Mahesh Babu Mother Passes Away: టాలీవుడ్‌లో మరో విషాదం.. మహేశ్ బాబుకు మాతృవియోగం-superstar mahesh babu mother indira devi passes away ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu Mother Passes Away: టాలీవుడ్‌లో మరో విషాదం.. మహేశ్ బాబుకు మాతృవియోగం

Mahesh Babu Mother Passes Away: టాలీవుడ్‌లో మరో విషాదం.. మహేశ్ బాబుకు మాతృవియోగం

Maragani Govardhan HT Telugu
Sep 28, 2022 08:11 AM IST

Krishna Wife Indira Devi Died: సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) తల్లి ఇందిరా దేవి(Indira Devi) కన్నుమూశారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం నాడు తుది శ్వాస విడిచారు. సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

<p>మహేశ్ బాబుకు మాతృ వియోగం</p>
మహేశ్ బాబుకు మాతృ వియోగం (Twitter)

Mahesh babu Mother Indira Devi Passes Away: టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే రెబల్ స్టార్ కృష్ణంరాజు కాలం చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు చలనచిత్ర సీమలో మరో చేదు ఘటన చోటుచేసుకుంది. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

బుధవారం తెల్లవారుజామున ఇందిరా దేవి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త విన్న సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది కృష్ణ కుటుంబంలో జరిగిన రెండో విషాదమిది. జనవరిలో పెద్ద కుమారుడు రమేశ్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో మహేశ్ బాబు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు హైదరాబాద్ పద్మాలయ స్టూడియోస్‌లో ఇందిరా దేవి పార్థివ దేహాన్నిసందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇందిరా దేవి.. సూపర్ స్టార్ కృష్ణకు మొదటి భార్య. వీరిద్దరికీ రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శి అనే ఐదుగురు పిల్లలున్నారు. వీరిలో రమేశ్ బాబు, మహేశ్ బాబు టాలీవుడ్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోగా.. ప్రియదర్శి భర్త.. సుధీర్ బాబు కూడా హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం