Bimbisara OTT Release Date: బింబిసార ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా-bimbisara ott release date when and where to watch this historical movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bimbisara Ott Release Date When And Where To Watch This Historical Movie

Bimbisara OTT Release Date: బింబిసార ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా

Nelki Naresh Kumar HT Telugu
Aug 22, 2022 05:36 PM IST

Bimbisara OTT Release Date: ఈ ఏడాది టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌ల‌లో ఒక‌టిగా బింబిసార (Bimbisara)నిలిచింది. క‌ళ్యాణ్ రామ్ (Kalyanram)హీరోగా వ‌శిష్ట్ మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాల్లోనే యాభై కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ (Bimbisara OTT Release Date) ఎప్పుడంటే

క‌ళ్యాణ్ రామ్
క‌ళ్యాణ్ రామ్ (twitter)

Bimbisara OTT Release Date: బింబిసారతో కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా విడుద‌లై ఇరవై రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఏపీ తెలంగాణ లోనే యాభై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా డెబ్బై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ ఏడాది టాలీవుడ్ లో మోస్ట్ ఫ్రాఫిటబుల్ సినిమాల్లో ఒక‌టిగా బింబిసార నిలిచింది.

కాగా బింబిసార సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ (Bimbisara OTT Release Date) ఎప్పుడ‌న్న‌ది తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

బింబిసారడిజిట‌ల్ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమా సెప్టెంబ‌ర్ చివరి వారంలో జీ5లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. దసరా సెలవుల్లో ఓటీటీలో బింబిసార పండగ చేయనుంది.

థియేట‌ర్, ఓటీటీ రిలీజ్ మ‌ధ్య మినిమం ఆరు వారాల నుండి ఎనిమిది వారాల గ్యాప్ ఉండాల‌ని టాలీవుడ్ నిర్మాత‌లు ఇటీవ‌లే నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఒప్పందానికి క‌ట్టుబ‌డి ఆరు వారాల త‌ర్వాత బింబిసార‌ను ఓటీటీలో రిలీజ్ (Bimbisara OTT Release Date) చేయ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. బింబిసార డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్ దాదాపు ప‌దిహేను కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు చెబుతున్నారు. రిలీజ్ కు ముందే ఈ హక్కులను జీ5 సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం.

బింబిసార కథేమిటంటే...

అధికారమే లక్ష్యంగా జీవిస్తుంటాడు త్రిగ‌ర్తల సామ్రాజ్యాధిప‌తి బింబిసారుడు (కళ్యాణ్ రామ్). త‌న పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు రాక్ష‌సుడైనా, దేవుడైనా తానే అని విర్ర‌వీగుతుంటాడు. బింబిసారుడి మాట‌కు ఎవ‌రు ఎదురుచెప్పినా మ‌ర‌ణ‌దండ‌న విధిస్తుంటాడు. త‌న అధికారానికి అడ్డొస్తాడ‌ని సోద‌రుడు దేవ‌ద‌త్తుడిని (కళ్యాణ్ రామ్ )కూడా హతమార్చడానికి ప్రయత్నిస్తాడు. క‌న్నుప‌డిన ప్ర‌తి సామ్రాజ్యాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంటూ త్రిగ‌ర్త‌ల సామ్రాజ్యాన్ని ఏలుతుంటాడు బింబిసారుడు.

అన్న కుట్ర‌ల నుండి త‌ప్పించుకున్న దేవ‌ద‌త్తుడు ఓ మాయ ద‌ర్ప‌ణం స‌హాయంతో బింబిసారుడిని కాల‌చ‌క్రంలో 5వ శ‌తాబ్దం నుండి 20వ శ‌తాబ్దానికి పంపిస్తాడు. అక్కడ అతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనే పాయింట్ కు హిస్టారిక‌ల్ ఫాంట‌సీ అంశాల‌ను మేళవించి ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ మ‌ల్లిడి ఈ సినిమాను తెర‌కెక్కించారు. అతడికి ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. మొదటి ప్రయత్నంలోనే కమర్షియల్ సక్సెస్ దక్కించుకున్నాడు.

సీక్వెల్ రాబోతుంది...

బింబిసార సినిమాలో కేథ‌రిన్‌, సంయుక్త‌మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. బింబిసార‌కు సీక్వెల్ రాబోతున్న‌ది. రెండో భాగానికి సంబంధించి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. త్వరలోనే సెకండ్ పార్ట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలిసింది.

IPL_Entry_Point