Agent OTT Release Date: ఏజెంట్ ఓటీటీ రిలీజ్ తేదీపై కీలకమైన అప్‌డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్
Agent OTT Release Date: ఏజెంట్ ఓటీటీ రిలీజ్ తేదీపై కీలకమైన అప్‌డేట్ ఇచ్చాడు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Agent OTT Release Date: ఈమధ్య కాలంలో ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూసినంతగా మరే మూవీ కోసం చూడలేదేమో. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నా.. ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీలోకి మాత్రం రాలేదు. హిట్ సినిమాలే నెల రోజుల్లోపు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై వచ్చేస్తుండగా.. ఏజెంట్ ఎందుకు ఆలస్యమవుతుందో అర్థం కాక ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు.
అఖిల్ అక్కినేని నటించిన ఈ మూవీ.. భారీ హైప్ మధ్య రిలీజై దారుణంగా బోల్తా పడింది. ఏప్రిల్ 28న మూవీ రిలీజ్ కాగా.. మే 19నే డిజిటల్ ప్రీమియర్ ఉంటుందని సోనీ లివ్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు జులై వచ్చినా సినిమాపై ఎలాంటి అప్‌డేట్ లేదు. అయితే తాజాగా మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర దీనిపై స్పందించాడు. నిజానికి ఓటీటీ వ్యూయర్స్ కోసం సినిమాను ఎడిట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
వీటిని ప్రొడ్యూసర్ ఖండించాడు. ఓటీటీ ప్రేక్షకుల కోసం ఎలాంటి ఎడిటింగ్ చేయడం లేదని, మూవీని రిలీజ్ చేయడం పూర్తి సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశాడు. అంటే ఏజెంట్ ఓటీటీ రిలీజ్ ఆలస్యానికి పూర్తి బాధ్యత సోనీలివ్ ఓటీటీదే అని ప్రొడ్యూసర్ తేల్చేశాడు. దీంతో ఇన్నాళ్లూ ఏజెంట్ ఎడిటెడ్ వెర్షన్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
పైగా ప్రొడ్యూసర్ కూడా ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వకపోవడంతో వాళ్లు ఉసూరుమన్నారు. మరి సోనీలివ్ ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తుందన్నది తెలియడం లేదు. జూన్ 23న వస్తుందని భావించినా.. అదీ జరగలేదు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ స్పై థ్రిల్లర్ మూవీలో సాక్షి వైద్య ఫిమేల్ లీడ్ గా చేసింది. అఖిల్ ఈ మూవీ కోసం ఎంతో శ్రమించినా.. చివరికి ఫలితం మాత్రం దక్కలేదు.
సంబంధిత కథనం