Dil Raju on Personal Life: తాత, తండ్రి రెండు రోల్స్ మేనేజ్ చేస్తున్నా.. వ్యక్తిగత జీవితంపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు-dil raju says manages both roles as father and grand father ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dil Raju On Personal Life: తాత, తండ్రి రెండు రోల్స్ మేనేజ్ చేస్తున్నా.. వ్యక్తిగత జీవితంపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

Dil Raju on Personal Life: తాత, తండ్రి రెండు రోల్స్ మేనేజ్ చేస్తున్నా.. వ్యక్తిగత జీవితంపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Apr 09, 2023 01:44 PM IST

Dil Raju on Personal Life: ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలుగు చిత్రసీమలో రెండు దశబ్దాల ప్రస్థానం పూర్తి చేసుకున్న ఆయన.. తండ్రిగా, తాతగా రెండు రోల్స్ సింపుల్‌గా మేనేజ్ చేస్తున్నా అని స్పష్టం చేశారు.

దిల్ రాజు
దిల్ రాజు

Dil Raju on Personal Life: టాలీవుడ్‌లో పాపులర్ నిర్మాతల్లో దిల్ రాజు ముందు వరుసలో ఉంటారు. తెలుగులోనే కాకుండా ఇటీవల కాలంలో పాన్ ఇండియాపై కూడా ఆయన దృష్టిపెట్టారు. ఇప్పటికే విజయ్‌తో వారసుడు చిత్రం తీసి కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆయన.. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ కూడా తీస్తున్నారు. ఇది పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఆయన.. ఎంతో మంది టాలెంటెడ్ నటులను, దర్శకులు, సాంకేతిక సిబ్బందిని చిత్రసీమకు పరిచయం చేశారు.

తెలుగు చిత్రసీమలో రెండు దశాబ్దాల ప్రస్థానం కారణంగా తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన మొదటి భార్య చనిపోయిన తర్వార రెండో పెళ్లి చేసుకోవడం, కుమారుడు పుట్టడం లాంటి విషయాలపై మాట్లాడారు. "నా భార్య చనిపోయిన తర్వాత కుమార్తే బలవంతంపై రెండో పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నాకు 9 నెలల బాబు ఉన్నాడు. ఇదే సమయంలో నాకు ఆరేళ్ల మనుమడు కూడా ఉన్నాడు. నేను ఇద్దరితోనూ సమయాన్ని గడుపుతాను. వారితో ఆడుకోవడాన్ని ఆస్వాదిస్తాను. నేను నా మనుమడిని కలిసినప్పుడు తాతగా వాడితో ఉంటాను. కుమారుడితో ఉన్నప్పుడు తండ్రిగా ప్రవర్తిస్తాను. "అని దిల్ రాజు చెప్పారు.

ఈ రెండు రోల్స్‌ను ఏక కాలంలో ఎలా మేనేజ్ చేస్తున్నారని ప్రశ్నించగా.. దీనికి దిల్ రాజు ఆసక్తికర సమాధానం తెలిపాడు. "ఇదే ప్రశ్నను నా భార్య నన్ను అడుగుతుంటుంది. తండ్రిగా, తాతగా ఎలా ఉండగలుగుతున్నావ్ అని అడిగేది. కానీ అది నాకు చాలా సులభమైన పని చెప్పాను. నా సినిమా జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఎలాగైతే మార్చుకుని మేనేజ్ చేస్తున్నానో అలాగే తండ్రిగా, తాతగా వారితో ఉంటున్నాను" అని దిల్ రాజు స్పష్టం చేశారు.

ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో గేమ్మ ఛేంజర్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు దిల్ రాజు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఆయన ప్రొడక్షన్‌లో ఇటీవలే బలగం అనే మూవీ విడుదలైంది. వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది.

IPL_Entry_Point

టాపిక్