్తుంది అపర్ణ. , అందరూ సంతోషంగా ఉంటే ఓర్చుకోలేవు కదా...నీకు తగ్గ పనే చేస్తున్నావని ధాన్యలక్ష్మి సెటైర్లు వేస్తుంది. వియ్యంకురాలికి మర్యాదలు చేయాల్సింది పోయి తనతో ఈ పనులన్నీ చేయిస్తున్నారని రుద్రాణి అంటుంది.
రాజ్ మారిపోయి కనకం, కృష్ణమూర్తి పెళ్లి రోజును ఎందుకు జరిపిస్తున్నాడో తెలుసుకోవాలనే నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు తెలుసునని రుద్రాణి మనసులో ఉన్న ఆలోచనలను కనిపెడుతుంది ధాన్యలక్ష్మి.
ధాన్యలక్ష్మి గొడవ...
అప్పుడే కళ్యాణ్, అప్పు అక్కడికివస్తారు. వారిని చూడగానే ధాన్యలక్ష్మి గొడవకు దిగుతుంది. తల్లి కొడుకులను వేరుచేయడానికే కొందరు పుడతారు...అలాంటి వారిని నష్టజాతకులు అని అంటారని, వారికి దూరంగా ఉండాలని అప్పుపై తన మనసులో ఉన్న ద్వేషం బయటపెడుతుంది.
నేను దూరంగా ఉన్నా నీలో ఏ మార్పు రాలేదని, అందుకే ఇంటికి రావడం లేదని కళ్యాణ్ అంటాడు. నీది బాధ కాదు...నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లిచేసుకోవాలనే పంతం, కోపం, ఆవేశం అని ధాన్యలక్ష్మిపై ఫైర్ అవుతాడు. అనామిక విషయంలో నువ్వు చెప్పినట్లు నడుచుకుంటే నాకు మిగిలింది కోర్టులు, గొడవలు అని అంటాడు.
ఆరోజు ఆనందంగా ఉంటావు...
అప్పును పెళ్లిచేసుకొని అప్పులు, అద్దె కొంప తప్ప నీకు మిగిలిందని కొడుకుతో అంటుంది ధాన్యలక్ష్మి. అవన్నీ ఉన్నా నేను ఆనందంగానే ఉన్నానని కళ్యాణ్ అంటాడు. నేను ఆనందంగా లేనని ధాన్యలక్ష్మి అంటుంది. కొడుకు మనసును అర్థం చేసుకున్న రోజే నువ్వు ఆనందంగా ఉంటావని ధాన్యలక్ష్మితో అంటాడు కళ్యాణ్.
రాజ్ షాక్...
నీరసంగా ఆఫీస్ నుంచి కనకం ఇంటికొస్తాడు రాజ్. అసలు మేనేజర్ నీకు ఫోన్ చేయలేదని అనుకుంటా అని రాజ్‌తో అంటుంది అపర్ణ. ఆ విషయం నీకు తెలుసు అని రాజ్ షాకవుతాడు. నేను ఫోన్ చేయించానని అసలు సంగతి చెబుతుంది. ఆ రోజు కావ్య కూడా ఇలాగే అన్ని వదిలేసి ఆఫీస్‌కు వెళ్లిందని చెబుతుంది.తల్లి మాటలతో తాను చేసిన తప్పును రాజ్ గ్రహిస్తాడు.
కావ్య గుమ్మానికి పూలదండ కట్టాలని ప్రయత్నిస్తుంది. ఆమె గుమ్మ అందకపోవడంతో రాజ్ వచ్చి ఆమెను ఎత్తుకుంటాడు. ఆ సీన్ చూసి అపర్ణ, కనకం ఆనందపడతారు.