తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీపై రూమర్లు.. స్పందించిన టీమ్!

Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీపై రూమర్లు.. స్పందించిన టీమ్!

11 May 2024, 23:35 IST

google News
    • Katrina Kaif: స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గర్భంతో ఉన్నారని ఇటీవల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. లండన్ వెళ్లడంతో ఇవి మరింత ఎక్కువయ్యాయి. దీంతో కత్రినా టీమ్ స్పందించిందనే రిపోర్టులు వచ్చాయి. 
Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా? రూమర్లపై స్పందించిన టీమ్!
Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా? రూమర్లపై స్పందించిన టీమ్!

Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా? రూమర్లపై స్పందించిన టీమ్!

Katrina Kaif: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. గర్భం దాల్చారంటూ మళ్లీ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మేరీ క్రిస్మస్ సినిమా తర్వాత కత్రినా మరే మూవీకి ఓకే చెప్పలేదు. గ్యాప్ తీసుకుంటున్నారు. అందులోనూ ఇటీవల లండన్‍కు వెళ్లారు. దీంతో కత్రినా కైఫ్ పెగ్నెన్సీతో ఉన్నారనే రూమర్లు వస్తున్నాయి. లండన్‍లో ఉన్న కత్రినా ఓవర్ సైజ్డ్ కోట్ వేసుకొని గర్భాన్ని కవర్ చేసుకున్నారని కూడా ఇటీవల ఓ ఓ ఫొటో వైరల్ అయింది. ఇక, ప్రెగ్నెన్సీ రూమర్లు తీవ్రమవుతుండటంతో కత్రినా కైఫ్ టీమ్ తాజాగా స్పందించినట్టు సమాచారం బయటికి వచ్చింది.

టీమ్ ఏం చెప్పిందంటే?

కత్రినా కైఫ్ ప్రెగ్నెసీ రూమర్లను ఆమె టీమ్ కొట్టిపారేసిందని తెలుస్తోంది. కత్రినా గర్భంతో లేరని తేల్చిసిందని రిపోర్టులు బయటికి వచ్చాయి. లండన్‍కు ఆమె వ్యక్తిగత కారణాలతోనే వెళ్లారని, ప్రెగ్నెసీ వల్ల కాదని క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే లండన్‍లో కత్రినా వద్దకు భర్త విక్కీ కౌశల్ వెళతారని తెలుస్తోంది. కత్రినా ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో లేరని బాలీవుడ్ లైఫ్ రిపోర్ట్ కూడా పేర్కొంది.

గతంలోనూ రూమర్లు.. ఇప్పుడెందుకంటే..

కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్‍కు 2021 డిసెంబర్‌లో వివాహమైంది. అయితే, కత్రినా ప్రెగ్నెంట్ అంటూ అప్పటి నుంచి చాలాసార్లు రూమర్లు వచ్చాయి. అయితే, ప్రతీసారి ఈ విషయాన్ని ఆమె టీమ్ ఖండిస్తూ వచ్చింది. అయితే, తాజాగా కత్రినా లండన్ వెళ్లారు. రెండురోజుల కిందట అక్కడ ఓ కాఫీ షాప్‍లో ఓ అభిమానికి ఆమె సెల్ఫీ ఇచ్చారు. ఈ ఫొటోలో కత్రినా లాంగ్ సైజ్డ్ కోట్ ధరించారు. అలాగే, చేతిలో కాఫీ కప్ పట్టుకున్నారు. ఈ ఫొటో వైరల్ అయింది.

గర్భాన్ని దాచేందుకు కత్రినా ఓవర్ సైజ్డ్ ఔట్‍ఫిట్ వేసుకున్నారని కొందరు కామెంట్లు చేశారు. ఆమె ప్రెగ్నెన్సీతో ఉన్నారని రూమర్లు మళ్లీ చక్కర్లు కొట్టాయి. ఈ విషయం గురించి చెప్పాలని సోషల్ మీడియా వేదికగా కత్రినా, విక్కీ కౌషల్‍ను చాలా మంది ప్రశ్నించారు. అయితే, కత్రినా ప్రెగ్నెంట్ కాదని ఆమె టీమ్ వెల్లడించిందని తెలుస్తోంది.

చావా సినిమా షూటింగ్‍ను విక్కీ కౌశల్ తాజాగా పూర్తి చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ ఎపిక్ పీరియడ్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‍ పూర్తవటంతో విక్కీ కౌశల్.. ఇక లండన్‍కు వెళ్లనున్నాడని తెలుస్తోంది. చావా మూవీకి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

కత్రినా కైఫ్ చివరగా మేరీ క్రిస్మస్ చిత్రంలో కనిపించారు. ఈ మూవీలో హీరో విజయ్ సేతుపతితో కలిసి నటించారు. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. అయితే, విజయ్ సేతుపతి, కత్రినా పర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీకి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. మేరీ క్రిస్మస్ తర్వాత కత్రీనా ఏ మూవీకి ఓకే చెప్పలేదని తెలుస్తోంది. కొత్త ప్రాజెక్ట్ ఏదీ అనౌన్స్ కాలేదు. మరి కత్రినా కొంతకాలం రెస్ట్ తీసుకుంటారా అనేది చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం