Horror OTT: 15 కోట్ల బ‌డ్జెట్ - 150 కోట్ల క‌లెక్ష‌న్స్ - ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ-hollywood blockbuster horror movie evil dead rise streaming now on netflix ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Ott: 15 కోట్ల బ‌డ్జెట్ - 150 కోట్ల క‌లెక్ష‌న్స్ - ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ

Horror OTT: 15 కోట్ల బ‌డ్జెట్ - 150 కోట్ల క‌లెక్ష‌న్స్ - ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Sep 21, 2024 10:40 AM IST

Horror OTT: హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ ఈవిడ్ డెడ్ రైస్ థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. శ‌నివారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప‌దిహేను కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో 147 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

హారర్ మూవీ
హారర్ మూవీ

Horror OTT: హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ ఈవిల్ డెడ్ రైజ్ థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాదిన్న‌ర త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. స‌డెన్‌గా శ‌నివారం నెట్‌ఫ్లిక్స్ రిలీజై ఓటీటీ ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది.

147 కోట్ల క‌లెక్ష‌న్స్‌

గ‌త ఏడాది ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈవిల్ డెడ్ రైజ్‌ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ప‌దిహేను కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 147 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఓటీటీ అనుకొని థియేట‌ర్ల‌లో...

క‌రోనా కార‌ణంగా తొలుత ఈవిల్ డెడ్ రైజ్‌ మూవీని తొలుత ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావించారు. వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ సంస్థ ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్‌ను కొని మొద‌ట కొన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసింది. పాజిటివ్ టాక్ రావ‌డంతో థియేట‌ర్ల సంఖ్య‌ను పెంచింది.

హార‌ర్ ఎలిమెంట్స్‌, ట్విస్ట్‌ల‌తో ఆడియెన్స్‌ను ఈమూవీ భ‌య‌పెట్టింది. సాట‌ర్న్‌ అవార్డుల్లో బెస్ట్ హార‌ర్ మూవీగా ఈవిల్ డెడ్ రైజ్ నిలిచింది. హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్‌తో పాటు ప‌లు అవార్డుల‌ను అందుకున్న‌ది.

ఈవిల్ డెడ్ రైజ్‌ క‌థ ఇదే..

ఎల్లీ(అలీసా సదర్లాండ్) త‌న ముగ్గురు పిల్ల‌ల‌ను ఎన్నో క‌ష్టాలు ప‌డి పెంచుతోంటోంది. . ఓరోజు ఎల్లీ చెల్లెలు బెత్ కొడుకు ఇంటి బేస్‌మెంటులో ఉన్న బాక్స్‌ను ఓపెన్ చేసి అందులో ఉన్న గ్రామఫోన్ రికార్డును ప్లే చేస్తాడు. ఆ గ్రామ్‌ఫోన్ కార‌ణంగా వారి జీవితాలు ఊహించ‌ని మ‌లుపుతు తిరుగుతాయి.

తన‌ బిడ్డలను చంపడానికి ఎల్లీ ప్ర‌య‌త్నిస్తుంది. ఆ గ్రామఫోన్‌ రికార్డుల్లో ఏముంది? ఎల్లీ అలా మారిపోవ‌డానికి కార‌ణం ఏమిటి? త‌ల్లి బారి ముగ్గురు పిల్ల‌లు త‌మ ప్రాణాల‌ను కాపాడుకున్నారా? చివ‌ర‌కు ఏమైంది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ఐదో మూవీ...

అమెరికాలో గ‌త ఏడాది ఈవిల్ డెడ్ రైజ్‌ఓటీటీలో రిలీజైంది. ఇండియాలో మాత్రం ఏడాదిన్న‌ర త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్‌లో వ‌చ్చిన ఐదో మూవీ ఇది. ఈవిల్ డెడ్ సిరీస్‌లో మొద‌టి మూడు భాగాల‌కు సామ్ రైమీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఈవిల్ డెడ్ రైజ్‌తో పాటు ఈవిల్ డెడ్ నాలుగో పార్ట్‌కు ఫెడే అల్వ‌రేజ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్‌లో మ‌రో రెండు సినిమాలు కూడా రానున్నాయి. ఈ ఫ్రాంచైజ్‌లో వ‌చ్చిన అన్ని హార‌ర్ మూవీస్ క‌మ‌ర్షియ‌ల్ హిట్స్‌గా నిల‌వ‌డం గ‌మ‌నార్హం.

టాపిక్