Romantic Comedy OTT: నేరుగా ఓటీటీలోకి బిగ్‌బాస్ రన్నరప్ రొమాంటిక్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు...ఎందులో అంటే?
14 October 2024, 6:08 IST
Romantic Comedy OTT: బిగ్‌బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ డెబ్యూ మూవీ లీలా వినోదం రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. నవంబర్ 8న ఈ సినిమా విడుదలకాబోతుంది. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.
రొమాంటిక్ కామెడీ ఓటీటీ
Romantic Comedy OTT: బిగ్‌బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. లీలా వినోదం పేరుతో షణ్ముఖ్ జస్వంత్ ఓ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ మూవీ చేస్తోన్నాడు.థియేటర్లలో కాకుండా నేరుతో ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈటీవీ విన్ ఓటీటీలో నవంబర్ 8 నుంచి లీలా వినోదం స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో హీరోహీరోయిన్లు సైకిల్ తొక్కుతూ కనిపిస్తోన్నారు.
మలయాళ బ్యూటీ...
లీలా వినోదం మూవీలో మలయాళ బ్యూటీ అనఘా అజిత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు పవన్ సుంకర దర్శకత్వం వహిస్తోన్నాడు. శ్రీధర్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీకి టీఆర్ కృష్ణ చేతన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో...
లీలా వినోదం మూవీలో షణ్ముఖ్ జస్వంత్ వినోద్ అనే క్యారెక్టర్‌లో కనిపించబోతుండగా...లీలాగా అనఘా అజిత్ కనిపించనున్నట్లు సమాచారం. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీగా లీలా వినోదం మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
బిగ్‌బాస్ శివాజీతో...
లీలా వినోదం తర్వాత మరో కొత్త మూవీని ఇటీవలే అనౌన్స్‌చేశాడు షణ్ముఖ్ జస్వంత్. దసరా రోజున ఈ సినిమా పూజాకార్యక్రమాలతో లాంఛ్ అయ్యింది. ఈ మూవీలో షణ్ముఖ్ జస్వంత్‌తోపాటు బిగ్‌బాస్ శివాజీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ మూవీకి భీమాశంకర్ దర్శకత్వం వహిస్తోన్నారు. థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు షణ్ముఖ్ తెలిపాడు. 70 ఎమ్ఎమ్ స్క్రీన్‌పై తనను తాను చూసుకోవాలనే కల నిజమవుతుందని, ఎంత కిందపడిన మళ్లీ మళ్లీ ఆడియెన్స్ తనను సపోర్ట్ చేస్తూనే ఉన్నారంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షణ్ముఖ్ జస్వంత్ పోస్ట్ పెట్టాడు.
బిగ్‌బాస్ రన్నరప్...
బిగ్‌బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న షణ్ముఖ్ జస్వంత్ తన ఆటతీరు, ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ఫైనల్ చేరాడు. . షణ్ముఖ్ టైటిల్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్‌లో షణ్ముఖ్‌కు వీజే సన్నీ షాకిచ్చి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. బిగ్‌బాస్ హౌజ్‌లో సిరి హనుమంతుతో షణ్ముఖ్ లవ్ స్టోరీ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.
బిగ్‌బాస్ తర్వాత... ఏజెంట్ ఆనంద్ సంతోష్, ది సాఫ్ట్‌వేర్ డెవలపర్ తో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లు చేశాడు. రుక్మిణి, మలుపు, అయ్యోయ్యో వంటి ఇండిపెండెంట్ సాంగ్స్‌లో షణ్ముఖ్ కనిపించాడు. సినిమాలు, సిరీస్‌ల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తోన్నాడు షణ్ముఖ్.
బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్...
మలయాళంలో తన్నీర్ మాతన్ దినంగల్ అనే సినిమా చేసింది అనఘా అజిత్. 2019లో మలయాళంలో రిలీజైన ఈ మూవీ ఆ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. షణ్ముఖ్ మూవీతో టాలీవుడ్‌లో తొలి అడుగు వేయబోతున్నది.
టాపిక్