OTT Telugu Comedy Movie: ఓటీటీలోకి 20 రోజుల్లోనే వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ott telugu comedy movie pailam pilaga to stream on etv win ott from october 10th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Comedy Movie: ఓటీటీలోకి 20 రోజుల్లోనే వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Telugu Comedy Movie: ఓటీటీలోకి 20 రోజుల్లోనే వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Oct 01, 2024 07:33 PM IST

OTT Telugu Comedy Movie: ఓటీటీలోకి ఇప్పుడో తెలుగు కామెడీ మూవీ 20 రోజుల్లోనే వచ్చేస్తోంది. పూర్తి తెలంగాణ నేటివిటీతో రూపొందిన ఈ సినిమాకు ఐఎండీబీలోనూ మంచి రేటింగే ఉంది. అయితే థియేటర్లలో మాత్రం పెద్దగా ఆడలేదు.

ఓటీటీలోకి 20 రోజుల్లోనే వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలోకి 20 రోజుల్లోనే వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Telugu Comedy Movie: ఓటీటీలో చిన్న సినిమాల జాతర ఎప్పుడూ ఉండేదే. ఇప్పుడు అలాంటిదో మరో తెలుగు కామెడీ మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు పైలం పిలగా. సెప్టెంబర్ 20వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 20 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఈ మూవీని ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.

పైలం పిలగా ఓటీటీ రిలీజ్ డేట్

పైలం పిలగా తెలంగాణ నేటివిటీతో వచ్చిన మరో కామెడీ డ్రామా. ఈ సినిమాను అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ అధికారికంగా వెల్లడించింది. మంగళవారం (అక్టోబర్ 1) ఈ నెల తమ ప్లాట్‌ఫామ్ పై రిలీజ్ కాబోయే సినిమాల జాబితాను ఈటీవీ విన్ రిలీజ్ చేసింది.

అందులో ఈ పైలం పిలగా మూవీ కూడా ఒకటి. సెప్టెంబర్ 20న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఐఎండీబీలో 9 రేటింగ్ ఉన్నా.. 20 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

పైలం పిలగా మూవీ గురించి..

పైలం పిలగా మూవీని ఆనంద్ గుర్రం డైరెక్ట్ చేశాడు. సాయితేజ కల్వకోట, పావని కరణం, మిర్చి కిరణ్ లాంటి వాళ్లు ఇందులో నటించారు. ఈ సినిమా కోతుల గుట్ట అనే ఊళ్లో ఉండే శివ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. దుబాయ్ వెళ్లాలని కలలు కనే అతడు.. ఊరి చివరన ఉన్న తన నాన్నమ్మ రెండకెరాల భూమి అమ్మేసి వచ్చిన డబ్బులతో అక్కడికి వెళ్లాలని అనుకుంటాడు.

అయితే ఆ స్థలం లిటిగేషన్ లో ఉండటం, దానిని అమ్మడానికి అతడు నానా తంటాలు పడటం మూవీలో చూడొచ్చు. ఓవైపు ఇది జరుగుతుండగానే దేవి (పావని) అనే అమ్మాయిని అతడు ప్రేమిస్తాడు. గాల్లో మేడలు కట్టే శివకి, ఉన్నదాంట్లో సర్దుకుపోవాలనుకునే దేవికి మధ్య ప్రేమ పొసగదు. చివరికి శివ ఆ స్థలంతోపాటు దేవి విషయంలో ఏం చేశాడు? అతని దుబాయ్ కల నెరవేరిందా అన్నది పైలం పిలగా మూవీలో చూడొచ్చు.

ఈటీవీ విన్ అక్టోబర్ రిలీజెస్

ఇక ఈటీవీ విన్ ఓటీటీ తన అక్టోబర్ నెల రిలీజెస్ గురించి వెల్లడించింది. అందులో తత్వ, కలి, భలే ఉన్నాడేలాంటి సినిమాలతోపాటు కొరియన్ వెబ్ సిరీస్ హిడెన్ ఐడెంటిటీ తెలుగు వెర్షన్ కూడా ఉంది. వీటిలో రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ గురువారం (అక్టోబర్ 3) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇక తత్వ మూవీ అక్టోబర్ 10న ఈటీవీ విన్ లోకి రానుంది. అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానున్న కలి మూవీ కూడా ఈ నెల చివర్లోనే ఈ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అటు హిడెన్ ఐడెంటిటీ వెబ్ సిరీస్ అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని కూడా సదరు ఓటీటీ తెలిపింది.