తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bollywood: బాలీవుడ్‌, రాహుల్‌గాంధీ పరిస్థితి ఒకేలా ఉంది: స్వర భాస్కర్‌

Bollywood: బాలీవుడ్‌, రాహుల్‌గాంధీ పరిస్థితి ఒకేలా ఉంది: స్వర భాస్కర్‌

HT Telugu Desk HT Telugu

23 August 2022, 7:10 IST

  • Bollywood: బాలీవుడ్‌, రాహుల్ గాంధీ పరిస్థితి ఒకేలా ఉందని అంటోంది నటి స్వర భాస్కర్‌. ప్రస్తుతం దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ ఇండస్ట్రీని ఆమె కాంగ్రెస్‌ నేత రాహుల్‌తో పోల్చడం విశేషం.

బాలీవుడ్ నటి స్వర భాస్కర్, రాహుల్ గాంధీ
బాలీవుడ్ నటి స్వర భాస్కర్, రాహుల్ గాంధీ

బాలీవుడ్ నటి స్వర భాస్కర్, రాహుల్ గాంధీ

Bollywood: ఇది చదవగానే బాలీవుడ్‌ ఏంటి? రాహుల్‌గాంధీ ఏంటి అన్న అనుమానం మీకు రావచ్చు. కానీ ప్రస్తుతం ఇండియాలోనే అతిపెద్ద సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను అక్కడి నటి స్వర భాస్కర్‌.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌తో పోల్చింది మరి. ఇండియా టుడేతో మాట్లాడిన ఆమె.. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌ పరిస్థితి ఇలా అయిపోయిందని అభిప్రాయపడింది.

ట్రెండింగ్ వార్తలు

Parthu Telugu OTT: ఓటీటీలోకి బిగ్‌బాస్ బ్యూటీ సైకో కిల్ల‌ర్ మూవీ - ట్విస్ట్‌ల‌కు మైండ్ బ్లాక్ కావాల్సిందే!

Fahadh Faasil: పుష్ప వల్ల నాకు ఒరిగిందేమీ లేదు.. మలయాళం సినిమానే నాకు అన్నీ: ఫహాద్ ఫాజిల్

Satya Movie: స‌త్య ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన ఎనిమిది మంది టాలీవుడ్‌డైరెక్ట‌ర్లు - మూవీ విడుద‌ల‌ ఎప్పుడంటే?

Arya@20 Years: ఆర్య మూవీకి 20 ఏళ్లు.. జీవితాన్ని మార్చేసిన సినిమా అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్

దీని వెనుక ఉన్న కారణాలను ఆమె చెప్పుకొచ్చింది. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం కూడా ఈ దుస్థితికి ప్రధాన కారణమని ఆమె చెప్పడం విశేషం. థియేటర్లలో షోలు రద్దవడానికి బాలీవుడ్‌ కారణం కాదని స్వర భాస్కర్‌ అంటోంది. ఇందులో ఓటీటీల పాత్ర కూడా ఉన్నదని చెప్పింది. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌పై ద్వేషం పెరిగిపోయిందని, అది ఇంకా కొనసాగుతోందని స్వర అభిప్రాయపడింది.

బాలీవుడ్‌కు, రాహుల్‌గాంధీకి లింకు

ఇక బాలీవుడ్‌ ప్రస్తుత పరిస్థితిని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతోనూ ఆమె పోల్చింది. "ఇది చాలా వింత పోలికగా మీకు అనిపించవచ్చు. కానీ నాకు రాహుల్‌ గాంధీ గుర్తొస్తున్నారు. ఆయనను అందరూ పప్పూ అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడందరూ అదే నమ్ముతున్నారు. నేను ఆయనను కలిశాను. ఆయన చాలా ఇంటెలిజెంట్‌. తన భావాలను సమర్థవంతంగా వ్యక్తం చేస్తారు. బాలీవుడ్‌తోనూ ఈ పప్పుఫికేషన్‌ జరిగింది" అని స్వర అనడం విశేషం.

బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమిర్ ఖాన్‌ లాల్‌ సింగ్‌ చడ్డా, అక్షయ్‌ కుమార్‌ రక్షా బంధన్‌, తాప్సీ పన్ను దొబారాలాంటి మూవీస్‌ దారుణంగా ఫ్లాపయ్యాయి. అయితే బాయ్‌కాట్‌ ట్రెండ్‌ కూడా బాలీవుడ్‌ కొంప ముంచుతోందని స్వర భాస్కర్‌ అభిప్రాయపడింది. ఇప్పుడు రానున్న లైగర్‌, పఠాన్‌ సినిమాలు కూడా ఈ బాయ్‌కాట్‌ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.