తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 హౌస్‌లోకి టీమిండియా మాజీ క్రికెటర్!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 హౌస్‌లోకి టీమిండియా మాజీ క్రికెటర్!

Hari Prasad S HT Telugu

18 July 2023, 15:02 IST

google News
    • Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 హౌస్‌లోకి టీమిండియా మాజీ క్రికెటర్ రానున్నట్లు ఓ బజ్ క్రియేటైంది. ఈ కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పుడే కంటెస్టెంట్ల గురించి చర్చ మొదలైంది.
మాజీ క్రికెటర్ వేణుగోాపాల రావ్
మాజీ క్రికెటర్ వేణుగోాపాల రావ్

మాజీ క్రికెటర్ వేణుగోాపాల రావ్

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలుసు కదా. దీంతో అప్పుడే ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేయబోతున్న కంటెస్టెంట్ల గురించి చర్చ మొదలైంది. సాధారణంగా ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు ఎవరెవరు హౌస్ లోకి రాబోతున్నారన్న విషయంపై చాలా ముందుగానే అంచనాలు మొదలవుతాయి.

ఈసారి కూడా అదే జరుగుతోంది. బిగ్ బాస్ ఏడో సీజన్ లోనూ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో టీమిండియా మాజీ క్రికెటర్ కంటెస్టెంట్ గా రాబోతున్నాడన్న వార్త ఆసక్తి రేపుతోంది. సాధారణంగా సినీ, టీవీ రంగానికి చెందిన సెలబ్రిటీలు గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి రావడం మనం చూశాం. అయితే ఈసారి ఏకంగా టీమిండియాకు ఆడిన క్రికెటర్ పేరు తెరపైకి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఆ మాజీ క్రికెటర్ ఎవరో కాదు.. విశాఖపట్నానికి చెందిన వేణుగోపాల రావు. అతని పార్టిసిపేషన్ పై బజ్ క్రియేటైంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఓ మాజీ క్రికెటర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే మాత్రం ఈ సీజన్ క్రేజ్ మరింత పెరగడం ఖాయం. గత రెండు సీజన్ల పాటు ఈ రియాల్టీ షోకు అంతగా ఆదరణ దక్కలేదు.

దీంతో ఈసారి కంటెస్టెంట్లతోనే బజ్ క్రియేట్ చేయాలని షో ఆర్గనైజర్లు భావిస్తున్నారు. అందులో భాగంగానే వేణుగోపాల రావును హౌస్ లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం. వేణుగోపాల రావు ఇండియా తరఫున 16 వన్డేలు ఆడాడు. 2005లో శ్రీలంకపై వన్డే అరంగేట్రం చేసిన వేణుగోపాల్.. ఆ తర్వాత ఏడాదే వెస్టిండీస్ పై చివరి వన్డే ఆడాడు.

ఇండియా తరఫున 218 పరుగులు చేశాడు. అటు ఐపీఎల్లోనూ వేణు మొత్తం 65 మ్యాచ్ లు ఆడాడు. ప్రస్తుతం అతడు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇండియన్ టీమ్ తోపాటు ఐపీఎల్ మ్యాచ్ లకు కూడా వేణు తెలుగు కామెంట్రీ ఇస్తున్నాడు. ఈ మధ్యే అతడు జనసేన పార్టీలోనూ చేరిన విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం