తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Agent Ott: అఖిల్ ‘ఏజెంట్’ సినిమా ఓటీటీ విషయంలో మరో ట్విస్ట్!

Agent OTT: అఖిల్ ‘ఏజెంట్’ సినిమా ఓటీటీ విషయంలో మరో ట్విస్ట్!

09 July 2024, 15:32 IST

google News
    • Agent OTT: ఏజెంట్ సినిమా థియేటర్లలో రిలీజై సంవత్సరం దాటిపోయింది. అయినా ఇంకా ఓటీటీలోకి రాలేదు. అయితే, తాజాగా ఈ మూవీ ఓటీటీ విషయంలో మరో ట్విస్ట్ ఎదురైంది. అదేంటంటే..
Agent OTT: అఖిల్ ‘ఏజెంట్’ సినిమా ఓటీటీ విషయంలో మరో బిగ్ ట్విస్ట్!
Agent OTT: అఖిల్ ‘ఏజెంట్’ సినిమా ఓటీటీ విషయంలో మరో బిగ్ ట్విస్ట్!

Agent OTT: అఖిల్ ‘ఏజెంట్’ సినిమా ఓటీటీ విషయంలో మరో బిగ్ ట్విస్ట్!

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయినా వార్తల్లో మాత్రం తరచూ నిలుస్తూనే ఉంది. ఓటీటీ రిలీజ్‍పై జరుగుగుతున్న జాప్యం, ఉత్కంఠే ఇందుకు కారణాలుగా ఉన్నాయి. ఈ చిత్రం గతేడాది ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. సుమారు 14 నెలలు అవుతున్నా ఈ చిత్రం ఇంకా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రాలేదు. ఓసారి అధికారిక ప్రకటన వచ్చినా.. కూడా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టలేదు. ఏజెంట్ ఓటీటీ వ్యవహారం చాలా మలుపులు తిరిగింది. అయితే, ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓటీటీ విషయంలో మరో బిగ్ ట్విస్ట్ ఎదురైంది. దీంతో మరోసారి సందిగ్ధత పెరిగింది.

పోస్టులు డిలీట్

ఏజెంట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఓ సందర్భంలో గతేడాది సెప్టెంబర్‌లో స్ట్రీమింగ్ డేట్‍ను కూడా ప్రకటించేసింది. కానీ స్ట్రీమింగ్‍కు మాత్రం తీసుకురాలేదు. ఆ తర్వాత మరికొన్ని సార్లు త్వరలో వస్తుందంటూ ఏజెంట్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది సోనీ లివ్. అయితే, తాజాగా గతంలో ఏజెంట్ గురించి చేసిన ట్వీట్లను సోనీ లివ్ ఇప్పుడు డిలీట్ చేసింది.

ఏజెంట్ సినిమా ఈనెలలో స్ట్రీమింగ్‍కు వస్తుందని కూడా రూమర్లు వచ్చాయి. అయితే, ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఈ చిత్రం గురించిన ట్వీట్లు డిలీట్ చేయడంతో మళ్లీ కన్‍ఫ్యూజన్ పెరిగిపోయింది.

ప్లాట్‍ఫామ్ మారుతుందా?

ఏజెంట్‍కు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను సోనీ లివ్ తొలగించడంతో కొత్త రూమర్లు వస్తున్నాయి. వేరే ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఈ సినిమా హక్కులను తీసుకొని ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా ఏజెంట్ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. మరి సోనీ లివ్ దగ్గరే రైట్స్ ఉన్నాయా.. చేతులు మారాయా అనేది చూడాలి.

ఏజెంట్ సినిమా ఓటీటీ ఆలస్యానికి ఆర్థిక పరమైన విషయాలు కారణమని మొదట్లో రూమర్లు వచ్చాయి. అయితే, అలాంటిదేమీ లేదని నిర్మాత చెప్పారు. సోనీ లివ్‍కు తాము ఇచ్చేశామని, వారి ఇష్టమని వెల్లడించారు. అయితే, ఓటీటీ కోసం స్పెషల్ వెర్షన్ వస్తుందని, అందుకే ఆలస్యమంటూ కూడా కొంతకాలం పుకార్లు వినిపించాయి. ఎప్పటికప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రావటం ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లలో రిలీజైన 14 నెలలు అయినా ఇంకా స్ట్రీమింగ్‍కు రాలేదు. మరి ఎప్పుడు వస్తుందో చూడాలి.

ఒరిజినల్ తెలుగు వెర్షన్ ఇంకా ఓటీటీలో రాకపోయినా.. ఏజెంట్ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ మాత్రం టీవీ ఛానెల్‍లోకి త్వరలో రానుంది. ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేయనున్నట్టు గోల్డ్ మైన్స్ టీవీ ఛానెల్ ఇటీవలే వెల్లడించింది.

ఏజెంట్ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రంతోనే తెలుగులో తెరంగేట్రం చేశారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ మూవీలో ఓ మెయిన్ రోల్‍లో నటించారు. డినో మోరియా, విక్రమ్ జీత్ విర్క్, డెంజిలన్ స్మిత్. సంపత్ రాజ్, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, పోసాని కృష్ణమురళి ఈ మూవీలో కీరోల్స్ చేశారు. స్పెషల్ సాంగ్‍లో ఊర్వశి రౌతేలా చిందేశారు.

ఏజెంట్ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రాంబ్రహ్మం సుంకర నిర్మించారు. సుమారు రూ.85 కోట్ల బడ్జెట్‍తో రూపొందించిన ఈ చిత్రానికి రూ.10కోట్లలోపే కలెక్షన్లు వచ్చాయి. భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి హిప్‍హాప్ తమిళ మ్యూజిక్ ఇచ్చారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం