తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anchor Jhansi: నన్ను చాలా మోసం చేశారు: యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్

Anchor Jhansi: నన్ను చాలా మోసం చేశారు: యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

08 May 2023, 21:09 IST

    • Anchor Jhansi: నన్ను చాలా మోసం చేశారు అంటూ యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు రావాల్సిన క్రెడిట్ ఇవ్వలేదని ఆమె వాపోయింది. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
యాంకర్ ఝాన్సీ
యాంకర్ ఝాన్సీ

యాంకర్ ఝాన్సీ

Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ.. ఒకప్పుడు తెలుగు ఛానెల్స్ లోని టాప్ యాంకర్స్ లో ఒకరు. జెమిని టీవీలో ఎన్నో షోలతో ఆమె పేరు సంపాదించుకుంది. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ఉంటుంది. అలాంటి యాంకర్ తనను చాలా మంది మోసం చేశారంటూ చెప్పడం విశేషం. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

ఒకప్పుడు సుమ, ఉదయభానులాంటి యాంకర్లతో పోటీ పడిన ఆమె.. క్రమంగా బుల్లితెరకు దూరమైంది. యాంకరింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేసుకున్న ఝాన్సీ.. ఎన్నో ఏళ్ల పాటు టీవీని ఏలింది. అయితే ఇన్నాళ్ల తర్వాత ఆమె తన యాంకరింగ్ కెరీర్ ను గుర్తు చేసుకోవడం, ఎంతోమంది చేతుల్లో తాను మోసపోయానని చెప్పడం షాక్ కు గురి చేస్తోంది.

"నాతో కలిసి పని చేసిన వాళ్లకు నేనేంటో తెలుసు. అంత వరకూ నా గురించి ఏదేదో అనుకున్నారు. నేనో ఫైర్ బ్రాండ్ అనుకున్నారు. నాతో కలిసి పని చేసిన తర్వాత నేనేంటో వాళ్లకు తెలిసింది. నన్ను చాలా మంది మోసం చేశారు. వాళ్లందరినీ గుర్తు పెట్టుకొని కక్ష సాధించే పని ఎప్పుడూ చేయలేదు.

అది నా మంచితనమో, పిచ్చితనమో తెలియదు. నాకు రావాల్సిన క్రెడిట్ దక్కని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 24 ఎపిసోడ్లు చేసిన తర్వాత 25వ ఎపిసోడ్ కేక్ కటింగ్ సమయానికి నన్ను దూరం పెట్టారు. ఓ డ్యాన్స్ షో 99 ఎపిసోడ్లు చేసిన తర్వాత 100వ ఎపిసోడ్ మరొకరితో చేశారు. అందుకు కారణమేంటో వాళ్లు చెప్పలేదు. నేనూ అడగలేదు" అని ఝాన్సీ చెప్పుకొచ్చింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం