Bimbisara OTT Release date: బింబిసార ఓటీటీ విడుదలపై ఆసక్తికర అప్డేట్..
Bimbisara OTT Release date: కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన బింబిసార సినిమా ఓటీటీ విడుదలపై మేకర్స్ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను ఇప్పుడప్పుడే ఓటీటీలో విడుదల చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు.
Bimbisara OTT Release date: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. కేథరిన్ తెస్రా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేసిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దగ్గర పడింది. చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఈ సినిమతోనే కళ కళలాడుతున్నాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ఆసక్తికర అప్డేట్ఇచ్చారు మేకర్స్.
Bimbisara OTT Release date: బింబిసార ఓటీటీలోకి ఇప్పుడప్పుడే రాదని, కనీసం సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత గాని ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో బింబిసార చిత్రబృందానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సక్సెస్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను నిర్మించిన ఎఫ్3 సినిమాను 50 రోజుల పాటు థియేటర్లలోనే అడించామని, ఆ తర్వాత ఓటీటీలో విడుదల చేశామని పేర్కొన్నారు. అదే విధంగా బింబిసార చిత్రాన్ని కూడా 50 రోజుల తర్వాత విడుదల చేయాలని సదరు సినిమా మేకర్స్‌ను విజ్ఞప్తి చేశారు.
దీంతో బింబిసార నిర్మాతల్లో ఒకరైన హీరో కల్యాణ్ రామ్ అందుకుని ఈ సినిమా అంత త్వరగా ఓటీటీలోకి రాదని స్పష్టం చేశారు. ఇది థియేటర్లలో ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని, కనీసం 50 రోజులు పూర్తవందనే స్మాల్ స్క్రీన్‌పై విడుదల కాదని తెలిపారు. ప్రస్తుతం బింబిసార థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో వసూళ్ల పరంగానూ దూసుకెళ్తోంది. దీంతో ఓటీటీలవైపు మేకర్స్ మొగ్గు చూపించకుండా తాము వేసుకున్న ప్రణాళిక ప్రకారమే థియేటర్లలోనే ఆడించాలని నిర్ణయించుకున్నారు.
గత కొంతకాలం తెలుగు సినిమాలు థియేటర్లలో వరుసగా పరాజయం చవిచూడటం, వసూళ్ల రాక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజామాన్యాలు నష్టాలు చవిచూస్తున్నారు. దీంతో ఆగస్టు 1 నుంచి షూటింగ్‌ల బంద్‌కు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఓటీటీలో కనీసం 10 వారాల తర్వాత విడుదల చేయాలని చర్చలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ విషయం ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాలేదు. ఎందుకంటే కొంతమంది ఈ ప్రతాపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఓటీటీ విడుదలకు 10 వారాలు కాకుండా 6 నుంచి 8 వారాల గ్యాప్ సరిపోతుందని పట్టుబడుతున్నారు.
ఇదిలా ఉంటే సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో కేథరిన్ థెరిసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు. చింతరామన్ భట్ ఈ చిత్రానికి పాటలు అందించగా.. ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తూ నటించారు. మల్లిడి వశిష్ట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వరినా హుస్సేన్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ రాజ్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. తమ్మి రాజు ఎడిటింగ్ చేశారు.
సంబంధిత కథనం
టాపిక్