తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Ott: ట్రెండింగ్‍లో టాప్‍కు దూసుకెళ్లిన యానిమల్.. సలార్‌తో పోటాపోటీ

Animal OTT: ట్రెండింగ్‍లో టాప్‍కు దూసుకెళ్లిన యానిమల్.. సలార్‌తో పోటాపోటీ

28 January 2024, 18:15 IST

google News
    • Animal OTT Trending: యానిమల్ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రస్తుతం ట్రెండింగ్‍లో టాప్‍లోకి వచ్చింది. సలార్ మూవీతో యానిమల్ పోటీ పడుతోంది.
Animal vs Salaar OTT: ట్రెండింగ్‍లో టాప్‍కు దూసుకెళ్లిన యానిమల్
Animal vs Salaar OTT: ట్రెండింగ్‍లో టాప్‍కు దూసుకెళ్లిన యానిమల్

Animal vs Salaar OTT: ట్రెండింగ్‍లో టాప్‍కు దూసుకెళ్లిన యానిమల్

Animal vs Salaar on OTT: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన యానిమల్ సినిమా భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ వైలెంట్ బోల్డ్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్ చిత్రం సుమారు రూ.910 కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సత్తాచాటుతోంది.

యానిమల్ సినిమా జనవరి 26వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ యానిమల్ మూవీ అదరగొడుతోంది.

యానిమల్ సినిమా నెట్‍ఫ్లిక్స్‌లో ఇండియా ట్రెండింగ్‍లో ప్రస్తుతం టాప్‍కు వచ్చేసింది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్‌ మూవీతో పోటీ పడుతోంది. యానిమల్ హిందీ వెర్షన్ ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్‍కు వచ్చింది. ఈ విషయాన్ని యానిమల్ టీమ్ ట్వీట్ చేసింది.

సలార్ వర్సెస్ యానిమల్

సలార్ సినిమా జనవరి 20వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. అప్పటి నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో సలార్ టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఇండియాతో పాటు చాలా దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. జనవరి 26న నెట్‍ఫ్లిక్స్‌లో యానిమల్ అడుగుపెట్టింది. దీంతో నెట్‍ఫ్లిక్స్‌లో యానిమల్ వర్సెస్ సలార్ పోటాపోటీగా జరుగుతోంది. ప్రస్తుతం ఇండియాలో యానిమల్ ట్రెండింగ్‍లో టాప్‍లోకి వచ్చింది.

కాగా, సలార్ సినిమా చాలా దేశాల్లో టాప్-10లో ట్రెండ్ అవుతోంది. నెట్‍ఫ్లిక్స్‌లోకి వచ్చాక గ్లోబల్‍గా సలార్ ఫుల్ పాపులర్ అయింది. సలార్ గోస్ గ్లోబల్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. గ్లోబల్‍గా ఇప్పటికీ నాన్-ఇంగ్లిష్ విభాగంలో టాప్-3లో ట్రెండ్ అవుతోంది సలార్. అయితే, నెట్‍ఫ్లిక్స్‌లో ఇండియాలో సలార్‌కు యానిమల్ గట్టి పోటీని ఇస్తోంది. సలార్ ప్రస్తుతం రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. సలార్ హిందీ వెర్షన్ కూడా నెట్‍ఫ్లిక్స్‌లోకి వస్తే.. ఈ మూవీ మరింత ఆధిపత్యాన్ని చూపించే అవకాశం ఉంటుంది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా థియేటర్లలో బ్లాక్‍బాస్టర్ అయింది. భారీ కలెక్షన్లను సాధించి రణ్‍బీర్ కపూర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‍గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. ఈ మూవీలో రణ్‍బీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా నటించారు. బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి డిమ్రి, శక్తి కపూర్, బబ్లూ పృథ్విరాజ్ కీలకపాత్రలు పోషించారు.

యానిమల్ మూవీని టీ-సిరీస్ ఫిల్స్మ్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ పతాకాలపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ ఖేతానీ నిర్మించారు. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‍తో ఈ సినిమా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా రూ.917 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బ్లాక్‍బాస్టర్ అయింది. ఈ మూవీకి హర్షవర్దన్ రామేశ్వర్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది. యానిమల్ మూవీకి సీక్వెల్‍గా యానిమల్ పార్క్ వస్తుందని ఇప్పటికే మేకర్స్ ఫిక్స్ చేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం