తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror: తెలుగులోకి వ‌చ్చిన బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

OTT Horror: తెలుగులోకి వ‌చ్చిన బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

22 September 2024, 12:49 IST

google News
  • OTT Horror: బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ ముంజ్య తెలుగులో రిలీజైంది. తెలుగు వెర్ష‌న్ ఆదివారం నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ముంజ్య మూవీలో శార్వ‌రీ, అభ‌య్ వ‌ర్మ హీరోహీరోయిన్లుగా న‌టించారు. కోలీవుడ్ యాక్ట‌ర్ స‌త్య‌రాజ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు.

హారర్ ఓటీటీ
హారర్ ఓటీటీ

హారర్ ఓటీటీ

OTT Horror: ఈ ఏడాది బాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టింగ్ మూవీస్‌లో ఒక‌టిగా ముంజ్య‌నిలిచింది. 30 కోట్ల బ‌డ్జెట్‌తో ఎలాంటి అంచ‌నాలు లేకుండా థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ హార‌ర్ కామెడీ మూవీ ఏకంగా 130 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇటీవ‌లే డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ హార‌ర్ కామెడీ మూవీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది.

హిందీ వెర్ష‌న్ ఓటీటీలోకి వ‌చ్చి రెండు వారాలు గ‌డిచిన ఇప్ప‌టికీ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ముంజ్య తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజైంది. ఆదివారం నుంచి తెలుగు, త‌మిళ వెర్ష‌న్స్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్నాయి.

రెండు టైమ్ పీరియ‌డ్స్‌లో...

ముంజ్య మూవీలో శార్వ‌రీ, అభ‌య్ వ‌ర్మ హీరోహీరోయిన్లుగా న‌టించారు. కోలీవుడ్ యాక్ట‌ర్ స‌త్య‌రాజ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. ఈ హార‌ర్ కామెడీ మూవీకి ఆదిత్య స‌ర్పోట్ద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 1952, 2023 రెండు బ్యాక్‌డ్రాప్‌ల‌లో ద‌ర్శ‌కుడు ముంజ్య మూవీని తెర‌కెక్కించాడు.

పురాణాల నుంచి స్ఫూర్తి పొందుతూ క‌ల్పిత అంశాల‌తో తెర‌కెక్కిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో ఆడియెన్స్‌ను తెగ భ‌య‌పెట్టింది. కామెడీ కూడా బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. రొటీన్ హార‌ర్ కాన్సెప్ట్‌ను డిఫ‌రెంట్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేసి ఆడియెన్స్‌ను డైరెక్ట‌ర్ మెప్పించాడు.

ముంజ్య క‌థ ఇదే...

70 ఏళ్ల క్రితం కొంకణ్ అనే గ్రామంలో తనకంటే వయసులో పెద్దదైన మున్నిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు గోట్యా. కానీ అత‌డి ప్రేమ‌కు పెద్ద‌లు అడ్డుచెబుతారు. గోట్యాకు ఉపనయనం జ‌రుగుతుంది. తన చెల్లిని నరబలి ఇచ్చి మున్నిని ద‌క్కించుకునేందుకు గోట్యా వేసిన ప్లాన్ ఫెయిలై అత‌డు మ‌ర‌ణిస్తాడు.

ఉపనయనం చేసిన ప‌దిరోజులు కూడా కాకుండా మ‌ర‌ణించిన‌ గోట్యా బ్ర‌హ్మ‌రాక్ష‌సుడిగా మారిపోతాడు. మ‌రోవైపు తల్లి పమ్మీ (మోనా సింగ్)తో కలిసి పార్లర్ రన్ చేస్తాడు బిట్టు (అభయ్ వర్మ). బేలా (శార్వరి వాఘ్)‌ను బిట్టు ప్రేమిస్తాడు. కానీ బేలా మాత్రం మ‌రొక‌రిని లవ్ చేస్తుంది.

తన కజిన్ సిస్టర్ రుక్కు (భాగ్యశ్రీ లిమాయే) పెళ్లి కోసం అని తల్లి పమ్మీ, నానమ్మ గీత (సుహాస్ జోషి)తో కలిసి కొంకణ్ వెళ్తాడు బిట్టు. కొంకణ్‌లో బిట్టుకు ఎలాంటి విచిత్ర‌మైన సంఘ‌ట‌న‌లు ఎదుర‌య్యాయి? బిట్టు వెంట ముంజ్యా అనే పిల్ల దెయ్యం ఎందుకు పడింది?

ముంజ్య బారి నుంచి తనను బేలాను బిట్టు ఎలా కాపాడుకున్నాడు? బిట్టుకు ఎల్వీస్ కరీమ్ ప్రభాకర్ (సత్యరాజ్) ఎలా సాయం చేశాడు అన్న‌దే ముంజ్య మూవీ క‌థ‌. ఈ సినిమాలోని గ్రాఫిక్స్‌, విజువ‌ల్స్‌తోపాటు బీజీఎమ్ అభిమానుల‌ను అల‌రించాయి.

ఐదో సినిమా...

బాలీవుడ్‌లో క‌లెక్ష‌న్స్ ప‌రంగా ముంజ్య‌ ప‌లు రికార్డులు క్రియేట్ చేసింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఐదో మూవీగా నిలిచింది. ముంజ్య‌కు సీక్వెల్ తెర‌కెక్కుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ముంజ్య త‌ర్వాత హార‌ర్ కామెడీ క‌థాంశంతోనే క‌కుడా అనే సినిమా చేశాడు. డైరెక్ట‌ర్ ఆదిత్య స‌ర్ఫోట్ద‌ర్‌. రితేష్ దేశ్‌ముఖ్, సోనాక్షి సిన్హా హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ ముంజ్య త‌ర‌హాలో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. క‌కుడా డైరెక్ట్‌గా జియో సినిమా ఓటీటీలో రిలీజైంది.

తదుపరి వ్యాసం