Katrina Deepfake photo: అప్పుడు రష్మిక.. ఇప్పుడు కత్రినా కైఫ్.. టవల్ ఫైట్ ఫొటోను ఎంత దారుణంగా చేశారో చూడండి-katrina kaif deepfake photo going viral after rashmika mandannas ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Katrina Deepfake Photo: అప్పుడు రష్మిక.. ఇప్పుడు కత్రినా కైఫ్.. టవల్ ఫైట్ ఫొటోను ఎంత దారుణంగా చేశారో చూడండి

Katrina Deepfake photo: అప్పుడు రష్మిక.. ఇప్పుడు కత్రినా కైఫ్.. టవల్ ఫైట్ ఫొటోను ఎంత దారుణంగా చేశారో చూడండి

Hari Prasad S HT Telugu
Nov 07, 2023 04:29 PM IST

Katrina Deepfake photo: అప్పుడు రష్మిక.. ఇప్పుడు కత్రినా కైఫ్.. డీప్‌ఫేక్ (Deepfake) ఫొటోలు, వీడియోల బారిన పడుతున్నారు టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు. తాజాగా కత్రినా నటించిన టవల్ ఫైట్ ఫొటోను చాలా దారుణంగా మార్చేశారు.

డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా కత్రినా కైఫ్ టవల్ ఫైట్ ఫొటో ఇలా మార్ఫింగ్ చేశారు
డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా కత్రినా కైఫ్ టవల్ ఫైట్ ఫొటో ఇలా మార్ఫింగ్ చేశారు

Katrina Deepfake photo: పైన ఉన్న ఫొటోలో కత్రినా కైఫ్ టవల్ ఫైట్ ఒరిజినల్, నకిలీ ఫొటోలు చూశారు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీల సాయంతో ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తూ టాప్ హీరోయిన్ల పరువు తీస్తున్నారు. ఈ మధ్యే రష్మిక మందన్నాకు సంబంధించిన వీడియోను కూడా ఇలాగే మార్ఫింగ్ చేసిన విషయం తెలిసిందే.

ఎవరో జారా పటేల్ అనే అమ్మాయి ముఖానికి రష్మిక ముఖం యాడ్ చేసి డీప్‌ఫేక్ (Deepfake) టెక్నాలజీ ద్వారా ఓ వల్గర్ వీడియోను ఇంటర్నెట్ లోకి వదిలారు. అది కాస్తా వైరల్ అయింది. దీనిపై రష్మికతోపాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన మరవక ముందే టైగర్ 3 మూవీలో కత్రినా కైఫ్ టవల్ ఫైట్ ఫొటోను కూడా మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చేశారు.

ఈ టవల్ ఫైట్ అసలు, నకిలీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కత్రినా ఓ టవల్ వేసుకొని ఫైట్ చేస్తున్న వీడియోలు, ఫొటోలు అభిమానులను తెగ ఆకర్షించిన విషయం తెలిసిందే. దీంతో ఇదే ఫొటోను డీప్‌ఫేక్ కోసం వాడుకుంటున్నారు. అసలు ఫొటోలో కత్రినా టవల్లో పూర్తిగా కవర్ అయినట్లుగా కనిపిస్తోంది.

అయితే ఈ నకిలీ, మార్ఫింగ్ ఫొటోలో మాత్రం ఆమె కత్రినా ఓ బికినీలో, ఆమె వక్షోజాలు చాలా పెద్దవిగా ఉన్నట్లు క్రియేట్ చేశారు. ఇలాంటిదే మరో ఫొటో కూడా క్రియేట్ చేశారు. కాసేపటికే ఈ ఫొటోను డిలీట్ చేసేశారు. ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీ అనేది కొత్తదేమీ కాదు. కొన్నేళ్ల కిందట కూడా తెరపైకి వచ్చింది. దీని ద్వారా పోర్నోగ్రఫిక్ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లోకి వదిలారు.

ఇప్పుడు మరోసారి వరుసగా ఇలాంటి మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు తెరపైకి వస్తుండటంతో సినీ ఇండస్ట్రీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు కొత్త చట్టాలను కూడా తీసుకురావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

IPL_Entry_Point