తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Melody From Ori Devuda: విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' చిత్రం నుంచి అదిరిపోయే మెలోడీ.. అద్భుతంగా పాడిన సిద్ శ్రీరామ్

Melody from Ori Devuda: విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' చిత్రం నుంచి అదిరిపోయే మెలోడీ.. అద్భుతంగా పాడిన సిద్ శ్రీరామ్

28 September 2022, 11:47 IST

google News
    • First Single From Ori Devuda: విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఓరి దేవుడా. ఈ సినిమా నుంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్ విడుదలైంది. ఔననవా అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు.
ఓరి దేవుడా చిత్రం నుంచి ఔననవా సాంగ్ రిలీజ్
ఓరి దేవుడా చిత్రం నుంచి ఔననవా సాంగ్ రిలీజ్

ఓరి దేవుడా చిత్రం నుంచి ఔననవా సాంగ్ రిలీజ్

Avunanava Song from Ori Devuda: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. తన చిత్రాలతోనే కాదు.. యాటీట్యూడ్‌తోనూ చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ ఏడాది అతడు నటించిన అశోక వనంలో అర్జున కల్యాణం చిత్రం మంచి హిట్‌ను అందుకుంది. త్వరలో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే ఓరి దేవుడా. ఈ సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా చేశారు. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్ వచ్చేసింది.

ఔననవా.. అంటూ సాంగే ఈ మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఏమని అనాలని తోచని క్షణాలివి.. ఏ మలుపు ఎదురయ్యే పయనమిదా.. ఆమని నువ్వేనని నీ జత చేరాలని.. ఏ తలపో మొదలయ్యే మౌనమిదా.. ఔననవా ఔననవా అంటూ సాగే క్యూట్ రొమాంటిక్ మెలోడీ శ్రోతలను అలరిస్తోంది. లియోన్ జేమ్స్ ఈ పాటకు స్వరాలు సమకూర్చగా.. సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు. రామజోగయ్య శాస్త్రీ ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు.

ఈ సినిమా లాంచ్ అయినప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రసాద్ వీ పొట్లూరి ఈ చిత్రానికి నిర్మాత వ్యవహరిస్తున్నారు. అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్టార్ హీరో వెంకటేశ్ ఇందులో దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీపావళి సందర్భంగా అక్టోబరు 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. లియోన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

తదుపరి వ్యాసం