Agent TV Premier: ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చేస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్.. ఎప్పుడంటే?
Agent TV Premier: అఖిల్ అక్కినేని నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏజెంట్ ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తోంది. అయితే అది తెలుగులో కాదు.. కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే రానుంది.
Agent TV Premier: టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని భారీ ఆశలు పెట్టుకున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత దారుణంగా బోల్తా పడిందో మనకు తెలుసు కదా. ఈ మూవీ నిర్మాతకు కోట్లలో నష్టాలను మిగిల్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను సోనీ లివ్ దక్కించుకున్నా.. ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ఈ మూవీ నేరుగా టీవీలోనే టెలికాస్ట్ కానుంది.
టీవీలోకి ఏజెంట్ మూవీ
సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఏజెంట్ మూవీ అఖిల్ కెరీర్లో డిజాస్టర్ గా మిగిలిపోయింది. భారీ బడ్జెట్, స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్, కళ్లు చెదిరే స్టంట్లు.. అన్నింటికీ మించి భారీ అంచనాల మధ్య రిలీజైనా ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఏడాదికిపైగా అభిమానులు వేచి చూస్తున్నారు.
సోనీ లివ్ మూవీ హక్కులను దక్కించుకున్నా.. ఇప్పటికీ ఏవో అడ్డంకుల వల్ల స్ట్రీమింగ్ కాలేదు. అయితే తాజాగా ఈ ఏజెంట్ హిందీ వెర్షన్ మాత్రం టీవీలోకి వచ్చేస్తోంది. త్వరలోనే గోల్డ్‌మైన్స్ టీవీలో టెలికాస్ట్ కానుంది. అయితే కచ్చితంగా ఏ రోజున వస్తుందన్నది మాత్రం ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. మరోవైపు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు.
ఇక వచ్చేస్తోంది అంటూ గతేడాది జూన్ నెల నుంచి ఊదరగొడుతూనే ఉన్నా ఇప్పటికీ డిజిటల్ స్ట్రీమింగ్ పై ఎలాంటి సమాచారం లేదు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ ఏజెంట్ మూవీలో అఖిల్ తోపాటు మమ్ముట్టి, సాక్షి వైద్య, డీనో మోరియాలాంటి స్టార్లు నటించారు. హిప్‌హాప్ తమిళ మ్యూజిక్ అందించిన ఏజెంట్ సాంగ్స్ హిట్ అయినా.. సినిమా మాత్రం బోల్తా కొట్టింది.
ఏజెంట్ మూవీ ఏంటి?
ఏజెంట్ హీరోగా అఖిల్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా. కానీ ఔట్‌డేటెడ్ స్టోరీలైన్ ఆపరేషన్ మిస్ ఫైర్ అయ్యింది. అఖిల్ కష్టం వృథాగా మారింది. గతంలో చేసిన సాఫ్ట్ క్యారెక్టర్స్‌కు పూర్తి భిన్నంగా ఇందులో యాక్షన్ రోల్‌లోఎనర్జిటిక్‌గా అఖిల్ కనిపించాడు.. ఈ పాత్ర కోసం మేకోవర్ అయిన తీరు, అతడి లుక్ బాగున్నాయి. అఖిల్‌పై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి.
మమ్ముట్టి రోల్ రొటీన్‌గా ఉంది. కేవలం సౌత్‌లో బజ్ కోసం అతడిని తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. సాక్షివైద్యను పాటల కోసమే ఈ సినిమాలో ఉంది. స్టైలిష్ విలన్‌గా డినో మారియా యాక్టింగ్‌లో ఎలాంటి కొత్తదనం లేదు. సంపత్‌రాజ్, మురళీశర్మతో పాటు చాలా మంది నోటెడ్ ఆర్టిస్ట్‌లు ఉన్నా ఎవరికి కథలో ఇంపార్టెన్స్ లేదు.
సినిమాలో చాలా వరకు లాజిక్‌లెస్‌గా సాగుతుంది. రా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్ అన్ని తూతూ మంత్రంగా సాగుతాయి. వాటిలో సీరియస్‌నెస్ కనిపించదు. మరోవైపు అఖిల్ అక్కినేని ప్రస్తుతం అనిల్ కుమార్ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న మూవీలో నటిస్తున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.