IMDb Top 250 Indian Movies: ఐఎండీబీ టాప్ 250 ఇండియన్ మూవీస్‌.. టాప్ 20లో ఉన్న ఏకైక తెలుగు సినిమా ఇదే-imdb top 250 indian movies of all time released co kancharapalem is the only telugu movie in top 20 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Imdb Top 250 Indian Movies: ఐఎండీబీ టాప్ 250 ఇండియన్ మూవీస్‌.. టాప్ 20లో ఉన్న ఏకైక తెలుగు సినిమా ఇదే

IMDb Top 250 Indian Movies: ఐఎండీబీ టాప్ 250 ఇండియన్ మూవీస్‌.. టాప్ 20లో ఉన్న ఏకైక తెలుగు సినిమా ఇదే

Hari Prasad S HT Telugu
Oct 01, 2024 06:08 PM IST

IMDb Top 250 Indian Movies: ఐఎండీబీ తాజాగా టాప్ 250 ఆల్ టైమ్ ఇండియన్ మూవీస్ జాబితాను రిలీజ్ చేసింది. అయితే వీటిలో టాప్ 20లో ఒకే ఒక్క తెలుగు సినిమా మాత్రమే చోటు దక్కించుకోగా.. తొలి స్థానంలో 12th ఫెయిల్ మూవీ నిలిచింది.

ఐఎండీబీ టాప్ 250 ఇండియన్ మూవీస్‌.. టాప్ 20లో ఉన్న ఏకైక తెలుగు సినిమా ఇదే
ఐఎండీబీ టాప్ 250 ఇండియన్ మూవీస్‌.. టాప్ 20లో ఉన్న ఏకైక తెలుగు సినిమా ఇదే

IMDb Top 250 Indian Movies: ఐఎండీబీ.. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్.. ఇక్కడే సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాలకు తమ రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. అలా ప్రేక్షకులే టాప్ రేటింగ్ ఇచ్చిన టాప్ 250 ఆల్ టైమ్ ఇండియన్ సినిమాల తాజా జాబితాను ఐఎండీబీ రిలీజ్ చేసింది. ఈ వెబ్ సైట్‌లో ఈ 250 సినిమాలకు 85 లక్షలకుపైగా ఓట్లు రావడం విశేషం.

ఐఎండీబీ టాప్ ఇండియన్ మూవీస్

ఐఎండీబీ టాప్ 250 ఇండియన్ మూవీస్ జాబితాలో గతేడాది బాలీవుడ్ లో రిలీజై సంచలనం విజయం సాధించిన 12th ఫెయిల్ మూవీ ఉంది. విదూ వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విక్రాంత్ మస్సీ నటించిన విషయం తెలిసిందే. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది.

ఈ ఏడాది ఇప్పటి వరకూ రిలీజైన సినిమాలను కలుపుకొని ఐఎండీబీ ఈ జాబితా తయారు చేసింది. ఈ లిస్టులో టాప్ 5 మూవీస్ చూస్తే.. 12th ఫెయిల్ తర్వాత గోల్ మాల్, నాయకన్, మహారాజా, అపూర్ సంసార్ సినిమాలు ఉన్నాయి. ఐదింట్లో రెండు హిందీ, రెండు తమిళ సినిమాలు చోటు దక్కించుకోవడం విశేషం. ఈ ఏడాది తమిళంలో రిలీజైన విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా 4వ స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచింది.

టాప్ 20లో ఒకే ఒక్క తెలుగు మూవీ

అయితే ఐఎండీబీ టాప్ 20 సినిమాల జాబితాలో ఒకే ఒక్క తెలుగు సినిమానే చోటు దక్కించుకుంది. టాప్ 5, 10లలో అయితే ఒక్క మూవీ కూడా లేదు. తెలుగు ఇండస్ట్రీ నుంచి కేరాఫ్ కంచరపాలెం అనే సినిమా 16వ స్థానంలో నిలిచింది. 2018లో రిలీజైన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.

ఐఎండీబీలో ఈ మూవీకి 8.8 రేటింగ్ లభించింది. అంతేకాదు మొత్తంగా 8286 మంది ఈ మూవీకి రేటింగ్ ఇచ్చారు. వెంకటేశ్ మహా డైరెక్ట్ చేసిన కేవలం రూ.50 లక్షల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర రూ.7 కోట్లు వసూలు చేసింది. కొత్త నటీనటులతోనే ఈ మూవీ సంచలన విజయం సాధించింది.

మణిరత్నం టాప్

ఐఎండీబీ టాప్ 250 ఆల్ టైమ్ ఇండియన్ మూవీస్ జాబితాలో మణిరత్నం డైరెక్ట్ చేసిన మూవీస్ ఎక్కువగా ఉన్నాయి. అతని దర్శకత్వంలో వచ్చిన ఏడు మూవీస్ ఇందులో చోటు దక్కించుకోవడం విశేషం. ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తీసిన ఆరు సినిమాలు ఉన్నాయి. కమల్ హాసన్ తో మణిరత్నం తీసిన నాయకన్ మూవీ నాలుగో స్థానంలో నిలిచింది.

ఇక ఈ జాబితాలో సీక్వెల్స్ సహా ఉన్న మూవీస్ కూడా ఉన్నాయి. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2 సినిమాలకు టాప్ 250లో చోటు దక్కింది. అలాగే దృశ్యం, మున్నాభాయ్ ఎంబీబీఎస్, జిగర్తాండ, కేజీఎఫ్ లాంటి సినిమాలు, వాటి సీక్వెల్స్ కూడా ఇందులో ఉన్నాయి.