తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Banaras Trailer: మరో టైమ్‌ ట్రావెల్‌ మూవీ.. బనారస్‌ ట్రైలర్‌ చూశారా?

Banaras Trailer: మరో టైమ్‌ ట్రావెల్‌ మూవీ.. బనారస్‌ ట్రైలర్‌ చూశారా?

HT Telugu Desk HT Telugu

26 September 2022, 22:14 IST

google News
    • Banaras Trailer: మరో టైమ్‌ ట్రావెల్‌ మూవీ వచ్చేస్తోంది. పాన్‌ ఇండియా మూవీగా వస్తున్న బనారస్‌ ట్రైలర్‌ సోమవారం (సెప్టెంబర్‌ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బనారస్ మూవీలో జైద్ ఖాన్, సోనల్
బనారస్ మూవీలో జైద్ ఖాన్, సోనల్

బనారస్ మూవీలో జైద్ ఖాన్, సోనల్

Banaras Trailer: ఇది టైమ్‌ ట్రావెల్‌ సీజన్‌లా కనిపిస్తోంది. వరుసగా ఒకదాని తర్వాత మరొక సినిమా ఈ టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌లో బింబిసార, ఒకే ఒక జీవితం సినిమాలు ఈ కాన్సెప్ట్‌తో వచ్చి సూపర్‌ సక్సెస్‌ సాధించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. దీంతో బాక్సాఫీస్‌ దగ్గర సక్సెస్‌ సాధించాయి.

ఇక ఇప్పుడు మరో టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో బనారస్‌ మూవీ వస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ సోమవారం (సెప్టెంబర్‌ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సైంటిఫిక్‌ ఫిక్షన్‌ మూవీ ట్రైలర్‌ కూడా ఆసక్తికరంగా ఉంది. జైద్‌ ఖాన్‌, సోనల్‌ మోంటీరో నటించిన ఈ సినిమా వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ట్రైలర్‌ మొదట్లోనే హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ, అక్కడి సంస్కృతిని చూపించారు.

ఇక ఆ తర్వాత హీరో ఎంట్రీ ఉంటుంది. తన పేరు సిద్‌ అని, తానో ఆస్ట్రోనాట్‌, టైమ్‌ ట్రావెలర్‌ అని.. భవిష్యత్తు నుంచి వచ్చినట్లు చెబుతాడు. ఇదే ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌. నీ ఫ్యూచర్‌ హజ్బెండ్‌ నేనే అంటూ ప్రజెంట్‌లో ఉన్న హీరోయిన్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తాడు. అతని లవ్‌కు హీరోయిన్‌ కూడా ఓకే చెబుతుంది. అయితే ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది.

భవిష్యత్తు నుంచి వచ్చిన హీరో ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడు? హీరోయిన్‌తో తిరిగి కలుస్తాడా? వీళ్ల ప్రేమకు హ్యాపీ ఎండింగ్‌ ఉంటుందా అన్నది సస్పెన్స్‌. లవ్‌స్టోరీకి టైమ్‌ ట్రావెల్‌ అనే సైంటిఫిక్‌ యాంగిల్‌ను జోడించి తీసిని మూవీ ఇది. ఈ కొత్త కాన్సెప్టే మూవీపై ఆసక్తి రేపుతోంది. బనారస్‌ మూవీ పాన్‌ ఇండియాలో రిలీజ్‌ కానుంది.

తెలుగుతోపాటు అన్ని దక్షిణాది భాషలు, హిందీలోనూ నవంబర్‌ 4న బనారస్‌ రాబోతోంది. ఈ మూవీకి కథ, దర్శకత్వం జయతీర్థ అందించారు. తిలక్‌రాజ్‌ బల్లాల్‌ ఈ మూవీని తెరకెక్కించాడు.

తదుపరి వ్యాసం