తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bobby Kolli: రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయనున్న చిరంజీవి డైరెక్టర్

Bobby Kolli: రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయనున్న చిరంజీవి డైరెక్టర్

Hari Prasad S HT Telugu

12 April 2023, 14:45 IST

    • Bobby Kolli: రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయనున్నాడు చిరంజీవి డైరెక్టర్. ఈ మధ్యే వాల్తేర్ వీరయ్యలాంటి సూపర్ హిట్ మూవీని అందించిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు సూపర్ స్టార్ మూవీతో తమిళంలో అడుగుపెట్టబోతున్నాడు.
చిరంజీవితో బాబీ
చిరంజీవితో బాబీ

చిరంజీవితో బాబీ

Bobby Kolli: మరో సూపర్ కాంబో రెడీ అవుతోంది. టాలీవుడ్ లో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందించిన బాబీ కొల్లి ఇప్పుడు.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఈ మధ్యే అతడు రజనీని కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చించాడని, అంతేకాదు అడ్వాన్స్ గా భారీ మొత్తం కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

ఇక ఇప్పుడు ఈ మూవీకి డైరెక్టర్ కూడా ఖరారయ్యాడు. చిరంజీవితో వాల్తేర్ వీరయ్యలాంటి సూపర్ డూపర్ హిట్ అందించిన బాబీ కొల్లి.. రజనీకాంత్ మూవీతో కోలీవుడ్ లోనూ అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే అతడు ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ తయారు చేసినట్లు సమాచారం. ఆ స్క్రిప్ట్ ను త్వరలోనే రజనీకాంత్ ముందు బాబీ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే బయటకు రానుంది. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో రూపొందించనున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ మూవీ షూటింగ్ లో ఉన్నాడు. ఆ మూవీ ముగిసిన వెంటనే బాబీ కొల్లి మూవీని రజనీ చేయనున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

గాడ్ ఫాదర్ తర్వాత చిరంజీవితో వాల్తేర్ వీరయ్య సినిమా చేసిన బాబీ.. అతనికి మరో మెగా హిట్ అందించాడు. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఆ సినిమా.. వారసుడు, వీర సింహా రెడ్డిలాంటి మూవీస్ నుంచి పోటీని తట్టుకొని నిలబడటమే కాదు.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లతో దుమ్ము రేపింది.

ఈ సినిమాలో అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటారో అలాగే చూపించిన బాబీ సక్సెస్ అయ్యాడు. హీరో ఎలివేషన్ ను బాగా చూపించే బాబీ.. రజనీకాంత్ తో మూవీ చేస్తుండటంతో అది మరే స్థాయిలో ఉంటుందో అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం