Balakrishna Boyapati BB4: బాలకృష్ణ, బోయపాటి మూవీకి క్రేజీ టైటిల్, క్యాప్షన్.. ఇక శివ తాండవమే
16 October 2024, 9:02 IST
- Balakrishna Boyapati BB4: బాలకృష్ణ, బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమాకు అంతకుమించిన క్రేజీ టైటిల్, క్యాప్షన్ పెట్టారు. ఈ టైటిల్ తో ఇక థియేటర్లలో శివ తాండవమే అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
బాలకృష్ణ, బోయపాటి మూవీకి క్రేజీ టైటిల్, క్యాప్షన్.. ఇక శివ తాండవమే
Balakrishna Boyapati BB4: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మరో క్రేజీ మూవీతో అభిమానుల ముందుకు వస్తున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు అఖండ 2 - తాండవం అనే టైటిల్, పవర్ ఫుల్ క్యాప్షన్ పెట్టారు. తెలుగులోనే కాదు ఇండియన్ సినిమాలోనే క్రేజీ కాంబినేషన్ అయిన బాలయ్య, బోయపాటి నాలుగో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇక ఇప్పుడు నాలుగో సినిమాకు అఖండ 2 అనే టైటిల్ పెట్టడంతోనే సగం సక్సెస్ సాధించారని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ల చివరి మూవీ అఖండ అన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. చివరికి హిందీలో డబ్ అయి అక్కడ కూడా సక్సెస్ అందుకుంది.
అలాంటి సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 - తాండవం అనే టైటిల్ పెట్టారంటే ఇక మూవీ ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ అఖండ 2 పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది. వీళ్ల కాంబినేషన్ లో రాబోతున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇదే.
అదిరిపోయిన టైటిల్ పోస్టర్
బాలకృష్ణ, బోయపాటి నాలుగో మూవీ టైటిల్ రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది. హిమాలయాల బ్యాక్‌డ్రాప్ లో ఓ ఆధ్యాత్మిక ఫీల్ కలిగేలా ఈ పోస్టర్ రూపొందించారు. అఖండ 2 మూవీకి తాండవం అనే క్యాప్షన్ పెట్టారు. శివలింగం, డమరుకంలాంటి వాటిని కూడా ఈ పోస్టర్ లో చూడొచ్చు.
వీటన్నింటిని బట్టి చూస్తుంటే.. అఖండ 2 ఓ స్పిరిచువల్ ఫీలింగ్ తోపాటు బాలయ్య మార్క్ మాస్ జాతర కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూవీ కోసం బోయపాటి ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ అఖండ 2 మూవీని చాలా గ్రాండ్ గా తీయబోతున్నారు.
రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ కాగా.. తమ్మిరాజు ఎడిటర్ గా ఉన్నారు. తమన్ మ్యూజిక్ అందించనున్నాడు. ప్రస్తుతం సీక్వెల్స్ టైమ్ నడుస్తున్న వేళ మోస్ట్ పవర్ ఫుల్ సీక్వెల్ గా ఈ అఖండ 2 నిలవబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అఖండ మూవీ గురించి..
అఖండ సినిమా 2021, డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద రూ. 85 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండో తెలుగు సినిమాగా నిలిచింది. బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.
తన కుటుంబానికి ఎదురైన ఆపదను అఖండ అనే అఘొరా ఎలా ఎదురించాడనే పాయింట్‌కు యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ సినిమాను తెరకెక్కించాడు. అఘోరా పాత్రలో బాలకృష్ణ తన నటనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ విలన్‌గా నటించిన ఈ సినిమాలో ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్‌గా కనిపించింది.