KL Rahul out: టీమిండియాకు బ్యాడ్‌న్యూస్.. ఆసియా కప్‌కు ఆ స్టార్ ప్లేయర్ దూరం
KL Rahul out: టీమిండియాకు బ్యాడ్‌న్యూస్. ఆసియా కప్‌కు కేఎల్ రాహుల్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ సందర్భంగా గాయపడిన అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
KL Rahul out: ఆసియా కప్ లో ఆడతాడనుకున్న కేఎల్ రాహుల్ ఇప్పుడీ టోర్నీకి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఐపీఎల్ సందర్భంగా గాయపడిన రాహుల్.. తర్వాత సర్జరీ కూడా చేయించుకున్నాడు. కొన్నాళ్లుగా ఆ గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్‌నెస్ సాధించడంపై దృష్టి సారించాడు. అయితే క్రిక్‌బజ్ లో వచ్చిన రిపోర్టు ప్రకారం.. రాహుల్ ఆసియా కప్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ఐపీఎల్లో బరిలోకి దిగిన రాహుల్.. తొడ గాయానికి గురయ్యాడు. ఈ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మిగతా మ్యాచ్ లు ఆడలేకపోయాడు. ఆ తర్వాత అతనికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీలో రీహ్యాబిలిటేషన్ లో ఉన్నాడు. ఆసియా కప్ సమయానికి అతడు పూర్తిగా కోలుకుంటాడని భావించారు.
అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం అతని కమ్‌బ్యాక్ మరింత ఆలస్యం కానుంది. కొన్నాళ్లుగా ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తున్నా.. ఇప్పటి వరకూ అతడు బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు. దీంతో ఆసియా కప్ కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది తెలియడం లేదు. టోర్నీ ప్రారంభానికి ముందే అతనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఒకవేళ అతడు ఆసియా కప్ లో ఆడలేకపోతే దాని ప్రభావం వరల్డ్ కప్ పై కూడా ఉండే అవకాశం ఉంది. ఆ మెగా టోర్నీలో ఆడాలనుకుంటున్న ప్లేయర్స్ కు ఆసియా కప్ లో తమను తాము నిరూపించుకునేందుకు మంచి అవకాశం దక్కనుంది. రాహుల్ అది కోల్పోతే వరల్డ్ కప్ సమయానికి తిరిగి జట్టులోకి రావడం అంత సులువు కాదు. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ లాంటి ప్లేయర్స్ రాహుల్ కు గట్టి పోటీ ఇవ్వనున్నారు.
బుమ్రా వస్తాడా?
రాహుల్ ఫిట్‌నెస్ పై సందేహాలు ఉన్నా.. పేస్ బౌలర్ బుమ్రా విషయంలో మాత్రం టీమిండియాకు కాస్త పాజిటివ్ వార్తలు వస్తున్నాయి. గాయం కారణంగా గతేడాది సెప్టెంబర్ నుంచి టీమ్ కు దూరంగా ఉన్న అతడు.. ప్రస్తుతం బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అతడు తిరిగి వస్తే టీమ్ పేస్ బౌలింగ్ మరింత బలపడుతుంది. అటు గాయం నుంచి కోలుకుంటున్న మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా ఆసియా కప్ సమయానికి జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంబంధిత కథనం