Celebrities Condolences to Indira Devi: ఇందిరమ్మ మృతి తీవ్రంగా కలచివేసింది.. మహేశ్ బాబు కుటుంబానికి మెగాస్టార్ సానుభూతి
28 September 2022, 10:19 IST
- Celebrities Condolences to Indira devi: మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మృతిపై టాలీవుడ్ సెలబ్రెటీలు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ట్విటర్ వేదికగా భగవంతుడిని ప్రార్థించారు.
ఇందిరా దేవి మృతిపై ప్రముఖుల సంతాపం
Celebrities Heartfelt Condolences to Indira Devi: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి ఈ రోజు ఉదయం మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో ఆసుపత్రిలో కన్నుమూసిన ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరా దేవి మరణవార్త తనను ఎంతో తీవ్రంగా కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా స్పందించారు. సూపర్ స్టార్ కృష్ణ మహేశ్ బాబుకు, వారి కుటుంబ సభ్యులదరికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
"శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను." అని చిరంజీవి ట్విటర్ ద్వారా తెలిపారు.
"ప్రముఖ నటులు, సూపర్ స్టార్ కృష్ణగారి సతీమణి ఇందిరాదేవి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి." అని నారా లోకేశ్ తెలిపారు.
"ఇందిరమ్మ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూన్నా" అని ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు.
"సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబంలో జరిగిన విషాదాల వల్ల నేను చాలా కృంగిపోయాను. శ్రీమతి ఇందిరమ్మ గారి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ కుటుంబం పట్ల అమితమైన అబిమానం. ఇందిరమ్మగారి పట్ల అత్యుతున్న గౌరవం ఎల్లవేళలా నాకుంటుంది." అని శ్రీనువైట్ల తెలిపారు.