తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movie: బాల్యాన్ని గుర్తుచేసేలా సోపతులు ట్రైలర్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకే సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Movie: బాల్యాన్ని గుర్తుచేసేలా సోపతులు ట్రైలర్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకే సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

17 September 2024, 21:17 IST

google News
    • Sopathulu OTT Movie: సోపతులు సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. తెలంగాణ రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది.
OTT Movie: ఇంట్రెస్టింగ్‍గా సోపతులు ట్రైలర్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకే సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OTT Movie: ఇంట్రెస్టింగ్‍గా సోపతులు ట్రైలర్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకే సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Movie: ఇంట్రెస్టింగ్‍గా సోపతులు ట్రైలర్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకే సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఈటీవీ విన్ ఇటీవల వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‍లను తీసుకొస్తోంది. ముఖ్యంగా నేరుగా తీసుకొచ్చే చిత్రాల సంఖ్య పెంచుతోంది. ఆగస్టులో ఈటీవీ విన్‍లో నేరుగా వచ్చిన వీరాంజనేయులు విహారయాత్ర చిత్రం మంచి సక్సెస్ అయింది. భారీగా వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు ఈటీవీ విన్ డైరెక్ట్‌గా మరో మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకొస్తోంది. సోపతులు పేరుతో ఈ మూవీ వస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను నేడు (సెప్టెంబర్ 17) రిలీజ్ చేసింది ఈటీవీ విన్ ప్లాట్‍ఫామ్. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.

ట్రైలర్ ఇలా..

తెలంగాణలోని ఓ గ్రామంలో సోపతులు మూవీ స్టోరీ సాగుతుంది. స్నేహితులైన ఇద్దరు స్కూల్ పిల్లల మధ్య సరదా గొడవతో సోపతులు ట్రైలర్ షురూ అయింది. పిల్లలు క్రికెట్, గోలీలు ఆడుతూ సంతోషంగా ఉంటారు. కరోనా కాలంలో కథ ఉంటుంది. కరోనా జాగ్రత్తలను ఎన్టీఆర్, రామ్‍చరణ్ చెప్పడం ఈ ట్రైలర్‌లో ఉంది. కరోనా లాక్‍కౌడ్ విధిస్తున్నట్టు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో పరిస్థితులు మారిపోతాయి.

కరోనా లాక్‍డౌన్ సమయంలో ఇద్దరు స్నేహితులు విడిపోతారు. ఆన్‍లైన్ క్లాస్‍ల కోసం స్మార్ట్ ఫోన్ కొనేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడడం కూడా ఈ ట్రైలర్‌లో ఉంది. విడిపోయిన ఇద్దరు స్నేహితులు బాధపడతారు. కల్లు కుండలో పాలసుక్క లాంటి సినిమా అంటూ ట్రైలర్లో మూవీ టీమ్ పేర్కొంది.

సోపతులు ట్రైలర్ బాల్యాన్ని గుర్తుచేసేలా ఉంది. చిన్నతనంలో చాలా మంది ఆడిన ఆటలతో పాటు గ్రామీణ పరిస్థితులతో ఈ చిత్రం ఉందని అర్థమవుతోంది. పిల్లల్లోని భావోద్వేగాలు, కామెడీ, స్నేహితుల మధ్య బంధాలు ఈ మూవీలో ఉండనున్నాయి.

సోపతులు చిత్రంలో భాను ప్రకాశ్, శృజన్, మోహన్ భగత్, మణి అయిగుర్ల, అనూష రమేశ్, అంజయ్య మిల్కూరి, సురభి లలిత, పద్మ నిమ్మనగోటి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనంత్ వర్దన్ దర్శకత్వం వహించారు.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

సోపతులు చిత్రం సెప్టెంబర్ 19వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో ఈ సిరీస్‍కు మంచి వ్యూస్ దక్కే అవకాశాలు ఉన్నాయి.

సోపతులు చిత్రాన్ని వైల్డ్ వర్చు క్రియేషన్స్ పతాకం ఈ మూవీని నిర్మిస్తోంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం డైరెక్టర్ వినోద్ అనంతోజ్ ఈ మూవీని సమర్పిస్తున్నారు. ముందు నుంచే ఈ మూవీని ఓటీటీ ప్రాజెక్టుగా తెరకెక్కించారు. అందుకు అనుగుణంగానే సెప్టెంబర్ 19న ఈ చిత్రం ఈటీవీలో అడుగుపెట్టనుంది.

ఇటీవలే కమిటీ కుర్రోళ్ళు

కమిటీ కుర్రోళ్ళు చిత్రం ఈటీవీ విన్‍లో దూసుకెళుతోంది. సెప్టెంబర్ 12వ తేదీన ఈ రూరల్ కామెడీ డ్రామా మూవీ ఈ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఆరంభం నుంచే దుమ్మురేపుతోంది. ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్‍బస్టర్ అయింది. సుమారు రూ.5కోట్ల బడ్జెట్‍తో రూపొంది.. సుమారు రూ.17కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్ వస్తోంది. ఈటీవీ విన్‍లో ఈ చిత్రం భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి యధు వంశీ దర్శకత్వం వహించగా.. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించారు. తొలి చిత్రంతోనే నిర్మాతగా బంపర్ హిట్ కొట్టారు నిహారిక.

తదుపరి వ్యాసం