Katrina Kaif on Tiger 3: ఆ టవల్ ఫైట్ సీన్ ఇంత వరకూ ఎవరూ చేయలేదు.. స్టంట్స్ కోసం చాలా కష్టపడ్డా: కత్రినా కైఫ్-katrina kaif on tiger 3 stunts shares a video of her training ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Katrina Kaif On Tiger 3: ఆ టవల్ ఫైట్ సీన్ ఇంత వరకూ ఎవరూ చేయలేదు.. స్టంట్స్ కోసం చాలా కష్టపడ్డా: కత్రినా కైఫ్

Katrina Kaif on Tiger 3: ఆ టవల్ ఫైట్ సీన్ ఇంత వరకూ ఎవరూ చేయలేదు.. స్టంట్స్ కోసం చాలా కష్టపడ్డా: కత్రినా కైఫ్

Hari Prasad S HT Telugu
Nov 07, 2023 02:54 PM IST

Katrina Kaif on Tiger 3: ఆ టవల్ ఫైట్ సీన్ ఇంత వరకూ ఇండియాలో ఎవరూ చేయలేదని, టైగర్ 3 మూవీలో స్టంట్స్ కోసం చాలా కష్టపడ్డానని కత్రినా కైఫ్ చెప్పింది. తన ట్రైనింగ్ కు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేసింది.

టైగర్ 3 మూవీ కోసం కత్రినా కైఫ్ ట్రైనింగ్
టైగర్ 3 మూవీ కోసం కత్రినా కైఫ్ ట్రైనింగ్ (Instagram)

Katrina Kaif on Tiger 3: బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3లో ఆమె చేసిన టవల్ ఫైట్ సీన్ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఈ ఫైట్ సీన్ తోపాటు ఎన్నో స్టంట్స్ కూడా ఆమె ఈ సినిమా కోసం చేసింది. దీపావళి సందర్భంగా నవంబర్ 12న టైగర్ 3 రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో కత్రినా తన స్టంట్స్, ట్రైనింగ్ గురించి చెబుతూ.. ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది.

టైగర్ 3 కోసం తాను ఎంత కష్టపడ్డానో చూడండంటూ తన ట్రైనింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో కత్రినా కైఫ్ పోస్ట్ చేసింది. హద్దులు చెరిపేసి మరీ ఈ సినిమా కోసం స్టంట్ సీన్స్ చేసినట్లు తెలిపింది. తన టవల్ ఫైట్ సీన్ గురించి కూడా ఆమె స్పందించింది. ఇద్దరు ఆడవాళ్లు ఇలాంటి ఫైట్ సీక్వెన్స్ చేసిన సందర్భాలు ఇండియన్ సినిమాలో లేవని ఆమె చెప్పింది.

టైగర్ 3.. నా సహనానికి పరీక్ష: కత్రినా కైఫ్

టైగర్ 3 స్టంట్స్ గురించి తన పోస్టులో కత్రినా వివరించింది. "నా వరకూ టైగర్ టైమ్ వచ్చినప్పుడు నా పరిమితులను దాటి పని చేయాలని, నా సహనాన్ని పరీక్షించుకోవాలని అనిపిస్తుంది. నొప్పి కూడా మరో సెన్సేషనే. దానిని చూసి ఎప్పుడూ భయపడకు, ఎక్కడికీ పారిపోకు అని ఎవరో నాతో అన్నారు. చాలా రోజులు చాలా అలసిపోయాను. ఈసారి కాస్త ఎక్కువ అలసటే కలిగింది" అని కత్రినా చెప్పింది.

ఎంతో అలసిపోయినా కూడా ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని, ఒకసారి కమిట్ అయిన తర్వాత వెనక్కి తగ్గేది లేదని అనుకొని ముందుకు సాగాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపింది. ఆమె షేర్ చేసిన వీడియోలో మొదట స్క్వాట్స్ చేస్తుండటాన్ని, తర్వాత తన టీమ్ తో కలిసి ట్రైనింగ్ చేస్తుండటం చూడొచ్చు. టైగర్ 3 మూవీలో సల్మాన్ ఖాన్ తో కలిసి కత్రినా నటించింది.

ఈ టైగర్ 3 మూవీలో హిందీతోపాటు తెలుగు, తమిళంలలో నవంబర్ 12న దీపావళి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను మనీష్ శర్మ డైరెక్ట్ చేశాడు. ఇమ్రాన్ హష్మి విలన్ గా కనిపించనున్నాడు.