OTT Suspense Thriller: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Kali OTT Release Date: కలి చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే స్ట్రీమింగ్‍కు రెడీ అయిపోయింది. డేట్ కూడా ఫిక్స్ అయింది.
కొన్ని తక్కువ బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో రిలీజైన కొన్ని రోజులకే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. థియేట్రికల్ రన్ సరిగా లేకనో.. ముందుగా చేసుకున్న డీల్స్ వల్లనో కొన్ని చిత్రాలు స్ట్రీమింగ్‍కు వేగంగా వస్తున్నాయి. ఆ జాబితాలోకి ‘కలి’ చిత్రం చేరింది. ప్రిన్స్ సెసిల్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 4వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
కలి సినిమా అక్టోబర్ 17వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (అక్టోబర్ 13) అధికారికంగా ప్రకటించింది. మరో నాలుగు రోజుల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది.
కలి ట్రైలర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈటీవీ విన్ డేట్‍ను అధికారికంగా వెల్లడించింది. “పర్‌ఫెక్ట్‌గా రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కలిని తీసుకొస్తున్నాం. అక్టోబర్ 17 నుంచి ఈటీవీ విన్‍లో ప్రీమియర్ అవుతుంది” అని సోషల్ మీడియాలో ఈటీవీ విన్ పోస్ట్ చేసింది.
రెండు వారాల్లోనే..
కలి సినిమా ట్రైలర్‌తో ఆసక్తి కలిగించింది. కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయటంతో బజ్ ఏర్పడింది. అక్టోబర్ 4న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. అయితే, ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. అక్టోబర్ 17న స్ట్రీమింగ్‍కు తీసుకొస్తోంది.
ప్రిన్స్, నరేశ్ అగస్త్యతో పాటు కలి చిత్రంలో నేహా కృష్ణన్, కేదార్ శంకర్, సీవీఎల్ నరసింహా రావు, మణిచందన, మధుమణి కీలకపాత్రలు పోషించారు. శివ శేషు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కలి పురుషుడి కాన్సెప్ట్‌తో డిఫరెంట్ పాయింట్‍తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కలి మూవీని టి.లీలా గౌతమ్ ప్రొడ్యూజ్ చేశారు. జీవన్ బాబు సంగీతం అందించిన ఈ మూవీకి రమణ జాగర్లమూడి, నిశాంత్ సినిమాటోగ్రఫీ చేశారు.
కలి స్టోరీలైన్
కాలేజీలో ప్రొఫెసర్‌గా శివరామ్ (ప్రిన్స్ సెసిల్) పని చేస్తుంటారు. అందరికీ సాయం చేసే గుణం అతడిది. శివరామ్‍ను వేదా (నేహ) ప్రేమిస్తుంది. పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోరు. దీంతో ఇంటి నుంచి వచ్చేసి శివరామ్‍ను వేదా పెళ్లాడుతుంది. అయితే, హఠాత్తుగా శివరామ్‍కు వేదా దూరమవుతుంది. ఆర్థికంగానూ నష్టపోతాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని శివరామ్ (ప్రిన్స్) ప్రయత్నిస్తాడు. కలి యుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్ అగస్త్య) అతడిని ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కలి పురుషుడు.. శివరామ్‍కు ఏం చెప్పాడు? ఏ ఆట ఆడించాడు? చివరికి శివరామ్ బతుకుతాడా, అతడి సమస్యలు తీరతాయా? అనే విషయాలు కలి చిత్రంలో ఉంటాయి.
కాగా, ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ‘పైలం పిలగా’ చిత్రం ఇటీవలే స్ట్రీమింగ్‍కు వచ్చింది. అక్టోబర్ 10న స్ట్రీమింగ్ షురూ అయింది. సాయితేజ, పావని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ కూడా థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.