Vishwak Sen | విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ద‌ర్శ‌కుడు మారిపోయాడు...కారణం ఏమై ఉంటుంది?-viswak sen das ka dhamki movie shooting begins ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Viswak Sen Das Ka Dhamki Movie Shooting Begins

Vishwak Sen | విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ద‌ర్శ‌కుడు మారిపోయాడు...కారణం ఏమై ఉంటుంది?

Nelki Naresh HT Telugu
Mar 17, 2022 06:55 AM IST

విశ్వ‌క్‌సేన్ హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ‘దాస్ కా ధ‌మ్కీ’ చిత్రం ఇటీవ‌లే ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలు నిర్వహించి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొచ్చేలోపు దర్శకుడు నరేష్ కుప్పిలి ఈ సినిమా నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో విశ్వక్ సేన్ దర్శకత్వ బాధ్యతల్ని స్వీకరించారు.

విశ్వ‌క్‌సేన్
విశ్వ‌క్‌సేన్ (twitter)

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌క‌త్వంలో (‘పాగ‌ల్’ ఫేమ్‌) రూపొందుతున్న ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఇటీవ‌లే మొద‌లైంది. ‘పాగ‌ల్’ చిత్రానికి డివైడ్ టాక్ వ‌చ్చినా వ‌సూళ్లు మాత్రం ప‌ర్వాలేద‌నిపించాయి. అందుకే ద‌ర్శ‌కుడు న‌రేష్ కుప్పిలికి విశ్వ‌క్ సేన్ మ‌రో అవ‌కాశాన్ని ఇచ్చిన‌ట్లు వార్త‌లొచ్చాయి. గ‌త వారం ‘దాస్ కా ధమ్కీ’ పూజా కార్య‌క్ర‌మాల‌ను లాంఛ‌నంగా నిర్వ‌హించారు. ఈ బుధ‌వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టిన‌ట్లు కొత్త పోస్ట‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్స్ లో ద‌ర్శ‌కుడిగా న‌రేష్ కుప్పిలి బ‌దులు హీరో విశ్వ‌క్ సేన్ పేరు క‌నిపించింది.వారం రోజుల్లోనే ద‌ర్శ‌కుడు న‌రేష్ కుప్పిలి ఈ సినిమా నుంచి ఎందుకు త‌ప్పుకున్నాడ‌నేది ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విశ్వ‌క్‌సేన్‌,న‌రేష్ కుప్పిలి మ‌ధ్య ఏం జ‌రిగింద‌నేది ఆస‌క్తిని రేకెత్తిస్తున్న‌ది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ తోనే ద‌ర్శ‌కుడు త‌ప్పుకున్నాడా?మ‌రేదైనా కార‌ణం ఉందా అని చ‌ర్చించుకుంటున్నారు. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. కృష్ణ‌దాస్ అనే యువ‌కుడి క‌థ‌తో మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ‘పాగ‌ల్’ త‌ర్వాత మ‌రోసారి విశ్వ‌క్ సేన్‌,నివేథా పేతురాజ్ ఈ సినిమాలో జంట‌గా న‌టిస్తున్నారు. విశ్వ‌క్‌సేన్ తండ్రి క‌రాటే రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ క‌థ‌ను అందిస్తున్నారు. విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించిన ‘అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం’,‘ఓరీ దేవుడా’ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.

 

IPL_Entry_Point