Devara: ఆచార్య రిలీజైన 20 రోజుల్లోనే దేవర వర్క్ స్టార్ట్ చేశాను.. డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్-koratala siva comments on devara work start after 20 days release of acharya jr ntr devara movie review get mixed talk ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara: ఆచార్య రిలీజైన 20 రోజుల్లోనే దేవర వర్క్ స్టార్ట్ చేశాను.. డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్

Devara: ఆచార్య రిలీజైన 20 రోజుల్లోనే దేవర వర్క్ స్టార్ట్ చేశాను.. డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Sep 27, 2024 11:14 AM IST

Koratala Siva About Devara Work Start: వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 27న దేవర సినిమా విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ చిత్రం దేవర ప్రమోషన్స్‌లో డైరెక్టర్ కొరటాల శివ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేవరపై మిక్స్‌డ్ టాక్ నడుస్తున్న నేపథ్యంలో కొరటాల శివ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆచార్య రిలీజైన 20 రోజుల్లోనే దేవర వర్క్ స్టార్ట్ చేశాను.. డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్
ఆచార్య రిలీజైన 20 రోజుల్లోనే దేవర వర్క్ స్టార్ట్ చేశాను.. డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్

Junior NTR Devara Koratala Siva: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవర. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తారక్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నారు. బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన దేవరలో సైఫ్ అలీ ఖాన్ పవర్‌ఫుల్ విలన్‌గా చేశారు.

బీజీఎమ్ బాగుందని

హీరో నంద‌మూరి కల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె దేవర చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ అంటే సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదలైన దేవర సినిమాపై మిశ్రమ స్పందన వస్తోంది. యాక్షన్ సీన్స్, ఎన్టీఆర్ నటన, అనిరుధ్ రవిచందర్ బీజీఎమ్ చాలా బాగున్నాయని రివ్యూవర్స్ చెబుతున్నారు.

అలాగే, ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ 20 నిమిషాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని దేవర సినిమాను పొగుడుతున్నారు. అయితే, దేవర ప్లాట్ మరీ రొటీన్‌గా ఉందని, ఆచార్యలో పాదఘట్టం అయితే, దేవరలో ఎర్ర సముద్రం అంటూ కొరటాల శివ ఇరిటేట్ చేశాడని నెటిజన్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదివరకు చేసిన దేవర ప్రమోషన్స్‌లో కొరటాల శివ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

20 రోజుల్లోనే

"ఆచార్య‌ సినిమా ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు. అయితే దానికి ఒత్తిడేం ప‌డ‌లేదు. ఈ సినిమా (దేవర)కు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యాను. ఆచార్య రిలీజైన 20 రోజుల్లోనే దేవ‌ర సినిమా మోష‌న్ పోస్ట‌ర్ ప‌నిలో ప‌డ్డాను" అని ఆచార్య తర్వాత వెంటనే దేవర వర్క్ స్టార్ట్ చేసినట్లు కొరటాల శివ చెప్పారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ కావడంతో.. నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.

"ఆచార్య ఎఫెక్ట్‌తో అయినా దేవర సినిమాకు కాస్తా టైమ్ తీసుకోవాల్సింది. లేకుంటే ఇలాంటి మిక్స్‌డ్ టాక్ వచ్చేది కాదు" అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆచార్య తర్వాత మరోసారి కొరటాల శివపై ట్రోలింగ్ తప్పేలా లేదని తెలుస్తోంది. కాగా, దేవర సినిమా గురించి కొరటాల శివ మాట్లాడుతూ..

4 గంటల నెరేషన్

"దేవ‌ర‌ సెకండ్ షెడ్యూల్ స‌మ‌యంలో ఇంత పెద్ద క‌థ‌ను మూడు గంట‌ల్లోపు చెప్ప‌గ‌ల‌మా! అనే అంద‌రం అనుకున్నాం. ఎందుకంటే నెరేష‌న్ 4 గంట‌లుంది. పేప‌ర్ మీద పెట్టిన‌ప్పుడు అది 6-7 గంట‌లు వ‌స్తుంది. సెకండ్ షెడ్యూల్ అప్పుడే మూడు గంట‌ల్లో ఈ క‌థ‌ను చెప్ప‌లేమ‌ని అర్థ‌మైంది" అని తెలిపారు.

"రెండు పార్టులు వ‌ద్ద‌నుకునే రివర్స్‌లో వెళ్లాం. కానీ, కుద‌ర‌ద‌ని తెలిసిపోయింది. దాంతో రెండు భాగాలుగా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఇదేదో బిజినెస్ కోస‌మో, సెన్సేష‌న్ కోస‌మో చేసింది కాదు. ఓ పార్టులో చెప్ప‌లేని క‌థ‌ను రెండు భాగాలుగా చెప్పాలి" అని కొరటాల శివ అన్నారు.

"ల‌క్కీగా దేవర సినిమాకు సాబు శిరిల్, ర‌త్న‌వేలు, శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, అనిరుద్ వంటి టాప్ టెక్నీషియ‌న్స్ కుదిరారు. ఎవ‌రికీ స్పూన్ ఫీడింగ్ ఇవ్వాల్సిన ప‌ని లేదు. అందుక‌నే వాళ్ల ఐడియాస్‌తో వ‌ర్క్ చేసుకుని వ‌చ్చారు. అంద‌రూ మంచి టెక్నీషియ‌న్స్ కాబ‌ట్టి మంచి ఇన్‌పుట్స్ ఇచ్చారు" అని డైరెక్టర్ కొరటాల శివ చెప్పారు.