తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఈ వారమే ఓటీటీలో తెలుగులో వచ్చిన రెండు బ్లాక్‍బస్టర్ బాలీవుడ్ చిత్రాలు.. ఎక్కడ చూడొచ్చంటే..

OTT Movies: ఈ వారమే ఓటీటీలో తెలుగులో వచ్చిన రెండు బ్లాక్‍బస్టర్ బాలీవుడ్ చిత్రాలు.. ఎక్కడ చూడొచ్చంటే..

25 September 2024, 8:24 IST

google News
    • OTT Movies: రెండు సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రాలు ఈవారం తెలుగులో అందుబాటులోకి వచ్చేశాయి. ముంజ్య, కిల్ చిత్రాలు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒకే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రెండు సినిమాలు ఉన్నాయి. వివరాలివే..
OTT Movies: ఈ వారమే ఓటీటీలో తెలుగులో అందుబాటులోకి వచ్చిన రెండు బ్లాక్‍బస్టర్ బాలీవుడ్ చిత్రాలు.. ఎక్కడ చూడొచ్చంటే..
OTT Movies: ఈ వారమే ఓటీటీలో తెలుగులో అందుబాటులోకి వచ్చిన రెండు బ్లాక్‍బస్టర్ బాలీవుడ్ చిత్రాలు.. ఎక్కడ చూడొచ్చంటే..

OTT Movies: ఈ వారమే ఓటీటీలో తెలుగులో అందుబాటులోకి వచ్చిన రెండు బ్లాక్‍బస్టర్ బాలీవుడ్ చిత్రాలు.. ఎక్కడ చూడొచ్చంటే..

థియేటర్లలో హిందీలో మాత్రమే రిలీజ్ అయిన కొన్ని బాలీవుడ్ సినిమాలు ఇటీవల ఓటీటీల్లో తెలుగులోనూ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, కొన్ని చిత్రాలు ముందుగా హిందీలోకి వచ్చి.. ఆ తర్వాత ఇతర భాషలు యాడ్ అవుతున్నాయి. తాజాగా ఇలా మరో రెండు బాలీవుడ్ సినిమాలు ఈ వారంలోనే తెలుగులో అందుబాటులోకి వచ్చాయి. థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయిన ముంజ్య, కిల్ సినిమాలు ఈ వారం తెలుగులో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. గతంలోనే ఓటీటీలోకి వచ్చినా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.

ముంజ్య

హిందీ హారర్ కామెడీ సినిమా ముంజ్య థియేటర్లలో అంచనాలకు మించి సూపర్ హిట్ అయింది. శార్వరి వాఘ్, అజయ్ వర్మ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఈ ఏడాది జూన్ 7వ తేదీని ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. రూ.30 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ముంజ్య చిత్రం సుమారు రూ.130కోట్ల కలెక్షన్లు సాధించి దుమ్మురేపింది. ఈ చిత్రానికి ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించారు.

థియేటర్లలో ముంజ్య చిత్రం లాంగ్ రన్ సాధించింది. దీంతో కాస్త ఆలస్యంగా ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ముందుగా ఈ మూవీ హిందీలో ఒక్కటే అందుబాటులోకి వచ్చింది. ఇతర భాషల్లోనూ తీసుకురావాలని హాట్‍స్టార్ ఓటీటీని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అడిగారు. అయితే, ఈ వారమే సెప్టెంబర్ 22వ తేదీన ముంజ్య సినిమాకు తెలుగు, తమిళ వెర్షన్‍లను హాట్‍స్టార్ యాడ్ చేసింది.

ప్రేమ కోసం చిన్నతనంలోనే చేతబడి చేసి చనిపోయి దెయ్యంగా మారిన ముంజ్య చుట్టూ ఈ మూవీ సాగుతోంది. ఆ దెయ్యం నుంచి తనను, తన ప్రేయసిని యువకులు ఎలా కాపాడుకున్నాడనే విషయం చుట్టూ ముంజ్య స్టోరీ సాగుతుంది. ఈ చిత్రాన్ని మాడ్‍డాక్ ఫిల్మ్స్ నిర్మించింది. ఇప్పుడు, హాట్‍స్టార్ ఓటీటీలో ఈ మూవీని హిందీ, తెలుగు, తమిళం భాషల్లో చూడొచ్చు.

కిల్

బాలీవుడ్ మూవీ ‘కిల్’ చాలా పాపులర్ అయింది. వైలెంట్ యాక్షన్ చిత్రంగా వచ్చిన ఈ మూవీ హిట్ అవటంతో పాటు ప్రశంసలు దక్కించుకుంది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో మెప్పించింది. నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వంలో లక్ష్య, రాఘవ్ జుయల్, తాన్య ప్రధాన పాత్రలు పోషించిన కిల్ చిత్రం హిందీలో ఈ ఏడాది జూలై 5న థియేటర్లలో రిలీజ్ అయింది. అప్పటికే హాలీవుడ్ పాపులర్ ఫ్రాంచైజీ జాన్‍విక్ మేకర్స్ ఈ మూవీ రీమేక్ హక్కులు తీసుకోవటంతో మంచి క్రేజ్ ఏర్పడింది. అంచనాలకు తగ్గట్టే కిల్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

వైలెంట్ యాక్షన్‍తో కూడిన కిల్ మూవీ మంచి హిట్ అయింది. ఈ సినిమా సెప్టెంబర్ 6వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, ముందుగా ఈ మూవీ కూడా హిందీ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే, తాజాగా సెప్టెంబర్ 24న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం భాషల డబ్బింగ్‍లోనూ హాట్‍స్టార్ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం కిల్ మూవీ నాలుగు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

తదుపరి వ్యాసం