Bhola Shankar Trp Rating: భోళాశంకర్ టీవీ ప్రీమియర్‌కు డిజాస్టర్ టీఆర్‌పీ రేటింగ్ -ఆచార్యలో సగం కూడా రాలేదుగా!
27 September 2024, 14:08 IST
Bhola Shankar Trp Rating: చిరంజీవి భోళాశంకర్ ఫస్ట్ టీవీ ప్రీమియర్‌కు డిజాస్టర్ టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఇటీవలే జీ తెలుగులో టెలికాస్ట్ అయిన ఈ మూవీ 2.60 టీఆర్‌పీని మాత్రమే దక్కించుకున్నది. భోళాశంకర్ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు.
భోళా శంకర్ టీఆర్‌పీ రేటింగ్
Bhola Shankar Trp Rating: చిరంజీవి భోళాశంకర్ మూవీ థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత టీవీలోకి వచ్చింది. ఇటీవలే జీ తెలుగు ఛానెల్‌లో ఈ యాక్షన్ డ్రామా మూవీ టెలికాస్ట్ అయ్యింది. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ టీవీల్లో కూడా అదే రిజల్ట్‌ను సొంతం చేసుకున్నది.
ఈ ఫస్ట్ టీవీ ప్రీమియర్‌కు అర్బన్, రూరల్ ఏరియాల్లో కలిపి 2.60 టీఆర్‌పీ మాత్రమే వచ్చింది. అర్బన్ ఏరియాలో 3.56 టీఆర్‌పీ కొంత పరవాలేదనిపించింది. చిరంజీవి కెరీర్‌లో లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ వచ్చిన మూవీగా భోళాశంకర్ నిలిచింది.
ఆచార్య టీఆర్‌పీ...
చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన ఆచార్య ఫస్ట్ టీవీ ప్రీమియర్‌కు 6.38 టీఆర్‌పీ వచ్చింది. ఆచార్యలో సగం టీఆర్‌పీ రేటింగ్ కూడా భోళాశంకర్‌కు రాకపోవడం గమనార్హం. ఇటీవల జీ తెలుగులోనే టెలికాస్ట్ అయిన ఇంద్రమూవీ 5.66 టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్నది. ఇంద్రకంటే భోళాశంకర్‌కు తక్కువ టీఆర్‌పీ రావడం గమనార్హం.
వేదాళం రీమేక్...
భోళాశంకర్ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. తమిళంలో అజిత్ హీరోగా బ్లాక్‌బస్టర్‌గా హిట్‌గా నిలిచిన వేదాళం మూవీకి రీమేక్‌గా భోళాశంకర్ తెరకెక్కింది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించగా...చిరంజీవి సోదరిగా కీర్తిసురేష్ కనిపించింది.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో భోళాశంకర్ మూవీని నిర్మించాడు. యాభై కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ నిర్మాతకు భారీగా నష్టాలను మిగిల్చింది.
జబర్ధస్థ్ బ్యాచ్...
భోళాశంకర్ మూవీలో హైపర్ ఆది, గెటప్ శీను, వేణుతో పాటు జబర్ధస్థ్ బ్యాచ్ కమెడియన్లు అందరూ నటించారు. సుశాంత్, శ్రీముఖి ఓ కీలక పాత్రల్లో కనిపించారు. కథ ఔట్‌డేటెడ్ కావడం, టేకింగ్‌లో కొత్తదనం మిస్సవ్వడంతో ఈ సినిమా మెగా అభిమానులను మెప్పించలేకపోయింది.
భోళాశంకర్ కథ ఇదే..
శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహాలక్ష్మి (కీర్తిసురేష్) చదువు కోసం కోల్‌కతాకు వస్తాడు. టాక్సీ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తూ మహాలక్ష్మిని చదివిస్తుంటాడు. కోల్‌కతాలో ఓ గ్యాంగ్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తూ విదేశాలకు అమ్ముతుంటుంది.ఆ గ్యాంగ్ ఆచూకీని శంకర్ పోలీసులకు చేరవేస్తాడు. అతడిపై పగను పెంచుకున్న గ్యాంగ్ మెంబర్ ఛోటు శంకర్‌పై ఎటాక్ చేస్తాడు. ఛోటును శంకర్ చంపేస్తాడు.
చెల్లెలి చదువు కోసం కాదని ఛోటు గ్యాంగ్‌ను వెతుక్కుంటూనే శంకర్ కోల్‌కతాకు వచ్చాడనే నిజం బయటపడుతుంది. ఛోటుతో పాటు అతడి అన్న ఛార్లెస్‌ను కూడా శంకర్ చంపేస్తాడు. అదే టైమ్‌లో మహాలక్ష్మి శంకర్ సొంత చెల్లెలు కాదనే నిజం బయటపడుతుంది. అసలు శంకర్ ఎవరు? మహాలక్ష్మిని తన చెల్లెలిగా భావించడానికి కారణం ఏమిటి? శంకర్‌తో పాటు మహాలక్ష్మి గతం ఏమిటి?
హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ లీడర్ అలెగ్జాండర్ (తరుణ్ ఆరోణా)... మహాలక్ష్మికి ఎలాంటి అపాయం తలపెట్టాడు? శంకర్‌ను ఇష్టపడిన క్రిమినల్ లాయర్ లాస్య (తమన్నా) ఎవరు? అన్నదే భోళా శంకర్ సినిమా కథ.
విశ్వంభర
భోళాశంకర్ తర్వాత సినిమాలకు ఏడాదిపైనే గ్యాప్ తీసుకున్న చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తోన్నాడు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిషతో పాటు ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్నారు.సోషియా ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.