OTT Horror Comedy:ఓటీటీలోకి వస్తున్న రూ.400 కోట్ల వసూళ్ల సూపర్ హిట్ హారర్ కామెడీ సినిమా.. ఎక్కడంటే..
23 December 2024, 10:58 IST
- OTT Horror Comedy: భూల్ భులయ్యా 3 సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ హారర్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. ఈ సినిమా ఏ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవనుందంటే..
OTT Horror Comedy:ఓటీటీలోకి వస్తున్న రూ.400 కోట్ల వసూళ్ల సూపర్ హిట్ హారర్ కామెడీ సినిమా.. ఎక్కడంటే..
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్ చేసిన భూల్ భులయ్యా 3 మంచి హిట్ కొట్టింది. పాపులర్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో ఉన్న వచ్చిన మూడో చిత్రం కూడా బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రంలో విద్యాబాలన్, మాధురి దీక్షిత్, తృప్తి డిమ్రి కూడా ప్రధాన పాత్రల్లో కనిపించారు. భూల్ భులయ్యా 3 చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజైంది. అంచనాలకు తగ్గట్టుగా అదిరే కలెక్షన్లను దక్కించుకుంది. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు ఈ చిత్రం రెడీ అయినట్టు తెలుస్తోంది.
స్ట్రీమింగ్ వివరాలివే..
భూల్ భులయ్యా 3 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నాలుగో వారంలో నెట్‍ఫ్లిక్స్ స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. జనవరి తొలివారంలో ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందని ముందుగా రూమర్లు వచ్చాయి. అయితే, క్రిస్మస్ వారంలోనే ఆ ప్లాట్‍ఫామ్ తాజాగా నిర్ణయించిట్టు సమాచారం చక్కర్లు కొడుతోంది. మరి ఈ వారంలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందేమో చూడాలి.
భూల్ భులయ్యా 3 సినిమా థ్రిల్స్, కామెడీ, ట్విస్టులతో సాగింది. ఈ ఫ్రాంచైజీలోని గత రెండు చిత్రాల్లానే ఈ మూడో భాగం కూడా ప్రేక్షకులను మెప్పించింది. రుహాన్ అలియాజ్ రూబ్ బాబాగా కార్తీక్ ఆర్యన్ అదరగొట్టారు. సీనియర్ యాక్టర్లు విద్యాబాలన్, మాధురీ దీక్షిత్‍తో పాటు తృప్తి డిమ్రి కూడా నటనతో మెప్పించారు. విజయ్ రాజ్, రాజ్‍పాల్ యాదవ్, సంజయ్ మిశ్రా, రాజేశ్ శర్మ కీలకపాత్రలు పోషించారు.
భూల్ భులయ్యా 3 మూవీకి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు. కోల్‍కతా బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ స్టోరీ సాగుతుంది. హారర్ ఎలిమెంట్లతో పాటు కామెడీ కూడా ఈ మూవీలో ఆకట్టుకునేలా తెరకెక్కించారు అనీస్. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద బాగా పర్ఫార్మ్ చేసింది.
భూల్ భులయ్యా 3 కలెక్షన్లు
భూల్ భులయ్యా 3 సినిమా సుమారు రూ.150కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.417 గ్రాస్ కలెక్షన్లను సాధించింది. స్త్రీ 2 తర్వాత ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ మూవీగా నిలిచింది. రివ్యూలు మిశ్రమంగా వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం దుమ్మురేపింది.
భూల్ భులయ్యా 3 చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, సినీ 1 బ్యానర్లపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, మురాద్ ఖేతానీ నిర్మించారు. ఈ మూవీకి సుమారు ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. అనూ ఆనంద్ సినిమాటోగ్రఫీ చేశారు.