Anupama Parameshwaran: కారులో ఆ బోల్డ్ సీన్ చేయడం ఇబ్బందిగానే అనిపించింది: అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
26 March 2024, 16:33 IST
- Anupama Parameshwaran on Tillu Square: టిల్లూ స్క్వేర్ మూవీలో సిద్దూ జొన్నలగడ్డతో రెచ్చిపోయి నటించిన అనుపమ పరమేశ్వరన్.. ఆ బోల్డ్ సీన్స్ చేయడంపై స్పందించింది. చాలా ఇబ్బందిగా అనిపించిందని చెప్పింది.
కారులో ఆ బోల్డ్ సీన్ చేయడం ఇబ్బందిగానే అనిపించింది: అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Anupama Parameshwaran on Tillu Square: బబ్లీ గర్ల్, సాంప్రదాయంగా ఉండే అమ్మాయిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ టిల్లూ స్క్వేర్ మూవీలో ఒక్కసారిగా తన మరో రూపం చూపించేసింది. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్, సాంగ్స్ లోనే సిద్దూ జొన్నలగడ్డతో ఘాటు రొమాన్స్ సీన్లలో నటించింది. ఈ బోల్డ్ సీన్స్ పై తాజాగా అనుపమ స్పందించింది.
ఆ సీన్లు చేయడం ఇబ్బందే కానీ..
రెండేళ్ల కిందట వచ్చిన డీజే టిల్లూ మూవీకి సీక్వెల్ గా వస్తున్న టిల్లూ స్క్వేర్ లో అనుపమ కాస్త బోల్డ్ గానే కనిపించింది. ట్రైలర్ లో ఓ కారులో సిద్దూతో కలిసి ఘాటు లిప్ లాక్ సీన్లోనూ నటించింది. దీనిపై ఈ మధ్య ఆమె మాట్లాడుతూ.. "రొమాన్స్ సీన్లలో నటించడం అన్నది అంత సులువు కాదు. చుట్టూ వంద మంది ఉంటారు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
మొత్తం యూనిట్ చూస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు రొమాన్స్ చేసుకోవడం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రతి ఒక్కరూ కారులో రొమాన్స్ సీన్ గురించి మాట్లాడుతున్నారు. నా కాళ్లపై రెండు గాయాలు అయ్యాయి. దాని నుంచి బయటపడటం చాలా కష్టం. అది చాలా అసౌకర్యమైన పరిస్థితి. అంత సులువు కాదు. అలాంటి పరిస్థితుల్లో రొమాన్స్ కూడా ఈజీ కాదు. మేము నటిస్తూ ఆ సీన్ ను పండించాలి. అది అస్సలు సులువైన పని కాదు. చూసేవాళ్లకు మేము ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది కానీ అది అలా కాదు" అని అనుపమ చెప్పింది.
ఇక ఈ మధ్యే మూవీలోని సాంగ్ రిలీజ్ సందర్భంగా కూడా అనుపమ ఈ సీన్స్ చేయడంపై స్పందించింది. బిర్యానీ ఇష్టమని చెప్పి రోజూ అదే తినలేం కదా.. అలాగే ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేయకుండా ఇలాంటి భిన్నమైన పాత్రలు ట్రై చేస్తున్నట్లు ఆమె చెప్పింది.
టిల్లూ స్క్వేర్ ప్రీరిలీజ్ బిజినెస్
టిల్లూ స్క్వేర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. డీజే టిల్లు హిట్ కావడంతో సీక్వెల్ మరింత అలరిస్తుందన్న ఆశతో ప్రేక్షకులు ఉన్నారు. అందులోనూ గతేడాది సెప్టెంబర్ నుంచీ టిల్లూ స్క్వేర్ రిలీజ్ ఊరిస్తూ వస్తోంది. ఎన్నోసార్లు వాయిదా పడి మొత్తానికి ఈ శుక్రవారం (మార్చి 29) రిలీజ్ కాబోతోంది. అయితే మూవీపై ఉన్న అంచనాల నేపథ్యంలో సినిమా మంచి ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా రూ.32 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. సిద్దూ జొన్నలగడ్డలాంటి హీరోకి ఇది చాలా పెద్ద మొత్తమే. ఇదే ఎక్కువ అనుకుంటే.. నెట్ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ హక్కులను ఏకంగా రూ.35 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. టిల్లూ స్క్వేర్ పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ భారీ బిజినెస్ సాధ్యమైంది.
బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మాత్రం టిల్లూ స్క్వేర్ మంచి ఓపెనింగ్స్ సాధించాల్సిందే. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ టిల్లూ స్క్వేర్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తెరకెక్కించాయి. ఈ సినిమాకు సెన్సార్ యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. కేవలం రెండు గంటల రన్ టైమ్ తోనే టిల్లూ స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాపిక్